News


బ్రోకరేజిల ‘బై’ సిఫార్సులు..లాభాల్లో హెచ్‌సీఎల్‌

Thursday 8th August 2019
Markets_main1565250602.png-27639

హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ క్యూ1 ఫలితాలు నిరాశపరిచినప్పటికి ఈ కంపెనీ స్టాకుపై బ్రోకరేజిలు ‘బై’ కాల్‌ను కొనసాగించడంతో హెచ్‌సీఎల్‌ షేరు విలువ గురువారం మధ్యాహ్నం 12.29 సమయానికి 4.52 శాతం లాభపడి రూ. 1,068.85 వద్ద ట్రేడవుతోంది.  ఆర్థిక సంవత్సరం 2020 క్యూ1లో ఆపరేటింగ్‌ ఆదాయం తగ్గడంతో, కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 7.6  శాతం క్షీణించి రూ. 2,220 కోట్లుగా నమోదయ్యింది. కాగా గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఈ నికర లాభం రూ. 2,568 కోట్లుగా ఉంది. నికర లాభం తగ్గినప్పటికి కంపెనీ పూర్తి ఏడాది ఆదాయ వృద్ధి మార్గదర్శకాలను కొనసాగించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం, అంచాలను అధిగమించింది. కంపెనీ ఆదాయం త్రైమాసిక ప్రాతిపదికన 2.7 శాతం వృద్ధి సాధించగా, ఏడాది ప్రాతిపదికన 18.7 శాతం వృద్ధి సాధిం‍చి రూ. 16,425 కోట్ల ఆదాయాన్ని నమోదుచేసిందని కంపెనీ బీఎస్‌ఈ ఫైలింగ్‌లో​పేర్కొంది.

 బీఎన్‌పీ పారిబాస్.. ఈ స్టాక్‌పై ‘బై’ రేటింగ్‌ను కొనసాగించినప్పటికీ, షేరు టార్గెట్‌ ధరను రూ. 1,240 నుంచి రూ. 1,200 కు తగ్గించింది. ఆర్థిక సంవత్సరం 2020కి గాను కంపెనీ టార్గెట్‌ బాగానే ఉందని, కానీ క్యూ1 ఫలితాలు, అధిక పన్ను ప్రభావం వలన ఆర్థిక సంవత్సరం 2020-22 కాలానికి గాను ఈ స్టాక్‌ ఈపీఎస్‌ అంచనాలను 4 శాతం తగ్గించామని వివరించింది. ఈ స్టాక్‌ విలువ ఆర్థిక సంవత్సరం 2020 ఆదాయాలకు 13 రెట్లు పీఈ వద్ద చవకగా ఉందని, ఐబీఎంతో ఒప్పందం కుదుర్చుకున్నప్పటి నుంచి ఈ స్టాక్‌ మార్జిన్‌ పెరుగుతోందని తెలిపింది.

నోమురా.. హెచ్‌సీఎల్‌ షేరు టార్గెట్‌ ధరను రూ. 1,270 గా నిర్ణయించి ఈ స్టాక్‌పై ‘బై’ కాల్‌ను నిర్వహిస్తోంది.
పెద్ద ఒప్పందాలలో వలన కలిగే లాభం కంటే ఉన్న వ్యాపారాలలో మెరుగైన వృద్ధి సాధించడం సానుకూలమైన పరిణామం కాగా, క్యూ 1లో మార్జిన్‌ తగ్గడం, ఆర్థిక సంవత్సరం 2020 లో 24 శాతం పన్ను రేటు మార్గదర్శకత్వం ప్రతికూలంగా ఉన్నాయని తెలపింది. ఈ స్టాక్‌ విలువ  ఆర్థిక సంవత్సరం 2020 ఆదాయాలకు 12 రెట్ల ఈపీఎస్‌(షేరు పై ఆదాయం) వద్ద ఆకర్షణీయంగా ఉందని వివరించింది

