News


హెచ్‌డీఎఫ్‌సీ షేరు టార్గెట్‌ పెంపు!

Tuesday 28th January 2020
Markets_main1580194087.png-31266

క్యూ3 ఫలితాల నేపథ్యం
బ్రోకింగ్‌ సంస్థల తాజా అంచనాలు

మార్టిగేజ్‌ రుణాల దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ ఈ ఏడాది(2019-20) మూడో త్రైమాసిక ఫలితాలు విడుదల చేసిన నేపథ్యంలో పలు బ్రోకింగ్‌ సంస్థలు ఈ కౌంటర్‌పట్ల ఆశావహంగా స్పందిస్తున్నాయి. కంపెనీ ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో స్టాండెలోన్‌ ప్రాతిపదికన నాలుగు రెట్లు అధికంగా రూ. 8372 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇందుకు గృహ ఫైనాన్స్‌, బంధన్‌ బ్యాంక్‌ మధ్య విలీనంకారణంగా లభించిన రూ. 9020 కోట్ల అదనపు లాభం ఆర్జించడం సహకరించింది. కాగా.. మార్పిడి రహిత డిబెంచర్ల(ఎన్‌సీడీలు) జారీ ద్వారా రూ. 45,000 కోట్లు సమీకరించేందుకు ఇదే సమయంలో బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రీసెర్చ్‌ సంస్థలు హెచ్‌డీఎఫ్‌సీ కౌంటర్‌ రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

క్యూ3 ఫలితాల నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ షేరు టార్గెట్‌ ధరను జెఫరీస్‌ రూ. 2745కు పెంచింది. గతంలో రూ. 2510 ధరను ప్రకటించింది. అండర్‌రైటింగ్‌ నైపుణ్యం, పటిష్ట పంపిణీ, చౌకగా నిధుల సమీకరణ తదితర అంశాలు సమస్యాత్మక వాతావరణంలోనూ హెచ్‌డీఎఫ్‌సీ మెరుగైన పనితీరు చూపేందుకు దోహదం చేస్తున్నట్లు జెఫరీస్‌ పేర్కొంది.

హెచ్‌డీఎఫ్‌సీ షేరుకి గతంలో ఇచ్చిన కొనుగోలు(బయ్‌) సిఫారసును కొనసాగిస్తున్నట్లు జేంఎ ఫైనాన్షియల్‌ తాజాగాపేర్కొంది. రూ. 2700 టార్గెట్‌ ధరను ప్రకటించింది. రానున్న రెండేళ్ల కాలంలో హెచ్‌డీఎఫ్‌సీ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 16 శాతం పుంజుకోగలదని జేఎం అంచనా వేస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీతోపాటు గ్రూప్‌ సంస్థలు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, లైఫ్‌, ఏఎంసీలు మాతృ సంస్థ విలువ పెరిగేందుకు సహకరించగలవని పేర్కొంది.



You may be interested

డాక్టర్‌ రెడ్డీస్‌పై బ్రోకింగ్‌ సంస్థలు బుల్లిష్‌

Tuesday 28th January 2020

క్యూ3 ఫలితాల నేపథ్యం టార్గెట్‌ ధరలు పెంపు ఫార్మా రంగ దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ లిమిటెడ్‌ ఈ ఏడాది(2019-20) మూడో త్రైమాసికంలో అంచనాలను మించిన ఫలితాలు సాధించిన నేపథ్యంలో పలు బ్రోకింగ్‌ సంస్థలు ఈ కౌంటర్‌పట్ల ఆశావహంగా స్పందిస్తున్నాయి.ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో డాక్టర్‌ రెడ్డీస్‌ రూ. 570 కోట్ల నికర నష్టం ప్రకటించింది. నువరింగ్‌సహా కొన్ని ప్రొడక్టులకు సంబంధించి రూ. 1320 కోట్లమేర ఇంపెయిర్‌మెంట్‌ చార్జీలు(నష్టం) నమోదుకావడం లాభాలను దెబ్బతీసినట్లు కంపెనీ

ఈ స్టాకుల్లో ఎంఏసీడీ బై సిగ్నల్స్‌!

Tuesday 28th January 2020

సోమవారం ముగింపు ప్రకారం 26 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌ సంకేతాలు ఇస్తోంది. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా  మారిన కంపెనీల్లో ఐబీ హౌసింగ్‌, యాక్సిస్‌బ్యాంక్‌, ఆర్‌ఈసీ, హశ్రీచ్‌పీసీఎల్‌, కర్నాటక్‌ బ్యాంకు, టెక్‌మహీంద్రా, ఎస్‌బీఐ లైఫ్‌, ఏఫిల్‌ ఇండియా, జేఎస్‌డబ్ల్యు ఎనర్జీ, బామర్‌ అండ్‌ లౌరీ, శిల్పా మెడికేర్‌ తదితరాలున్నాయి. ఈ కౌంటర్లలో ట్రెండ్‌ బలంగా ఉందని టెక్నికల్‌

Most from this category