ఫ్రంట్‌లైన్ స్టాక్‌లే బెటర్ ఛాయిస్!
By Sakshi

‘చాలా పెద్ద క్యాప్‌లు నెమ్మదిగా మిడ్క్యాప్లుగా మారుతున్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో ఫ్రంట్‌లైన్ స్టాక్‌లకు కట్టుబడి ఉండడమే ఉత్తమం. మిడ్ క్యాప్‌లపై బుల్లిష్‌గా ఉంటే వీటిపై దృష్ఠి పెట్టవచ్చు.’ అని సెంట్రమ్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ , రీసెర్చ్ హెడ్ జగన్నాధం తునుగుంట్ల ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. మూడు, నాలుగేళ్లలో ఆటో సెక్టార్లో మంచి లాభాలు రానున్నాయంటూ పలు అంశాలను ఆయన వివరించారు... దీర్ఘకాలంలో ‘ఆటో’.. లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్స్.. బీఎఫ్ఎస్ఐ బెటర్.. హెచ్ 2 బి 2 (హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్సర్వ్) స్టాక్స్ లోతైన దిద్దుబాటుకు గురయితే వీటిలో ఇన్వెస్ట్ చేయవచ్చు.
ఆటో సెక్టార్లో మార్కెట్ లీడర్లగా ఉన్న చాలా కంపెనీల వాల్యుషన్లు ఇప్పటికి బలంగానే ఉన్నాయి. కొన్ని కంపెనీల స్టాకులు ఇప్పటి వరకు 50 శాతం దిద్దుబాటుకు గురయినప్పటికి ఇప్పటికి కూడా ఖరిదుగానే ట్రేడవుతున్నాయి. గత ఏడాది ఆగస్టు చివరి వారంలో ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంస్థ డిఫాల్ట్ అయ్యింది. అప్పటి నుంచే ఆటో సెక్టార్లో మందగమనం ప్రారంభమైంది. అమ్మకాలు భారీగా తగ్గాయి. కానీ ఈ ఏడాది ప్రథమార్ధంతో పోల్చుకుంటే ద్వితియార్థంలో అమ్మకాలు పాజిటివ్‌గా ఉండే అవకాశం ఉంది. అక్టోబర్ రెండవ భాగంలో దీపావళి, మొదటి భాగంలో దసరా పండగలు ఉన్నాయి. కాబట్టి, పండుగ డిమాండ్ సెప్టెంబర్ ద్వితీయార్థం నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆటో సెక్టార్లో అమ్మకాలలో మునుపటి గరిష్ట స్థాయి కనిపించే అవకాశం లేనప్పటకి సెప్టెంబర్‌లో కనీసం అమ్మకాల సంఖ్య ప్లస్ 2 శాతం, ప్లస్ 3శాతంగా ఉండే అవకాశం ఉంది. పండుగ ఉల్లాసం ఉంటుందో లేదో చెప్పడం కష్టమయినప్పటికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నుంచి కొంత సానుకూలతయితే సెప్టెంబర్‌లో కనిపించే అవకాశం ఉంది. ఈ సెక్టార్ షేర్లు ఇంకా నష్టపోయే అవకాశం ఉంది. కానీ కొన్ని కంపెనీలు వచ్చే మూడు నాలుగేళ్లలో మంచి లాభాలను ఇవ్వవచ్చు.
లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టార్ ప్రస్తుత పరిస్థితులలో కూడా మంచి ప్రదర్శన చేసింది. ప్రపంచవ్యాప్తంగా భీమా సంస్థలు, బ్యాంకింగ్ కంపెనీల కంటే ఎక్కువ మార్కెట్ క్యాప్ కలిగి ఉన్నాయి. కానీ ఇండియాలో రూ. లక్ష కోట్ల మార్కెట్ క్యాప్‌తో ఉన్న హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ అతిపెద్ద జీవిత బీమా సంస్థగా ఉంది. కానీ అతిపెద్ద బ్యాంక్ మాత్రం రూ .5 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను కలిగి ఉంది. ఇందులో మార్పు వస్తుందని ఆశిస్తున్నా. అదే జరిగితే జీవిత బీమా కంపెనీలలో మంచి అవకాశాలుంటాయి. ప్రభుత్వం చమురుపై ఆధారపడటాన్ని తగ్గించాలని భావిస్తోంది. దీనికోసం ప్రత్యామ్నాయ యంత్రాంగాన్ని సృష్టించాలి. ఫలితంగా సిటీ గ్యాస్ పంపిణీ సంస్థలు లాభపడే అవకాశం ఉంది. జీవిత బీమా, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్లలలో దీర్ఘకాల ఇన్వెస్టమెంట్లకు మంచి అవకాశం ఉంది.
