News


హెచ్‌సీఎల్‌ టెక్‌ ర్యాలీ..3.4% అప్‌

Thursday 24th October 2019
Markets_main1571890480.png-29102

ఐటీ దిగ్గజ కంపెనీ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ నికర లాభం సెప్టెంబర్‌ త్రైమాసికంలో  7 శాతం పెరిగి(ఏడాది ప్రాతిపదికన) రూ. 2,711 కోట్లుగా నమోదైంది. కాగా గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ లాభం రూ. 2,534 కోట్లుగా ఉంది. అంతేకాకుండా కంపెనీ ఆదాయం కూడా 18 శాతం పెరిగింది. వీటితో పాటు కంపెనీ షేరుపై 1:1 నిష్పత్తిలో బోనస్‌ను ఇవ్వడంతో పాటు, షేరుకు రూ. 2 డివిడెండ్‌ను ప్రకటించింది. దీంతో ఈ కంపెనీ షేరు విలువ గురువారం సెషన్లో ర్యాలీ చేస్తోంది. ఉదయం 9.37 సమయానికి 3.47 శాతం లాభపడి రూ. 1,132.50 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్లో రూ. 1,095.15 వద్ద ముగిసిన ఈ షేరు, రూ. 1,155.10 వద్ద పాజిటివ్‌గా ప్రారంభమైంది.



You may be interested

ఎల్‌ అండ్‌ టీ 2 % అప్‌

Thursday 24th October 2019

నిర్మాణ, ఇంజినీరింగ్‌ దిగ్గజ కంపెనీ లార్సెన్‌ అండ్‌ టుబ్రో(ఎల్‌ అండ్‌ టీ) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ త్రైమాసికంలో 13 శాతం పెరిగి రూ. 2,527 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ లాభం రూ.2,230 కోట్లుగా ఉంది. అంతేకాకుండా కంపెనీ ఆదాయం కూడా ఈ త్రైమాసికంలో ఏడాది ప్రాతిపదికన రూ. 31,087 కోట్ల నుంచి రూ. 35,925 కోట్లకు పెరిగింది. కంపెనీ నిర్వహణ లాభం

11 పైసలు బలపడిన రూపీ

Thursday 24th October 2019

దేశీయ రూపీ, డాలర్‌ మారకంలో గురువారం సెషన్‌లో 11 పైసలు బలపడి 70.80 వద్ద ప్రారంభమైంది. అంతర్జాతీయ రాజకీయ అనిశ్చితిల మధ్య గత సెషన్లో రూపీ డాలర్‌ మారకంలో స్పల్పంగా లాభపడి 70.91 వద్ద ముగిసింది. చమురు ధరలు పడిపోతుండడంతో రూపీ బలపడుతున్నప్పటికి, దేశీయ ఈక్విటీల నుంచి విదేశీ నిధుల ఔట్‌ ఫ్లో జరుగుతుండడంతో రూపీ లాభాలు పరిమితంగా ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 6.70 వద్ద

Most from this category