News


హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎఫ్‌ జనవరిలో కొన్న షేర్లివే!

Tuesday 11th February 2020
Markets_main1581419131.png-31700

 

 దేశీయ అతిపెద్ద హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ జనవరిలో కొనుగోలు చేసిన షేర్లలో పబ్లిక్‌ సెక్టార్‌ కంపెనీలు, ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జూమర్‌ గూడ్స్‌(ఎఫ్‌ఎంసీజీ), హోటళ్లు, ఫార్మాలు ఉన్నాయి. ఎన్‌టీపీసీ, కోల్‌ఇండియా, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, ఓఎన్‌జీసీలలో ఒక్కోదానిలో కోటికిపైగా షేర్లను కొనుగోలు చేసింది.  మెరుగైన పనితీరు, ప్రభుత్వ వాటా తక్కువగా ఉండడంతో మరోసారి ఎన్‌టీపీసీ వృద్ధిని సాధిస్తుందని హెచ్‌డీఎఫ్‌సీ అంచనావేస్తోంది. మరోవైపు దలాల్‌ స్ట్రీట్‌లో టాప్‌ 3లో ఉన్న కంపెనీలు రియలన్స్‌ ఇండస్ట్రీస్‌(77 లక్షల షేర్లు) హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (35 లక్షల షేర్లు) టీసీఎస్‌(25 లక్షల షేర్లు) ల్లో భారీగా షేర్లను విక్రయించింది.

కోటికిపైగా షేర్లలో..
 జనవరిలో హెచ్‌డీఎఫ్‌సీ మ్యుచువల్‌ ఫండ్‌  కొన్న షేర్లలో అంబుజా సిమెంట్‌, గెయిల్‌ ఇండియా, ఐటీసీ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఐసీఐసీఐ బ్యాంక్‌, భారత​ ఎలక్ట్రానిక్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఈఐహెచ్‌, సన్‌ ఫార్మా, ఫస్ట్‌సోర్స్‌ సొల్యూషన్‌, ఆర్‌ఈసీ, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, ఇన్ఫోసిస్‌, లుపిన్‌, ఇండియన్‌ హోటల్‌, కోల్‌గెట్‌ పామోలివ్‌, టాటా స్టీల్‌, డెల్టా క్రాప్‌, లార్సన్‌ అండ్‌ టుబ్రో, టైటాన్‌ వంటి మొదలైన కంపెనీలు ఉన్నాయి. 


హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ తన ఫోర్ట్‌పోలియోలో మరిన్ని కొన్న షేర్లలో..
ఎంఅండ్‌ఎం పైనాన్సియల్‌ సర్వీసెస్‌(4.26 లక్షల షేర్లు), భారతీ ఎయిర్‌ టెల్‌(3.97 లక్షల షేర్లు), హిందాల్కో (3.89 లక్షల షేర్లు), గ్యాబ్రియల్‌ ఇండియా (3.46 లక్షల షేర్లు)తో పాటు గ్లెన్‌మార్క్‌ ఫార్మా(3.43 లక్షలు), ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌(2.94 లక్షలు), గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌(2.81 లక్షలు), యునైటెడ్‌ స్పిరిట్స్‌(2.74 లక్షలు), తేజస్‌ నెట్‌వర్క్‌(2.69 లక్షలు) , జీ ఎంటర్‌టైన్‌మెంట​(2.63 లక్షలు), పర్‌సిస్టెంట్‌ సిస్టమ్స్‌(2.54 లక్షలు) కెనరా బ్యాంక్‌(2.63 లక్షలు) షేర్లు ఉన్నాయి. 

ఇంకా  కొన్న షేర్లలో...
 హీరో మోటోకార్ప్‌ (1.27 లక్షలు), ఆదానీ పోర్ట్స్‌(1 లక్ష), హెచ్‌యూఎల్‌(0.96 లక్షలు), బజాజ్‌ ఆటో (0.83 లక్షలు) ,  ఐటీ, ఆటో, ఎఫ్‌ఎంసీజీలలో ప్రత్యేకంగా ఎంపిక చేసిన వాటిలో ఈక్లర్క్స్‌, టెక్‌ మహీంద్రా, బ్రిటానియా ఇండస్ట్రీస్‌, గోద్రేజ్‌ కన్జూమర్‌ ప్రోడక్ట్స్, మారుతీ సుజుకీ, యస్‌ బ్యాంక్‌లు ఉన్నాయి. ఇంకా ఈ ఏఎంసీలో  పవర్‌ గ్రిడ్‌(45 లక్షలు), బీపీసీఎల్‌(22 లక్షలు) టాటా ఎమికల్స్‌(15 లక్షలు) , బీహెచ్‌ఈఎల్‌( 14 లక్షలు), ఆదానీ పవర్‌(13 లక్షలు) ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌ (8 లక్షలు) వాటాను విక్రయించింది. కాగా ప్యూచర్‌ సప్లై చెయిన్‌, ఎమ్‌లీయోడ్‌ రస్సెల్‌, ఎన్‌ఎండీసీ, ఎంటర్‌టైన్‌ నెట్‌వర్క్‌లలో మొత్తంవాటాను విక్రయించింది.You may be interested

టాటా స్టీల్‌కు బై రేటింగ్‌

Tuesday 11th February 2020

యూరోపియన్‌ కార్యకలాపాల్లో నింబంధనలు బలహీనంగా ఉండడం, విక్రయాలు తగ్గడంతో టాటా స్టీల్‌ డిసెంబర్‌తో ముగిసిన క్యూ3లో కన్సాలిడేటెడ్‌ నికర నష్టం రూ.1,22.53 కోట్లుగా ప్రకటించింది. అంతేగాక గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే స్టాండేలోన్‌ నికర లాభం తగ్గి రూ,2,456.09 కోట్ల నుంచి రూ.1,803.83 కోట్లకు చేరింది. చైనాలో కరోనా వైరస్‌ ప్రభావంతో చైనాలో ఉత్పత్తులు పడిపోతాయిని ఎమ్‌కే గ్లోబల్‌ ఫైనాన్సియల్‌ సర్వీస్‌ భావిస్తోంది. దీంతో స్టీల్‌ కొరత

జనవరిలో కొనసాగిన ‘‘ సిప్‌’’ల హవా..!

Tuesday 11th February 2020

ఈక్విటీ మార్కెట్లు భారీగా ఒడిదుడుకులకు లోనైనప్పటికీ, సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌)లో పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్ల ఏమాత్రం వెనక్కి తగ్గడటం లేదు. జనవరిలో మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లో సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) రూపంలో రూ.8,231 కోట్ల పెట్టుబడులు తరలివచ్చాయి. డిసెంబర్‌లో సిప్‌ మార్గంలో వచ్చిన పెట్టుబడులు రూ.8,519 కోట్లతో పోలిస్తే జనవరిలో రూ.14 కోట్లు పెరిగాయి. సిప్స్‌ బలంగా కొనసాగడం ఆరోగ్యకర పరిణామమని మార్నింగ్‌స్టార్‌ ఫండ్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌

Most from this category