మొత్తం సంపాదన సీజన్లో నాన్ బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ సర్వీసెస్(ఎన్బీఎఫ్ఎస్ఐ) సెక్టార్‌ను పరిశీలిస్తే ఈ సెక్టార్ ఎంత వెనుకబడి ఉందో అర్థమవుతుంది. ఎన్బీఎఫ్ఎస్ఐ స్టాక్స్‌లో చాలా వరకు కంపెనీల ఆదాయాలు 16 శాతం మేర తగ్గాయి. ఇంకోవైపు బ్యాంకింగ్ ఫైనాన్స్, ఇన్సూరెన్స్, సర్వీసెస్(బీఎఫ్ఎస్ఐ) సెక్టార్‌లోని చాలా వరకు కంపెనీల ఆదాయాలు 38 శాతం వృద్ధిని నమోదు చేశాయి. గత రెండేళ్ళలో నుంచి దాదాపు అన్ని బ్యాంకులు తమ పుస్తకాలను జాగ్రత్త చేసుకున్నాయి. తక్కువ బేస్ ఎఫెక్ట్ పరంగా ప్రస్తుత ఆదాయాల వృద్ధిలో 38 శాతం స్పష్టంగా కనిపిస్తుంది.
యాక్సిస్ బ్యాంక్ కొత్త నిధులను సమీకరించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ కంపెనీపై నెగిటివ్ టాక్ ఉండడంతో ఈ కంపెనీ షేరు ధర పతనమవుతోంది. ఇది కూడా దీర్ఘకాలంలో పెట్టుబడులు పెట్టడానికి మంచి అవకాశంగా భావించవచ్చు. గత ఆరు-తొమ్మిది నెలలో ఈ బ్యాంక్ చేసిన ర్యాలీని పొందలేని వారికి ఇప్పుడు రాయితీతో నడుస్తున్న ఈషేరు మంచి అవకాశం. యాక్సిస్ బ్యాంక్‌తో పాటు ఐసిఐసిఐ బ్యాంక్ షేరును కూడా ధర తగ్గినప్పుడు కొనవచ్చు. కంపెనీ పని తీరు బాగుండడంతో దీని షేరును దీర్ఘకాల పోర్టుపోలియోలో భాగంగా చేర్చుకోవచ్చు. మార్కెట్లు గణనీయంగా దిద్దుబాటుకు గురికావడంతో చాలా వరకు మంచి కంపెనీల స్టాకులు రాయితీతో లభిస్తున్నాయి. అందువలన ప్రస్తుత పరిస్థితిని అవకాశంగా ఉపయోగించుకోవాలి. మొత్తం మార్కెట్ క్యాపిట్యులేషన్ పరంగా బలంగా ఉన్న కంపెనీల షేర్లు దిద్దుబాటుకు గురయ్యాయి.
You may be interested
11000 దిగువుకు ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ఇండెక్స్
Saturday 3rd August 2019విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ఇండెక్స్ శుక్రవారం 11000ల దిగువను ముగిసింది. రాత్రి సింగపూర్ మార్కెట్లో 10,976.50 వద్ద స్థిరపడింది. . ఇది నిఫ్టీ ఫ్యూచర్ ముగింపు(11024)తో పోలిస్తే 48 పాయింట్ల నష్టంతో ఉందనే విషయాన్ని గమనించాలి. జాతీయ, అంతర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే నిఫ్టీ ఇండెక్స్ సోమవారం నష్టంతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అమెరికా మరోసారి చైనాపై మరోసారి ట్రేడ్‌వార్ ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లు కుదేలయ్యాయి. ఆసియా
ఇంధన కంపెనీలకు నిధుల సమస్య లేదు
Saturday 3rd August 2019విదేశీ ఇన్వెస్టర్లకు ఆకర్షణీయంగానే భారత ఇంధనరంగం పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టీకరణ న్యూఢిల్లీ: ఇంధన కంపెనీలు నిధుల సమీకరణ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం లేదని పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. కొన్ని సౌర్వభౌమ ఫండ్స్, నార్వే పెన్షన్ ఫండ్ శిలాజ ఇంధన ఆధారిత ప్రాజెక్టుల్లో ఇన్వెస్ట్ చేయరాదని నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో మంత్రి ప్రకటనకు ప్రాధాన్యం నెలకొంది. ‘‘అక్కడ ఎటువంటి సవాళ్లు లేవు. పెన్షన్ ఫండ్స్