సీఎల్‌ఎస్‌ఏ.. హెచ్‌సిఎల్ టెక్నాలజీస్‌ షేరు టార్గెట్‌ ధరను రూ. 1,380 నిర్ణయించి, ‘బై’ రేటింగ్‌ను కొనసాగించింది.
కంపెనీ వృద్ధి ప్రత్యర్థి కంపెనీల కంటే మెరుగుగా ఉండడంతో ఆదాయం పెరగిందని తెలిపింది. ఐబిఎం ఒప్పంద ఖర్చు వలన మార్జిన్ క్షీణించిందని, పన్ను పెరుగుదల వలన ఆర్థిక సంవత్సరం21-22 ఈపీఎస్‌ అంచనాలను 3 శాతం తగ్గిస్తున్నామని సీఎల్‌ఎస్‌ఏ తెలిపింది.

జెఫరీస్..ఈ స్టాక్‌పై ‘హోల్డ్’ రేటింగ్‌ను కొనసాగించి, టార్గెట్‌ ధరను షేరుకు  రూ.1,090 నుం‍చి రూ. 1,120కు పెంచింది. ఐబీఎంతో ఒప్పందం, క్లయింట్ల నుంచి ఇబ్బందులు తక్కువగా ఉండడం వలన ఈ కంపెనీ త్రైమాసిక ప్రాతిపదికన గణనీయమైన ఆదాయ వృద్ధిని సాధించింది. ఆర్థిక సంవత్సరం 20కి గాను 14-16 శాతం వృద్ధి మార్గదర్శకాలను మార్చకపోవడం వలన ఈ ఏడాది చివరి నాటికి మార్జిన్‌ గైడ్‌ రేంజ్‌ 18.5-19.5 శాతంగా ఉంటుందని ఈ బ్రోకరేజి సంస్థ అంచనా వేసింది.
మధ్యాహ్నం 1.09 సమయానికి హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్ 4.49 శాతం లాభపడి రూ. 1,068.55  వద్ద ట్రేడవుతోంది.



You may be interested

రాణిస్తున్న ఐటీ షేర్లు

Thursday 8th August 2019

ఐటీ షేర్లు గురువారం రాణిస్తున్నాయి. ఐటీరంగంలో అదిక వెయిటేజీ కలిగిన ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ షేర్లు ర్యాలీ, రూపాయి ఒడిదుడుకుల ట్రేడింగ్‌ ఐటీ ఇండెక్స్‌ బలపడేందుకు తోడ్పాటునందిస్తున్నాయి. నేడు ఐటీ ఇండెక్స్‌ 15,677.45 వద్ద ప్రారంభమైంది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ముఖ్యంగా టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు 2శాతం ర్యాలీతో పాటు హెచ్‌సీఎసీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్లు 6శాతం లాభపడటంతో ఇండెక్స్‌ 1.74 శాతానికి పైగా

వచ్చే జూన్‌నాటికి సెన్సెక్స్‌@ 45,000!

Thursday 8th August 2019

మోర్గాన్‌స్టాన్లీ మార్కెట్లో బేర్‌ భయాలు కమ్ముకున్న తరుణంలో అంతర్జాతీయ బ్రోకింగ్‌ దిగ్గజం మోర్గాన్‌స్టాన్లీ భిన్నమైన ధృక్పథాన్ని వెలిబుచ్చుతోంది. డీలా పడిన ఇన్వెస్టర్లకు కొంత ఉత్సాహాన్నిచ్చే అంచనాలు వేస్తోంది. తాజా పతనం తర్వాత మార్కెట్లు బాటమ్‌అవుట్‌కు దగ్గర్లో ఉన్నాయని మోర్గాన్‌స్టాన్లీ అభిప్రాయపడింది. క్రమంగా మార్కెట్లు కోలుకుంటాయని, తిరిగి బుల్‌రన్‌ ఆరంభమై వచ్చే జూన్‌ నాటికి సెన్సెక్స్‌ 45వేల పాయింట్లను చేరుతుందని అంచనా వేసింది. బుల్స్‌ చెలరేగితే జూన్‌నాటికి సెన్సెక్స్‌ 50వేల పాయింట్లకు చేరినా

Most from this category