STOCKS

News


హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌ షేర్ల భారీ పతనం

Monday 22nd July 2019
Markets_main1563788797.png-27234

5శాతం క్షీణించిన హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌
2నెలల కనిష్టానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు

హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌ షేర్లు సోమవారం భారీగా నష్టపోయాయి. ఈ గ్రూప్‌లో ప్రధాన షేర్లైన హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు , హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ షేర్లు 2-6శాతం క్షీణించాయి. ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో ఈ గ్రూప్‌ షేర్లు 12శాతం నుంచి 53శాతం మేర లాభపడ్డాయి. షేర్లు అధిక వాల్యూయేషన్‌ వద్ద ట్రేడ్‌ అవుతున్న తరుణంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన ఈ హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం పతనంతో నేడు నిఫ్టీ కోల్పోయిన మొత్తం పాయింట్ల 118 పాయింట్లలో ఈ రెండు షేర్ల వాటా 86పాయింట్లు కావడం విశేషం. అలాగే ఈ రెండు షేర్లు నేడు రూ.44వేల కోట్ల మార్కెట్‌ క్యాప్‌ను కోల్పోయాయి. 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 2నెలల కనిష్టానికి పతనం:- గతవారంలో శనివారం క్యూ1 ఫలితాలు మార్కెట్‌ వర్గాల అంచనాలకు అందుకున్నప్పటీకి.., షేరు మాత్రం 2నెలల కనిష్టానికి పతనమైంది. త్రైమాసికంలో నిర్థక ఆస్తులు పెరగడం షేరు క్షీణతకు కారణమైంది. ఈ క్వార్టర్‌లో బ్యాంకు స్థూల ఎన్‌పీఏలు 1.40శాతంగానూ, నికర ఎన్‌పీఏలు 0.45శాతం గా నమోదయ్యాయి. బ్యాంకు మొత్తం రుణాల్లో స్థూల ఎన్‌పీఏలు రూ.11, 768 కోట్లుగానూ, నికర ఎన్‌పీఏలు రూ.3567 కోట్లుగా ఉన్నట్లు బ్యాంకు ప్రకటించింది. ఒకదశలో 4శాతం క్షీణించి రూ.2281.90 కనిష్టానికి చేరుకున్నాయి. మధ్యాహ్నం గం.2:30ని.లకు షేరు గతముగింపు ధర(రూ.2375.95)తో పోలిస్తే 3.50శాతం నష్టంతో పోలిస్తే రూ.2294.35ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.1884.40లు రూ.2502.90లుగా నమోదయ్యాయి. 


5.50శాతం క్షీణించిన హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌:- నేడు రూ.2304.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అటో పరిశ్రమ నెమ్మదించడటం,  చిన్న, మధ్య తరహా పరిశ్రమ, వ్యవసాయరంగంలో వృద్ధి క్షీణత రానున్న రోజుల్లో రుణాలపై ప్రభావాన్ని చూపవచ్చనే ఆందోళనలు షేరుపై ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా షేర్లు ఇంట్రాడేలో 5.37శాతం క్షీణించి రూ.2303.9ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని పతనమయ్యాయి. మధ్యాహ్నం గం.2:30ని.లకు షేరు గతముగింపు ధర(రూ.2303.9)తో పోలిస్తే 5శాతం నష్టంతో పోలిస్తే రూ.2303.9ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.1646.00లు రూ.2357.00లుగా నమోదయ్యాయి.
  
హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ 6శాతం క్షీణించగా, హెచ్‌డీఎఫ్‌సీ ఇన్సూరెన్స్‌ కంపెనీ 3శాతం మేర నష్టపోయాయి. You may be interested

ఆర్‌ఐఎల్‌పై బ్రోకరేజ్‌లు పాజిటివ్‌

Monday 22nd July 2019

క్యు1 ఫలితాల అనంతరం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరుపై బ్రోకరేజ్‌ సంస్థలు పాజిటివ్‌ అభిప్రాయం వ్యక్తం చేశాయి. క్యు1లో కంపెనీ లాభంలో సుమారు 7 శాతం వృద్ధి నమోదయింది. ఈ నేపథ్యంలో బ్రోకింగ్‌ సంస్థలు ఆర్‌ఐఎల్‌పై బుల్లిష్‌గా మారాయి. - బోఫాఎంఎల్‌: కొనొచ్చు రేటింగ్‌ కొనసాగింపు. టార్గెట్‌ ధర రూ. 1560కి పెంపుదల. అన్ని విభాగాల్లో అంచనాలకు మించిన ప్రదర్శన చూపింది. ఈపీఎస్‌ అంచనాలను 2-3 శాతం మేర పెంచింది. మందకొడి సమయంలో

మిశ్రమంగా మెటల్‌ షేర్లు..

Monday 22nd July 2019

నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి 1.56 శాతం లాభపడి 2,784.55 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో  వేదాంత  3.97 శాతం, సెయిల్‌ 3.36 శాతం, హిందల్కో ఇండస్ట్రీస్‌ లి. 2.30 శాతం, జిందాల్‌ స్టీల్‌ 2.24 శాతం, జేఎస్‌డబ్యూ స్టీల్‌ 2.07 శాతం, హిందుస్థాన్‌ జింక్‌ లి.1.86 శాతం, టాటా స్టీల్‌ 1.54 శాతం, నేషనల్‌ అల్యూమినియం కార్పోరేషన్‌ 0.44 శాతం లాభపడి ట్రేడవుతుండగా,

Most from this category