News


ఎస్‌బీఐ కార్డ్స్ షేర్ల కేటాయింపు గురించి తెలుసుకోండిలా!

Wednesday 11th March 2020
Markets_main1583914064.png-32409

ఎస్‌బీ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్స్‌ సర్వీసెస్‌ ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌కు దరఖాస్తు చేసుకున్న వారు తమకు షేర్లు వచ్చాయా? లేదో  అనే విషయాన్ని లింక్‌ ఇన్‌టైమ్‌ ఇండియా అనే లింక్‌ ద్వారా తెలుసుకోవచ్చు. దరఖాస్తు దారు తమకు షేర్లు కేటాయించారో లేదో తెలుసుకోవాలంటే ముందుగా లింక్‌ ఇన్‌టైమ్‌ ఇండియా వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఇన్వెస్ట్‌ర్‌ సర్వీసెస్‌ మీద క్లిక్‌ చేయాలి. అప్పుడు అక్కడ సబ్‌ సెక్షన్‌లో పబ్లిక్‌ ఇష్యూ-ఈక్విటీస్‌లో ఈ వివరాలు కనిపిస్తాయి. అక్కడ ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌లోని మెనూలో పర్మినెంట్‌ అకౌంట్‌ నంబరు(పాన్‌)గానీ, అప్లికేషన్‌ లేదా డీపీ(డిపాజిటరీ ఐడీ లేదా డిమాట్‌ అకౌంట్‌ సర్వీస్‌  ప్రొవైడర్‌)/క్లైంట్‌ ఐడీ నంబరును ఎంటర్‌ చేసి తరువాత కింద ఉన్న క్యాప్చా కోడ్‌ను ఎంటర్‌ చేసి, సబ్మిట్‌ బటన్‌ను ప్రెస్‌ చేయాలి. అప్పుడు మీ అప్లికేషన్‌ స్టేటస్‌ వస్తుంది. ఈ వెబ్‌సైట్‌లోనే కాకుండా అధికారిక ఈమెయిల్‌ ఐడీ ipo.helpdesk@linktime.co.in కు మెయిల్‌ చేసికూడా అప్లికేషన్‌ స్టేటస్‌ తెలుసుకోవచ్చు. లేదంటే 02249186200కు కాల్‌ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఎక్కువ మంది ఇన్వెస్టర్లు  నుంచి ఐపీఓకు స్పందన లభించిన ఈ కంపెనీ మార్చి 16 న స్టాక్‌ ఎక్సేంజ్‌లో  లిస్ట్‌అయ్యే అవకాశం ఉంది. 

26  రెట్లు ఓవర్‌ సబ్‌స్ర్కైబ్‌..
ఎస్‌బీఐ కార్డ్స్‌ ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌లో 26.54 రెట్లు  ఓవర్‌ సబస్క్రైబ్ అయ్యింది. కోవిడ్‌-19 ప్రభావం గ్లోబల్‌ మార్కెట్లపై ఉన్నపపటికీ ఎస్‌బీఐ ఐపీఓ అంచరనాలకు తగ్గట్టుగా సబ్‌స్క్రైబ్‌ అవ్వడం విశేషం.అర్హతగల కొనుగోలు దారులు 57.18 రెట్లు , నాన్‌ ఇన్‌స్టీట్షూన్‌ ఇన్వెస్టర్లు 45.23 రెట్లు, రిటైల్‌ విభాగం 2.5 రెట్లు, ఎస్‌బీఐ  ఉద్యోగులు 4.74 రెట్లు, ఎస్‌బీఐ షేర్‌ హోల్డర్లు 25.36 రెట్లు ఓవర్‌ సబ్‌స్ర్కైబ్‌ చేశారు. కాగా ఉద్యోగులు ఈ ఐపీఓలో రూ.75 డిస్కౌంట్‌ మీద షేర్లను సొంతం చేసుకోనున్నారు.You may be interested

ఫలితాలు 14న- యస్‌ బ్యాంక్‌.. ‍కేక!

Wednesday 11th March 2020

షేరు 30 శాతం జూమ్‌ ఇటీవలి కనిష్టం నుంచీ 424 శాతం అప్‌ సోమవారంనాటి భారీ పతనం నుంచి దేశీ స్టాక్‌ మార్కెట్లు కోలుకున్నాయి. తొలుత స్వల్ప నష్టాలతో ప్రారంభమైనప్పటికీ వెనువెంటనే జోరందుకున్నాయి. మధ్యాహ్నం 1.40 ప్రాంతంలో సెన్సెక్స్‌ 331 పాయింట్లు బలపడి 35,966కు చేరగా.. నిఫ్టీ 82 పాయింట్ల లాభంతో 10,533 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు 5 శాతం జంప్‌చేయడం, ట్రేడర్లు షార్ట్‌ కవరింగ్‌ చేపట్టడం వంటి

ఈక్విటీ ఎంఎఫ్‌ పెట్టుబడులు @ రూ.10,795.81కోట్లు

Wednesday 11th March 2020

వరుసగా మూడోనెలలోనూ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలోకి పెట్టుబడుల ప్రవాహం పెరిగింది. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లోకి ఈ ఫిబ్రవరిలో రూ.10,795.81 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈక్విటీ ఎంఎఫ్‌లలోకి పెట్టుబడుల ప్రవాహం పెరుగుతూ రావడం వరసగా ఇది 3వ నెల. అలాగే గడిచిన 11నెలల్లో పోలిస్తే ఈ ఫిబ్రవరిలో పెట్టుబడుల ప్రవాహం పెరిగినట్లు యాంఫీ గణాంకాలు చెబుతున్నాయి. మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు కరోనా వ్యాప్తి భయాలు తోడవడంతో బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు

Most from this category