STOCKS

News


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఫలితాలపై బ్రోకరేజ్‌ల అంచనాలివే..!

Saturday 18th January 2020
news_main1579331638.png-31016

  • అంచనాలకు తగ్గట్టే ఫలితాలు ఉండొచ్చు
  • అటో, వ్యసాయ రంగ సిప్లేజ్‌లు కీలకం అంటున్న బ్రోకరేజ్‌లు

దేశీయ ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు శుక్రవారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో బ్యాంకు క్యూ3 ఫలితాలను పలు బ్రోకరేజ్ సంస్థలు తమ అంచనాలను వెలువరించాయి. కార్పోరేట్‌ కంపెనీలపై పన్ను తగ్గింపు కలిసొచ్చే అవకాశంగా ఉన్నందున ఈ క్యూ3లో వార్షిక ప్రాతిపదికన కంపెనీ నికరలాభం 20శాతం వృద్ధిని సాధిస్తుందని బ్రోకరేజ్ అంటున్నాయి. నికర వడ్డీ మార్జిన్ (ఎన్‌ఐఎం) 4.2-4.3 శాతంగా నమోదు కావచ్చు. ఆస్తుల నాణ్యత పెరగవచ్చు. అయితే ఆటో, వ్యవసాయ రంగాలకు చెందిన స్లిపేజెస్‌లు పెరిగే అవకాశం ఉంది. ఎన్‌ఐఐలు, ఇతర ఆదాయాలు, ప్రీ-ప్రోవిజన్‌ ఆపరేషన్‌ ప్రాఫిట్స్‌ గణాంకాలు ఆశించినస్థాయిలో నమోదవుతాయని, అయితే అధిక రుణ నష్టాల ప్రోవిజన్లు నికర వృద్ధిని ప్రభావతం చేయవచ్చు. రిటైల్ రుణ వృద్ధి కొంచెం మితంగా ఉండవచ్చు కాబట్టి క్రెడిట్ వృద్ధి 16-20 శాతం మధ్యలో నమోదయ్యే అకాశం ఉంది

కార్పోరేట్‌ పన్ను తగ్గింపు ప్రయోజనాలతో నికర లాభ వృద్ధి 32శాతం పెరుగుతుంది. అగ్రి స్లిప్పేజీల పెరుగుదల అదనపు కేటాయింపులకు దారితీయవచ్చు. వ్యవసాయ రంగానికి చెందిన స్లిప్లేజ్‌ల పెరుగుదల వైపు అదనపు కేటాయింపుకు దారితీయవచ్చు. అయితే వ్యవసాయేతర ఒత్తిడి స్థిరంగా ఉంచవచ్చని ప్రభుదాస్‌ లిల్లాధర్‌ బ్రోకరేజ్‌ సంస్థ అంచనా వేస్తుంది.

వార్షిక ప్రాతిపాదికన బ్యాంకు నికరలాభం 24 శాతం వృద్ధి చెంది రూ.6,950 కోట్లుగా నమోదయ్యే అవకాశం ఉంది. స్థూల నిరర్ధక ఆస్తులు 1.40శాతంగానూ, నికర ఎన్‌పీఏలు 0.44 శాతంగా నమోదయ్యే అవకాశం ఉన్నందున ఆస్తుల నాణ్యత స్థిరంగా ఉండొచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌ అంచనా వేస్తుంది. 

కార్పోరేట్‌ రుణాల వసూళ్ల కారణంగా రుణ వృద్ధి 20శాతం పెరిగే అవకాశం ఉంది. రీటైల్‌ వ్యాపారం 16-18శాతం వృద్ధిని సాధిస్తుందని ఎడెల్వీజ్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేస్తుంది. మార్కెట్ వాటా పెరుగుదల కారణంగా పాజిట్లు 26 శాతం వృద్ధిని నమోదు చేయవచ్చు. సీఎస్‌ఏస్‌, రిటైల్ టర్మ్ డిపాజిట్లపై దృష్టి ఉంటుంది.స్థిరమైన ఎన్‌ఐఎం 4.2–4.3 శాతం నమోదు కారణంగా ప్రధాన ఆదాయం 16–18 శాతంగా నమోదుకావచ్చు. అయితే ఆదాయ రుసం కీలమకని బ్రోకరేజ్‌ సంస్థ అభిప్రాయపడింది. 

యాజమాన్య నిర్వహణ సామర్థ్యం, పన్ను తగ్గింపు ప్రయోజనాల కారణంగా ఈ మూడోత్రైమాసికంలో బ్యాంక్‌ నికరలాభం 21.7శాతం నమోదై రూ.6,799 కోట్లను ఆర్జించవచ్చు అని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేస్తుంది. వార్షిక ప్రాతిపాదికన ఎన్‌ఐఎం 4.25శాతంగానూ నమోదు కావచ్చని బ్రోకరేజ్‌ సంస్థ అభిప్రాయపడుతుంది.

ఎన్‌ఐఐలు 12శాతం తగ్గే అవకాశం ఉన్నందున రుణ వృద్ధి 17శాతం తగ్గే అవకాశం ఉందని కోటక్‌ అభిప్రాయపడుతుంది. ఆటో రంగంలో బలహీనమైన వాల్యూమ్స్‌ కారణంగా రీటైల్‌ రుణాల మందగమనాన్ని చూడవచ్చు. నిబంధనలలో మార్పుల కారణంగా మ్యూచువల్‌ ఫండ్‌ల నుండి ఫీజు ఆదాయ వృద్ధి నెమ్మదిగా ఉంటుంది, అయితే ఆస్తి, చెల్లింపు ఫీజులు నెమ్మదిగా పెరుగుతాయని కోటక్‌ బ్యాంక్‌ అభిప్రాయపడుతుంది. 



You may be interested

నేషనల్‌ సేవింగ్‌ సర్టిఫికెట్‌ ఉపయోగాలివే..!

Saturday 18th January 2020

దూరంగా ఉన్న మన స్నేహితులకో, బంధువులకో ఏదైనా విషయాన్ని చెప్పాలంటే మొదట్లో తంతి తపాల మీద ఆధారపడేవారము.మన రాసిన ఉత్తరం చేరడానికి కొన్ని సార్లు నెలలు కూడా పట్టేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రస్తుతరోజుల్లో టెక్నాలజీ వాడకం బాగా పెరగడంతో సమాచారం ఒకచోట నుంచి మరో చోటికి సెకన్ల వ్యవధిలోనే చేరిపోతుంది. దీంతో ఇప్పుడు పోస్టు ఆఫీసులకు ఆదరణ తగ్గిందనే చెప్పాలి. కానీ భారత పోస్టల్‌ వ్యవస్థ వివిధ

సగటు గృహ,వ్యక్తిగత రుణాల్లో అగ్రస్థానంలో బెంగళూరు

Saturday 18th January 2020

రెండో స్థానానికి పరిమితమైన ముంబై న్యూఢిల్లీ: సగటున అధిక మొత్తంలో గృహ రుణాలు  పొందే నగరాల జాబితాలో ఆర్థిక రాజధాని ముంబైని వెనక్కి నెట్టి బెంగళూరు ముందువరుసలో నిలిచింది. ఐటీ హబ్‌గానే కాకుండా స్టార్టప్‌లకు రాజాధానిగా పేరుగాంచిన బెంగళూరు నగరం గృహ, వ్యక్తిగత సగటు రుణాలను దేశంలో ఇతర ప్రాంతాల కంటే అధికంగా తీసుకుంటూ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుందని బ్యాంక్‌ బజార్‌ మనీమూడ్‌-2020 నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం 2019

Most from this category