News


హెచ్‌డీఎఫ్‌సీ క్యూ1: నికర లాభంలో 46 శాతం వృద్ధి

Friday 2nd August 2019
Markets_main1564737014.png-27503

హెచ్‌డీఎఫ్‌సీ తన జూన్‌ క్వార్టర్‌ ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. ఏడాది ప్రాతిపదికన స్టాండ్‌ ఎలోన్‌ లాభంలో 46 శాతం వృద్ధిని సాధించి, రూ.3,202 కోట్లను నమోదుచేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఈ లాభం రూ.2,190 కోట్లుగా ఉంది. కాగా మార్కెట్లు స్టాండ్‌ఎలోన్‌ లాభం రూ.3,040 కోట్లుగా ఉంటాయని అంచనా వేశాయి. గృహ్‌ ఫైనాన్స్‌లోని కొంత వాటాను విక్రయించడంతో రూ.1,895 కోట్ల లాభం చేకూరిందని కంపెనీ తెలిపింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) రూ. 2,562 కోట్లను నమోదుచేయగా, ఈ ఏడాది జూన్‌ త్రైమాసికంలో ఈ ఆదాయం రూ.2,739 కోట్లకు పెరిగింది. 



You may be interested

5ఏళ్ల కనిష్టస్థాయికి అశోక్‌లేలాండ్‌

Friday 2nd August 2019

దేశీయ వాణిజ్య వాహన తయారీ దిగ్గజం అశోక్‌లే లాండ్‌ కంపెనీ షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో 5ఏళ్ల కనిష్టానికి పతనమయ్యాయి. కంపెనీ జూలై మాసపు వాహన విక్రయ గణాంకాలు ఆశించిన స్థాయిలో నమోదుకాకపోవడం ఇందుకు కారణమైంది. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ రూ.68.30 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నిన్న(ఆగస్ట్‌ 01) కంపెనీ జూలై విక్రయాలు గణాంకాలను విడుదల చేసింది. ఈ జూలైలో మొత్తం అమ్మకాలు 28శాతం క్షీణించి 10927 యూనిట్లను విక్రయించింది.

సెన్సెక్స్‌ 634 పాయింట్ల రికవరి

Friday 2nd August 2019

నష్టాలతో ప్రారంభమైన మార్కె్‌ట్‌ మిడ్‌సెషన్‌ సమయానికి లాభాల్లో మళ్లింది. ఇటీవల మార్కెట్లో భారీ పతనంతో కనిష్టస్థాయిలకు పతనమైన షేర్లు చౌక ధరలకు లభిస్తుండంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు పూనుకున్నారు. పలితంగా సూచీలు ఉదయం నష్టాలను పూడ్చుకొని లాభాల్లోకి మళ్లాయి. అటో, ఫార్మా, ఆర్థిక రంగ షేర్లు కొనుగోళ్లకు మద్దతు లభించడంతో నిఫ్టీ ఇంట్రాడే కనిష్టం(10,848.95) నుంచి 192 పాయింట్ల రికవరినీ, సెన్సెక్స్‌ కనిష్టస్థాయి(36,607.41) నుంచి 634 పాయింట్ల రికవరిని సాధించాయి. మరోవైపు

Most from this category