News


ఏఎంసీ షేర్లకు అమ్మకాల తాకిడి... టార్గెట్లకు కోత

Friday 21st September 2018
Markets_main1537530885.png-20452

సెబీ నిర్ణయంతో అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీల షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. ఫలితమే స్టాక్‌ మార్కెట్లో హెచ్‌డీఎఫ్‌సీ ఏంఎసీ, రిలయన్స్‌ నిప్పన్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ షేర్లు 10 శాతానికి పైగా నష్టపోయాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల టోటల్‌ ఎక్స్‌పెన్స్‌ రేషియో(టీఈఆర్‌)ను 25 బేసిస్‌ పాయింట్ల వరకు తగ్గిస్తూ సెబీ తీసుకున్న నిర్ణయమే వీటి నష్టాలకు కారణం. బ్రోకరేజీలు సైతం ఈ షేర్ల టార్గెట్‌ను తగ్గించాయి.

 

రిలయన్స్‌ నిప్పన్‌ ఏఎంసీ షేరుకు నోమురా తన సిఫారసును కొనుగోలు నుంచి తటస్థానికి(న్యూట్రల్‌) తగ్గించింది. గతంలో రూ.315 టార్గెట్‌ ధరగా పేర్కొనగా, దాన్ని రూ.210 చేసింది. ఎగ్జిట్‌ లోడ్‌ను సెబీ ఇటీవలే 15 బేసిస్‌ పాయింట్లు (0.15శాతం) తగ్గించగా, దీనికి అదనంగా ఇప్పుడు టోటల్‌ ఎక్స్‌పెన్స్‌ రేషియో (టీఈఆర్‌) తగ్గింపుతో ఏఎంసీ కంపెనీల మార్జిన్లు తగ్గిపోనున్నాయి. ఈ ప్రభావంలో కొంత వరకు ఏఎంసీలే సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుందని నోమురా పేర్కొంది. ఇక మోర్గాన్‌ స్టాన్లీ అయితే హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ స్టాక్‌ ధర టార్గెట్‌ను గతంలో 2,050గా ఇవ్వగా, తాజా పరిణామాల నేపథ్యంలో రూ.1,765కు కుదించింది. అయితే, ఈ స్టాక్‌పై ఉన్న ఓవర్‌ వెయిట్‌ కాల్‌ను మాత్రం అలాగే కొనసాగించింది. టీఈఆర్‌ తగ్గింపుతో ఈపీఎస్‌ తగ్గుతుందని, అందుకే టార్గెట్‌ ధరను తగ్గించినట్టు వివరించింది. ఈ‍క్విటీ, స్థూల ఆదాయం వరుసగా 20 బేసిస్‌ పాయింట్లు, 11 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గొచ్చని అంచనా వేసింది. సమీప కాలంలో మరింత బలహీనత ఉండొచ్చని పేర్కొంది. 

 

టీఈఆర్‌ తగ్గింపు వల్ల ఏఎంసీ కంపెనీల ఆదాయాలపై ప్రభావం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కంపెనీలు ఈ భారాన్ని డిస్ట్రిబ్యూటర్లకు బదిలీ చేయడం లేదా సొంతంగా భరించాల్సి వస్తుందని, ఇది వాటి ఆదాయాలను దెబ్బతీస్తుందంటున్నారు. ఏఎంసీ, డిస్ట్రిబ్యూటర్ల ఆదాయాలు తగ్గుతాయని ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఏఎంసీ పేర్కొంది. వ్యయాలను తగ్గించడం అన్నది వినియోగదారులకు సానుకూలమని, మార్కెట్‌ వాటా పెద్ద సంస్థల నుంచి చిన్న సంస్థలకు వెళుతుందని అభిప్రాయపడింది. మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణలో సుమారు రూ.25 లక్షల కోట్ల ఆస్తులు ఉండగా, ఇందులో 54 శాతం కేవలం టాప్‌ 5 సంస్థల నిర్వహణలో ఉన్నాయి. మొత్తం నిర్వహణ ఆస్తుల్లో 75 శాతం టాప్‌ 10 సంస్థల చేతుల్లోనే ఉండడం గమనార్హం. సుమారు 42 మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు మన దేశంలో సేవలు అందిస్తున్నాయి. సెబీ నిర్ణయంతో మ్యూచువల్‌ ఫండ్స్‌ ఆదాయాలు 25 శాతం తగ్గిపోతాయని సీఎల్‌ఎస్‌ఏ పేర్కొంది. అన్ని ఫండ్స్‌పై ఇది రెండు మూడు నెలల్లో ప్రభావం చూపిస్తుందని తెలిపింది. బ్రోకర్లు, ప్రైవేటు బ్యాంకులపైనా ప్రభావం ఉంటుందని పేర్కొంది. ఐఆర్‌డీఏ యులిప్‌ పాలసీల ఫీజులను సైతం ఇదే మాదిరిగా తగ్గిస్తే బీమా కంపెనీలకు కూడా సమస్యేనని అభిప్రాయపడింది. మ్యూచువల్‌ ఫండ్స్‌ తగ్గిన టీఈఆర్‌ మేర డిస్ట్రిబ్యూటర్లకు బదిలీ చేయడం, ప్రచార వ్యయాలను తగ్గించుకోవడం మార్గమని సిటీ ఇండియా పేర్కొంది.You may be interested

మార్షల్‌ మెషిన్స్‌లో వాటాలు పెంచుకున్న కచోలియా

Friday 21st September 2018

ప్రముఖ ఏస్‌ ఇన్వెస్టర్‌ ఆశిష్‌ కచోలియా మార్షల్‌ మెషిన్స్‌ అనే చిన్న సంస్థలో తన వాటాలను మరింత పెంచుకున్నారు. దీంతో కంపెనీలో ఆయన వాటా 8.68 శాతానికి చేరింది. ఒక్కో షేరును రూ.43.15 వెచ్చించి 99,000 షేర్లను కచోలియా ఎన్‌ఎస్‌ఈలో కొనుగోలు చేశారు. స్టాక్‌ ఎక్సేంజ్‌ బల్క్‌ డీల్స్‌లో ఈ మేరకు వివరాలు ఉన్నాయి. ఇప్పటి వరకు కంపెనీలో కచోలియాకు 8 శాతం ఉండగా, అది 8.68 శాతానికి పెరిగింది.

మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్స్‌ క్రాష్‌

Friday 21st September 2018

మార్కెట్‌లో వెలువెత్తిన అమ్మకాల సునామిలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు భారీగా నష్టపోయాయి. బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్‌ సూచీ నేడు 1.72శాతం నష్టపోగా, స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ 3.00శాతం నష్టపోయాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌:- నేడు 15935 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 7శాతం(1070 పాయింట్లు) నష్టపోయింది. చివరకు 1.72శాతం నష్టపోయి 15595 వద్ద ముగిసింది. సెంట్రల్‌ బ్యాంక్‌, ఆర్‌కామ్‌, రిలయన్స్‌ ఇన్ఫ్రా, అదానీపవర్‌, జీఎంఆర్‌ ఇన్ఫ్రా, వోకార్డ్‌ పార్మా, టోరెంటో పవర్‌, ఐడీఎఫ్‌సీ, రిలయన్స్‌

Most from this category