STOCKS

News


హెచ్‌డీఎఫ్‌సీ ఫండ్‌ భారీగా కొన్న షేర్లివే..!

Thursday 10th October 2019
Markets_main1570702942.png-28806

   దేశీయ అతి పెద్ద ఎసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ(ఏఎంసీ) అయిన హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, గత నెల మార్కెట్‌ భారీ ర్యాలీ తర్వాత పీఎస్‌యూ, బ్యాంకింగ్‌, ఇన్ఫ్రా తదితర రంగాలలోని స్టాకులను కొనుగోలు చేసింది. ఈ కంపెనీ సెప్టెంబర్‌ నెలలో కోటి చొప్పున ఎస్‌బీఐ(స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా), ఎన్‌హెచ్‌పీసీ(నేషనల్‌ హైడ్రో పవర్‌ కార్పోరేషన్‌) షేర్లును కొనుగోలు చేసింది.  కాగా ఈ పీఎస్‌యూల షేర్ల విలువ ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 10 శాతం మేర పడిపోవడం గమనార్హం. ఈ షేర్లతో పాటు యాక్సిస్ బ్యాంక్, కోల్ ఇండియా, ఐటీసీ, భారత్ ఎలక్ట్రానిక్స్, బీపీసీఎల్‌(భారత పెట్రోలియం), హెచ్‌పీసీఎల్‌(హిందుస్తాన్‌ పెట్రోలియం), అశోక బిల్డ్‌కాన్, ఫెడరల్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ అండ్ టీ, గెయిల్, లుపిన్, అరబిందో ఫార్మా, సన్ ఫార్మా, కిర్లోస్కర్ ఫెర్రస్, ఇ-క్లర్క్స సర్వీసెస్ తదితర షేర్లను హెచ్‌డీఎఫ్‌సీ ఎఎంసీ అధికంగా కొనుగోలు చేసింది. 
  ఏసీఈ మ్యూచువల్‌ ఫండ్స్‌ డేటా ప్రకారం..హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, నెలముందు వరకు 4.96 కోట్ల యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లను కలిగివుండగా, ప్రస్తుతం ఈ సంఖ్య 5.44 కోట్ల షేర్లకు చేరుకుంది. అదేవిధంగా 10 లక్షల చొప్పున ఐసీఐసీఐ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌  షేర్లను కూడా ఈ ఏఎంసీ కొనుగోలు చేసింది.
హోటల్‌ స్టాకుల భారీ కొనుగోలు..
   హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ హోటల్ సంస్థలైన చాలెట్ హోటల్స్ (9 లక్షల షేర్లు), ఇండియన్ హోటల్స్ (5 లక్షల షేర్లు) షేర్లను అదనంగా కొనుగోలు చేసింది. అంతేకాకుండా, మిశ్రా ధాటు నిగమ్ (9.49 లక్షల షేర్లు), జేఎస్‌డబ్యూ స్టీల్ (9.06 లక్షల షేర్లు), ఓఎన్‌జీసీ(ఆయిల్‌ అండ్‌ నాచురల్‌ గ్యాస్‌) (8.17 లక్షల షేర్లు), నైవేలి లిగ్నైట్ (8 లక్షల షేర్లు), ఆర్‌ఈసీ(రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పోరేషన్‌) (7.46 లక్షల షేర్లు), గ్రీన్‌ప్లై ఇండస్ట్రీస్ (7.30 లక్షల షేర్లు), ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్ (7.18 లక్షల షేర్లు), గార్డెన్ రీచ్ (6.94 లక్షల షేర్లు), హెచ్‌డీఎఫ్‌సీ (6.82 లక్షల షేర్లు) కంపెనీల షేర్లను కొనుగోళ్లు చేసింది.
కాంట్రా బెట్‌ కింద ఆటో స్టాకులు..
  హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ గత కొన్ని నెలల నుంచి అండర్‌ పెర్ఫర్మాన్స్‌ చేస్తున్న ఆటో సెక్టార్‌ షేర్లను కాంట్రా బెట్‌ కింద కొనుగోలు చేసింది. టాటా మోటార్స్ (16,892 షేర్లు), హీరో మోటోకార్ప్ (27,933), ఎం అండ్ ఎం (21,358 షేర్లు), మారుతి సుజుకి (1,561 షేర్లు) షేర్లను తన పోర్టుఫోలియోకి అదనం‍గా జోడించింది. కానీ బజాజ్‌ ఆటోకి సంబంధించి 15,302 షేర్లను విక్రయించడం గమనార్హం.
బ్లూచిప్‌ స్టాకులు..
   హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ సెప్టెంబర్‌ నెలలో కొన్ని బ్లూ చిప్ కంపెనీల షేర్లను కూడా కొనుగోళ్లు చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్)కు చెందిన 4 లక్షల షేర్లను, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు చెందిన 3.71 లక్షల షేర్లను తన పోర్టుఫోలియోకి జతచేసింది. ఐటి కంపెనీలలో టెక్ మహీంద్రా, సోనాట సాఫ్ట్‌వేర్, ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీలకు చెందిన షేర్లను కూడా కొనుగోలు చేసింది. మొత్తంగా ఈ ఆస్తి నిర్వహణ సంస్థ 98 కంపెనీలలో తన వాటాను పెంచుకోగా, 53 కంపెనీలలో తన వాటాను తగ్గించుకుంది. సెప్టెంబర్‌ 30, 2019 నాటికి రూ. 3.46 లక్షల కోట్ల ఆస్తిని నిర్వహిస్తున్న ఈ సంస్థ, తన పోర్టుఫోలియోలో 308 కంపెనీల స్టాకులను కలిగి ఉంది. 
హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ విక్రయించిన స్టాకులు..   
 హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ గత నెలకాలంలో.. ఇన్ఫోసిస్, ఎడెల్విస్ ఫైనాన్షియల్, యెస్ బ్యాంక్, అశోక్ లేలాండ్, భెల్(భారత్‌ హెవీ ఎలక్ట్రానిక్స్‌), ఎస్ చాంద్, శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్, రైట్స్, టాటా కెమికల్స్‌ వంటి కంపెనీల నుంచి ప్రతి కంపెనీ నుంచి 10 లక్షల షేర్లను విక్రయించింది. అంతేకాకుండా నిర్థిష్ట మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్‌ షేర్లయిన దివీస్‌ ల్యాబ్, డాబర్ ఇండియా, టైటాన్, సిప్లా, విప్రో, అదానీ పోర్ట్స్, పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ వంటి కంపెనీల షేర్లను కూడా విక్రయించింది.You may be interested

