News


మూడు రంగాలపై హెచ్‌డీఎఫ్‌సీ సెక్‌ బుల్లిష్‌

Friday 18th October 2019
Markets_main1571337852.png-28960

ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, డిజిటల్‌/ఇంటర్నెట్‌ కంపెనీలపై హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ బుల్లిష్‌గా ఉంది. అదే సమయంలో మెటల్స్‌, రియల్టీ, హెల్త్‌కేర్‌ రంగాల పట్ల ప్రతికూల ధోరణితో ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ఎండీ, సీఈవో ధీరజ్‌రెల్లి ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. 

 

  • సమీప కాలంలో సూచీలు కాస్త పెరగొచ్చు. కంపెనీల ఫలితాలతోపాటు వచ్చే వ్యాఖ్యలు ఆశావహంగా లేకపోతే మరోసారి అధిక స్థాయిల వద్ద లాభాల స్వీకరణ చోటు చేసుకోవచ్చు.
  • మా కస్టమర్లు అంతర్జాతీయంగా ఇన్వెస్ట్‌ చేసేందుకు స్టాకాల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నాం. దాంతో యూఎస్‌ ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. అమెరికా మార్కెట్‌ చక్కని నియంత్రణలతో కూడిన పారదర్శక మార్కెట్‌. భారతీయ తరహా ఇన్వెస్టింగ్‌ మనస్తత్వానికి సౌకర్యంగా ఉంటుంది.
  • తదుపరి దశ ర్యాలీని నడిపించే రంగాలు.. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, బీఎఫ్‌ఎస్‌ఐ, డిజిటల్‌/ఇంటర్నెట్‌ స్టాక్స్‌. 
  • అంతర్జాతీయ వృద్ధిపై ఆందోళనలు, అధిక రుణ భారం కారణంగా మెటల్స్‌, అధిక అమ్ముడుపోని నిల్వల కారణంగా రియల్టీ, నియంత్రణ సంస్థల ఆందోళనలు, ధరలపరమైన ఒత్తిళ్లు, స్థానిక ఒత్తిళ్లు కారణంగా హెల్త్‌కేర్‌స్టాక్స్‌కు ప్రస్తుతం దూరంగా ఉండడం సూచనీయం.
  • అంతర్జాతీయ సంకేతాలు తాత్కాలికంగా స్థిరపడ్డాయి. స్థానికంగా ఆర్థిక గణాంకాలు మెరుగుపడాల్సి ఉంది. ప్రాథమిక సంకేతాల ప్రకారం పండుగల సీజన్‌ డిమాండ్‌ బాగుంది. వర్షాలు బాగున్నాయి. ఇవి పట్టణ, గ్రామీణ వినియోగంపై సానుకూల ప్రభావం చూపించనున్నాయి. ఈ పరిణామాలకు తోడు ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన చర్యలతో సెంటిమెంట్‌ టర్న్‌ అరౌంట్‌ అవుతుంది. 
  • లిక్విడిటీ సమస్యల పరిష్కారం, బ్యాడ్‌ బ్యాంకు ఏర్పాటు వంటి చర్యలతో ఎన్‌పీఏలకు పరిష్కారం, న్యాయపరమైన ప్రక్రియను వేగవంతం చేయడం అవసరం. 
  • స్థూల ఆర్థిక గణాంకాలు మెరుగుపడితే, కార్పొరేట్‌ ఫలితాల పట్ల నమ్మకం కుదిరితే మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాక ఊపందుకుంటుంది. ఇన్వెస్టర్లు స్థిరాదాయ పథకాల్లో తమ పెట్టుబడులను ఉంచడానికి మొగ్గు చూపించారు. సెంటిమెంట్‌ మెరుగుపడితే ఈక్విటీలకు కేటాయింపులను పెంచుకోవడాన్ని పరిశీలిస్తారు. 
     You may be interested

ప్రారంభంలో సెన్సెక్స్‌ ప్లస్‌...నిఫ్టీ మైనస్‌

Friday 18th October 2019

పలు సానుకూల అంశాల నడుమ క్రితం రోజు పెద్ద ర్యాలీ జరిపిన భారత్‌ స్టాక్‌ సూచీలు శుక్రవారం దాదాపు స్థిరంగా మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 35 పాయింట్ల లాభంతో 39,087 పాయింట్ల వద్ద మొదలుకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 6 పాయింట్ల నష్టంతో 11,580 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యింది. 

ఇవి మల్టీ బ్యాగర్లేనా..?

Friday 18th October 2019

మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ విభాగం గణనీయంగా దిద్దుబాటుకు గురైన ఈ తరుణంలో.. ఓ స్టాక్‌ను జాగ్రత్తగా ఎంపిక చేసుకుని పెట్టుబడి పెట్టడం వల్ల రానున్న కాలంలో మల్టీబ్యాగర్‌గా మారొచ్చేమో..?! కాకపోతే ఇదంతా ఎంపికలోనే ఉంటుంది. మల్టీబ్యాగర్‌ అయ్యే స్టాక్స్‌ను గుర్తించడం ఎలా..? అన్న సందేహం చాలా మందికి ఉంటుంది. ఇప్పటికే మల్టీబ్యాగర్‌ రిటర్నులు ఇచ్చిన వాటిని పరిశీలిస్తే కొంత మేరకు అర్థం చేసుకోవచ్చు.   సహ్‌యోగ్‌ మల్టీబేస్‌. గత దీపావళి నుంచి ఇప్పటికి 1,755

Most from this category