News


ప్రస్తుత స్థాయిల్లో వీటిల్లో కొనుగోళ్లు?

Sunday 23rd June 2019
Markets_main1561314532.png-26508

ఇన్వెస్టర్లు బలమైన మూలాలు కలిగిన స్టాక్స్‌, మంచి కార్పొరేట్‌ పాలనా ప్రమాణాలు, ఆరోగ్యకరమైన బ్యాలన్స్‌ షీటు, సహేతుక వ్యా‍ల్యూషన్‌, మంచి వృద్ధి అవకాశాలు కలిగిన కంపెనీలపై దృష్టి సారించొచ్చని రెలిగేర్‌ బ్రోకింగ్‌ రిటైల్‌ డిస్ట్రిబ్యూషన్‌ ప్రెసిడెంట్‌ జయంత్‌ మంగ్లిక్‌ సూచించారు. ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన ఈ సందర్భంగా పలు అంశాలపై తన అభిప్రాయాలను తెలియజేశారు. 

 

‘‘నిఫ్టీ గత గురువారం పెరగడం రివకరీ ఆశలు కల్పించింది. అయితే, 11,800పైన నిలదొక్కుకోకపోవడం, కనిష్ట స్థాయిలోకి జారుకోవడం అన్నవి రానున్న వారంలో మరింత స్థిరీకరణ ఉంటుందన్న దానికి సంకేతం. ట్రేడర్లు పొజిషన్లను హెడ్జ్‌ చేసుకుని, మరింత స్పష్టత కోసం వేచి చూడడం మంచిది. 300 స్మాల్‌, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ 52 వారాల కనిష్ట స్థాయిలను నమోదు చేయడం పెద్ద ఆశ్చర్యకరమేమీ కాదు. బలహీన కార్పొరెట్‌ గవర్నెన్స్‌, ప్రమోటర్లు అధిక మొత్తంలో షేర్ల తనఖా, బలహీన ఆర్థిక ఫలితాలు, వినియోగం తగ్గుదల వంటి అంశాలు స్టాక్స్‌ పతనానికి కారణమయ్యాయి. రిస్కీ స్టాక్స్‌కు మరిన్ని నష్టాలు, అదే సమయంలో మంచి స్టాక్స్‌కు లాభాల ధోరణి ఇక ముందూ కొనసాగుతుంది. రానున్న కేంద్ర బడ్జెట్‌ నేపథ్యంలో మిడ్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌లో అస్థిరతలు ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నాం. నిరుద్యోగం పెరుగుదల, ద్రవ్యలోటు, లిక్విడిటీ ఆందోళనల నేపథ్యంలో బడ్జెట్‌పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన బెట్టే సంస్కరణలను తీసుకొస్తుందని అంచనాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో స్టాక్‌ వారీ విధానాన్ని అనుసరించాలి. అలాగే, నాణ్యమైన స్టాక్స్‌లో క్రమానుగతంగా ఇన్వెస్ట్‌ చేయడం మంచి వివేకంతో కూడిన ఆలోచన.

 

ఇన్వెస్ట్‌మెంట్‌ బెట్స్‌
ఫండమెంటల్‌గా బలమైన స్టాక్స్‌పైనే దృష్టి పెట్టడం మంచిది. ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో ప్రస్తుతం నడుస్తున్న లిక్విడిటీ సమస్య, ప్రమోటర్ల వాటాల్లో అధిక తాకట్టు, పెద్ద ఎత్తున రుణ భారం, ఇన్వెస్టర్ల సంపదను గణనీయంగా తుడిచిపెట్టేశాయి. ముఖ్యంగా ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో దీన్ని చూడొచ్చు. ఆటో, కన్జ్యూమర్‌ స్టాపుల్స్‌, మెటల్స్‌ అన్నవి రంగాలవారీ క్షీణతను ఎదుర్కొంటున్నాయి. ఫార్మా ఇప్పటికీ యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతులు, ధరల పరంగా సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో ప్రత్యేకంగా ఓ రంగాన్ని పెట్టుబడుల కోసం ఎంచుకోకుండా స్టాక్‌ వారీ విధానాన్ని అనుసరించడమే మంచిది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, డాబర్‌ ఇండియా, బ్రిటానియా ఇండస్ట్రీస్‌, గోద్రేజ్‌ కన్జ్యూమర్‌, వోల్టాస్‌, ఐజీఎల్‌, మారుతి సుజుకి, ఎంఅండ్‌ఎంలను భవిష్యత్తు దృష్ట్యా పెట్టుబడుల కోసం పరిశీలించొచ్చు’’ అని జయంత్‌ మంగ్లిక్‌ సూచించారు. You may be interested

పెరిగిన క్రూడ్‌ ధరలు

Monday 24th June 2019

పశ్చిమాసియా దేశాలలో ఉద్రిక్తతలే వలన చమురు ధరలు సోమవారం​ పెరిగాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ధర 0.6 శాతం పెరిగి బ్యారెల్‌కు 65.57డాలర్ల వద్ద , డబ్యూటీఐ క్రూడ్‌ బ్యారెల్‌కు 0.8 శాతం పెరిగి 57.86డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇరాన్‌పై ఆంక్షలుంటాయని యూఎస్‌ సెక్రటరి మైక్‌ పాంపో ఆదివారం అనడంతో పాటు డాలర్‌ బలహీనపడడం కూడా ధరలు పెరగడానికి కారణం

ఇన్వెస్ట్‌ చేసే ముందు ఈ అంశాలు ఒక్కసారి...

Sunday 23rd June 2019

స్టాక్‌ మార్కెట్లో కూడబెట్టుకోవాలన్నది ప్రతీ ఇన్వెస్టర్‌ సంకల్పం. అయితే, కష్టార్జితాన్ని తీసుకెళ్లి చెత్త కుప్పులో పడేయలేం కదా... పెట్టుబడులను తుడిచిపెట్టేవి కాకుండా, మంచి రాబడులను ఇచ్చే వాటిని ఎంచుకోవాలి. కనుక ఇన్వెస్ట్‌ చేసే ముందు తగినంత సాధన అవసరం. మరి ఓ మంచి కంపెనీని గుర్తించి పెట్టుబడులు పెట్టడం ఎలా..? అన్న సందేహం రావచ్చు. అందుకు నిపుణులు సూచిస్తున్న అంశాలు కొన్ని...   వ్యాపార నమూనా ఓ కంపెనీ అసలు ఏ వ్యాపారం చేస్తుందన్నది

Most from this category