News


10శాతం పెరిగిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

Thursday 26th March 2020
Markets_main1585205829.png-32687

  • మోర్గాన్‌ స్టాన్లీ టార్గెట్‌ ధర పెంపు

గడిచిన మూడు రోజులుగా భారీ పతనాన్ని చవిచూసిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేరు గురువారం ఉదయం ట్రేడింగ్‌లో ఏకంగా 10శాతం లాభపడింది. మార్కెట్‌ పతనంలో భాగంగా ఈ హెవీవెయిట్‌ షేరు ఫిబ్రవరి 1 నుంచి ఏకంగా 30శాతం నష్టాన్ని చవిచూసింది. ఇంత స్థాయిలో పతనమైనప్పటికి ఈ షేరుపై పలు బ్రోకరేజ్‌ సంస్థలు ఇప్పటికీ బుల్లిష్‌ ధృక్పథాన్ని కలిగి ఉన్నాయి. 

నేడు ఈ షేరు బీఎస్‌ఈలో రూ.874.50 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో షేరు ఒక దశలో 10శాతం పెరిగి రూ.937.70 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12గంటలకు షేరు మునుపటి ముగింపు (రూ.855.55) తో పోలిస్తే 7.50శాతం లాభపడి రూ.918.85 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.738.90, 1304.10గా ఉన్నాయి. 

మోర్గాన్‌ స్టాన్లీ బ్రోకరేజ్‌ సంస్థ నివేదిక: 
రేటింగ్‌: ఓవర్‌ వెయిట్‌
టార్గెట్‌ ధర: రూ.1285

విశ్లేషణ:-

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నిర్మాణపరంగా బలంగా. ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ ధర వద్ద ట్రేడ్‌ అవుతోంది. బ్యాలెన్స్‌ షీట్‌పై ఎలాంటి ఒత్తిడి లేదు. తన పోటీదారులతో పోలిస్తే బ్యాంక్‌ డిజిటలైజేషన్‌ అంశంలో ముందు వరుసలో ఉంది. బ్రాంచులను పెంచుకోవడం, సీఎస్‌సీ భాగస్వామ్యం, మర్చెంట్‌ విలీనాల లాంటి అతర్గత అంశాలతో ఉత్పత్తి పంపిణీ సామర్థ్యాలను మరింత మెరుగుపరుచుకుంది.

ఇటీవల జరిగిన కరెక‌్షన్‌తో వాల్యూయేషన్లు ‘‘ప్రపంచ ఆర్థిక సంక్షోభం(2008)’’ నాటి స్థాయికి దిగివచ్చాయి. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కారణంగా స్టాక్‌ మార్కెట్లో అనిశ్చితి వాతావరణం నెలకొంది. అయితే బలమైన బ్యాలెన్స్ షీట్, మెరుగైన లాభదాయకత, అధిక వృద్ధి సామర్థ్యం తదితర అంశాల నేపథ్యంలో ఈ షేరులో ఆకర్షణీయమైన రిస్క్‌-రివార్డ్‌ను చూడవచ్చు. 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఇటీవలి కార్యక్రమాలు మంచి పనితీరును కనబరుస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ స్థిరపడితే షేరు 20శాతానికి పైగా వృద్ధిని సాధించే అవకాశం ఉంది. పేమెంట్స్‌, సెమీ అర్బన్‌, గ్రామీణ, సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల మార్కెట్లో శరవేగంగా విస్తరిస్తోంది. దీంతో మీడియం టర్మ్‌లో లాభాలు ఏటా 20-25 శాతం పెరుగుతాయి" అని మోర్గాన్ స్టాన్లీ తెలిపింది. You may be interested

సల్పంగా తగ్గిన బంగారం ధర

Thursday 26th March 2020

గత ఐదు రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర గురువారం స్వల్పంగా తగ్గింది. దేశం మొత్తం 21 రోజులపాటు లాక్‌ డౌన్‌లో ఉండడంతో దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్లో నిన్న ఒక్కరోజే రూ.1000పైన లాభపడింది. ఈరోజు ఉదయం 10:50 గంటల ప్రాంతంలో ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి రూ.500 తగ్గి రూ.41,579.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ నిన్నటితో పోలిస్తే 9 డాలర్లు నష్టపోయి ఔన్స్‌ బంగారం 1,624.35

ఫైనాన్షియల్స్‌ భలే దూకుడు..

Thursday 26th March 2020

ఇండస్‌ఇండ్‌.. 35 శాతం అప్‌ బ్యాంక్‌ నిఫ్టీ 8 శాతం ప్లస్‌ కొద్ది రోజులుగా ఏకధాటిగా క్షీణిస్తూ వస్తున్న ఫైనాన్షియల్‌ రంగ కౌంటర్లకు ఉన్నట్టుండి జోష్‌ వచ్చింది. దీతో ప్రయివేట్‌ రంగ బ్యాంకింగ్‌ కౌంటర్లు ఒక్కసారిగా జోరందుకున్నాయి. వెరసి ఎన్‌ఎస్‌ఈలో ప్రయివేట్ రంగ బ్యాంక్స్‌ 10 శాతం పురోగమించాయి. బ్యాంక్‌ నిఫ్టీ 8 శాతం ఎగసింది. గత మూడు వారాలుగా 42 శాతం క్షీణించిన ఫైనాన్షియల్‌ రంగం మూడు రోజులుగా టర్న్‌అరౌండ్‌ బాట

Most from this category