News


త్వరలో హెచ్‌డీబీ ఐపీఓ !

Thursday 27th June 2019
Markets_main1561621122.png-26620

  • ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఉండొచ్చు 
  • ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్ల నియామకం !

ముంబై: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు చెందిన నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ), హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ త్వరలో ఐపీఓకు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) రానుంది. 2007లో ప్రారంభమైన హెచ్‌డీబీ వ్యక్తిగత రుణాలతో పాటు, వాణిజ్య వాహనాలతో పాటు, బంగారంపై రుణాలివ్వటం చేస్తోంది. ఆస్తులు తనఖాగా కూడా రుణాలిస్తోంది. కాగా హెచ్‌డీబీ ఐపీఓ కోసం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ గత నెల రోజులుగా వివిధ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లతో చర్చలు జరుపుతోందని సమాచారం. ఈ ఐపీఓ ద్వారా రూ.7,000- 8,000 కోట్ల మేర నిధులు సమీకరించాలని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ భావిస్తోందని,  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ ఐపీఓ ఉండొచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు  95.53 శాతం వాటా ఉంది. కాగా హెచ్‌డీబీ ఐపీఓకు ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లుగా బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌ లించ్‌, మోర్గాన్‌ స్టాన్లీలను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నియమించిందని బ్లూమ్‌బర్గ్‌ వార్తాసంస్థ వెల్లడించింది. అయితే ఈ విషయాలపై వ్యాఖ్యానించడానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ప్రతినిధి నిరాకరించారు. 
ఐదో హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌ కంపెనీ 
హెచ్‌డీబీ స్టాక్‌ మార్కెట్లో లిస్టయితే స్టాక్‌మార్కెట్లో లిస్టైన హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌ కంపెనీల సంఖ్య ఐదుకు చేరుతుంది. ప్రస్తుతం స్టాక్‌ మార్కెట్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లు లిస్టయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కంపెనీ రూ.8,700 కోట్ల ఆదాయంపై రూ.1,150 కోట్ల నికర లాభం సాధించింది. ఈ కంపెనీ నిర్వహణ ఆస్తులు 25 శాతం వృద్ధితో రూ.55,425 కోట్లకు చేరాయి.



You may be interested

ఇదే సరైన సమయం

Thursday 27th June 2019

బహుళ జాతి సంస్థలను భారత్ ఆకర్షించవచ్చు అమెరికా-చైనా వాణిజ్య యుద్ధంపై పనగరియా వ్యాఖ్యలు న్యూయార్క్‌: అమెరికా- చైనా మధ్య వాణిజ్య యుద్ధ పరిస్థితులను భారత్ తనకు అనుకూలంగా మలచుకోవాలని ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ పనగరియా అభిప్రాయపడ్డారు. చైనా కాకుండా ఇతరత్రా దేశాల్లో కార్యకలాపాలు విస్తరించాలనుకుంటున్న భారీ బహుళ జాతి సంస్థలను (ఎంఎన్‌సీ) ఆకర్షించేందుకు ఇది అనువైన సమయమని ఆయన వ్యాఖ్యానించారు. న్యూయార్క్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఒక సదస్సులో పాల్గొన్న

మొబిక్విక్‌ ప్లాట్‌ఫామ్‌పై మ్యాక్స్‌ బూపా పాలసీలు

Thursday 27th June 2019

న్యూఢిల్లీ: మొబిక్విక్‌తో వ్యాపార భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు మ్యాక్స్‌ బూపా ప్రకటించింది. మొబిక్విక్‌ యూజర్ల కోసం గ్రూపు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలను తక్కువ ధరలకు అందించనున్నట్టు తెలిపింది. తమ అవసరాలను తీర్చే సౌకర్యమైన, తక్కువ ప్రీమియంతో కూడిన హెల్త్‌ ప్లాన్ల కోసం కస్టమర్లు చూస్తున్నారని, వీరు డిజిటల్‌ రూపంలో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు మ్యాక్స్‌ బూపా తెలిపింది. ఈ ధోరణులకు దృష్టిలో ఉంచుకుని మొబిక్విక్‌తో మ్యాక్స్‌ బూపా భాగస్వామ్యం

Most from this category