బ్యాంకింగ్‌ షేర్ల దెబ్బ... నష్టాల ముగింపు

Thursday 10th October 2019

క్రితం రోజు భారీగా ర్యాలీ జరిపిన బ్యాంకింగ్‌ షేర్లలో గురువారం అమ్మకాలు వెల్లువెత్తడంతో ప్రధాన సూచీలు నష్టాలతో ముగిసాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 297 పాయింట్ల నష్టంతో 37,880 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 79 పాయింట్ల క్షీణతతో 11,235 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. ప్రధాన సూచీల్లో అధిక వెయిటేజి కలిగిన బ్యాంకింగ్‌ షేర్ల నష్టం కారణంగా బ్యాంక్‌ నిఫ్టీ 770 పాయింట్లు (2.7) శాతం పతనమయ్యింది. తాజాగా ఫలితాలు వెల్లడించిన

ఇండియా వృద్ధి అంచనాలు తగ్గించిన మూడీస్‌

Thursday 10th October 2019

మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీస్‌ సంస్థ తాజాగా భారత జీడీపీ వృద్ధి అంచనాలను తగ్గించింది. 2019-20 సంవత్సరానికి జీడీపీ అంచనాను 6.2 శాతం నుంచి 5.8 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపింది. పెట్టుబడుల ఆధారిత మందగమనం విస్తతృం కావడం, ఇది క్రమంగా వినిమయ మందగమనానికి దారితీయడం, తత్ఫలితంగా గ్రామీణ కుటుంబాల్లో ఆర్థిక ఒత్తిళ్లు పెరగడం, బలహీనమైన ఉపాధి కల్పన జరగడం వంటి కారణంగా వృద్ధి రేటు అంచనాలను తగ్గిస్తున్నట్లు వివరించింది. మందగమనానికి కారణాలు

Most from this category