News


పతనం నుంచి హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ రికవరీ

Wednesday 14th August 2019
Markets_main1565769922.png-27763

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ షేర్లు బుధవారం 7.50శాతం పతనం నుంచి రివకరి అయ్యాయి. స్టాండర్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ వాటాను విక్రయించడంతో ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో 7.50శాతం క్షీణించాయి. నేడు ఈ కంపెనీ షేర్లు రూ.489.90 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ కంపెనీకి చెందిన ప్రతి షేరు ధర రూ.486 చొప్పున 3.2శాతానికి సమానమైన 6.4 కోట్ల ఈక్విటీ షేర్లు బ్లాక్‌డీల్‌ ద్వారా చేతులు మారినట్లు గణాంకాలు తెలియజేశాయి. ఈ వాటా విక్రయానికి బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిలించ్‌ మధ్యవర్తిత్వం వహించినట్లు తెలుస్తోంది. దీంతో ఇన్వెస్టర్లు ఈ షేర్ల అమ్మకాలకు మొగ్గుచూపడంతో ఈ షేర్లు ఒకదశలో 7.50శాతం క్షీణించి రూ.480.35ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదుచేశాయి. అయితే మిడ్‌సెషన్‌ సమయానికి రివకరీని సాధించి 1శాతం నష్టంతో రూ.520 వద్ద ట్రేడ్‌ అవుతోంది. హెచ్‌డీఎఫ్‌సీ ఇన్సూరెన్స్‌ కంపెనీలో స్టాండర్డ్‌ లైఫ్‌ మెచ్యూరిటీస్‌ హోల్డింగ్స్‌ 23.02శాతం వాటా, హెచ్‌డీఎఫ్‌సీ 51.48శాతం వాటాను కలిగి ఉంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.345.00 రూ.545.00లుగా నమోదయ్యాయి. 



You may be interested

ఇండియా మార్కెట్టే బెటర్‌!

Wednesday 14th August 2019

వర్ధమాన మార్కెట్ల కన్నా మంచి ప్రదర్శన ఈపీఎఫ్‌ఆర్‌ రిసెర్చ్‌ డైరెక్టర్‌ కామెరాన్‌ బ్రాండ్‌ వాణిజ్యయుద్ధ వైరస్‌ వేగంగా వ్యాపిస్తున్న కారణంగా ఈ ఏడాది ఇండియా సహా ఏ ఇతర వర్ధమాన మార్కెట్‌లోకి కూడా భారీ విదేశీ నిధులు రాకపోవచ్చని ఈపీఎఫ్‌ఆర్‌ రిసెర్చ్‌ డైరెక్టర్‌ కామెరాన్‌ బ్రాండ్‌ అభిప్రాయపడ్డారు. అయితే ఆసియాలోని ఇతర వర్ధమాన దేశాల మార్కెట్ల కన్నా భారత్‌ మంచి ప్రదర్శన చూపుతుందన్నారు. భారత సంస్కరణల ప్రభావం ఇంకా పూర్తిస్థాయిలో కనిపించాల్సిఉందన్నారు. దీర్ఘకాలానికి

ఇంకో వారంలో ఎఫ్‌ఐఐల ఇన్‌ఫ్లో!

Wednesday 14th August 2019

‘గత నెల నుంచి ఇప్పటి వరకు గమనిస్తే విదేశి నిధుల ఔట్‌ ఫ్లో అన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్లలో కొనసాగుతుందనే విషయం అర్థమవుతుంది. ముందు, బడ్జెట్‌ పన్ను ప్రతిపాదనలు విదేశి నిధుల ఔట్‌ ఫ్లోకి కారణమయితే ఇప్పుడు ఎమెర్జింగ్‌ మార్కెట్ల నుంచి నిధుల ప్రవాహాం జరగడం, కారణంగా ఉంది’ అని సుందరం మ్యూచువల్‌ ఫండ్స్‌ ఎండీ, సీఈఓ, సునిల్‌ సుబ్రమణ్యిం ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు.

Most from this category