News


ఎకానమీ ఇప్పట్లో కోలుకోదా..? మార్కెట్ల పరిస్థితి?

Sunday 17th November 2019
Markets_main1574013230.png-29649

హోల్‌సేల్‌ ద్రవ్యోల్బణం మరింత తగ్గడంతో ఆర్థిక మందగమనంపై ఆందోళనలు అధిగమయ్యాయి. ఆర్థిక రికవరీ తక్షణమే ఉండొచ్చనేదాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్‌ తోసిపుచ్చారు. ఆర్థిక మందగమనం, ఆర్‌బీఐ రేట్ల కోతపై ఆశలు సన్నగిల్లడంతో స్టాక్‌ మార్కెట్లు గతవారం ఫ్లాట్‌గా ముగిశాయి. మరి ఈ సమయంలో విశ్లేషకులు, మార్కెట్‌ నిపుణులు ఏమంటున్నారో వారి ట్వీట్లను గమనిస్తే తెలుస్తుంది.

 

ఈ సమయంలో టెలికం కంపెనీలు ఏజీఆర్‌ బకాయిలను ఖాతాల్లో చూపించాయి. ప్రభుత్వం పెద్ద ఉపశమనం కల్పించకపోతే కొన్ని నెలల్లోనే వీటిని చెల్లించాల్సి ఉంటుంది. దాంతో టెలికం కంపెనీలకు అసలు ఇబ్బంది అప్పుడే మొదలవుతుంది. ఏమవుతుందో చూద్దాం.. కోర్‌ ఇన్‌ఫ్లేషన్‌ వేగంగా పడిపోతోంది. అంటే ఆర్థిక రంగంలో డిమాండ్‌, ధరల శక్తి పడిపోతుందని తెలియజేస్తోంది. భారీ రేట్ల కోతే దీన్నుంచి బయటపడవేయగలదు. ఆర్‌బీఐ, ఎంపీసీ స్వల్ప కాల ధరల పెరుగుదలను పట్టించుకోకుండా లిక్విడిటీకి, రేట్ల తగ్గింపు దిశగా నిర్ణయం తీసుకుంటాయని ఆశిద్దాం. 7.8 శాతం నుంచి 5 శాతానికి వృద్ది రేటు పడిపోయింది. దీంతో వేగంగా నిదానిస్తున్న ఆర్థిక వ్యవస్థగా మారింది. వ్యవస్థల్లో ఇప్పటికీ లిక్విడిటీ ఇబ్బంది ఉందని చాలా కంపెనీలు ఇటీవలి త్రైమాసిక ఫలితాల సందర్భంగా పేర్కొన్నాయి. 

- సందీప్‌ సభర్వాల్‌

 

మరింత నిరాశావాదం వద్దు. మార్కెట్లో డబ్బులు సంపాదించాలంటే ఆశావాదంతో ఉండాలి. అమెరికాలో ఎస్‌అండ్‌పీ 500, డోవ్‌, నాస్డాక్‌, విల్‌షైర్‌ అన్నీ కూడా ఆల్‌టైమ్‌ హైలో ఉన్నాయి. ఆర్థిక రంగ విస్తరణ 124 నెలల పాటు చరిత్రలోనే సుదీర్ఘమైనది. ఉద్యోగ కల్పన వృద్ధి 109 నెలల్లోనే గరిష్టం. ఫెడ్‌ నాలుగో విడత రేట్ల కోతను 2020 మధ్య నాటికి చేపడుతుందని అంచనా. 

- నీలేష్‌షా, కోటక్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఎండీ

 

బుల్‌ మార్కెట్‌కు నాయకత్వం వహించే స్టాక్‌.. మీరు ఎందుకు కొనుగోలు చేయలేదన్న లాజిక్‌ను పట్టించుకోదు. అది పెరుగుతూనే వెళుతుంది.

- బసంత్‌ మహేశ్వరి

 

నష్టాల భయం లాభాల ఆర్జనకు అడ్డంకి. సిప్‌ ద్వారా ఇన్వెస్ట్‌ చేయడం, పడిపోయినప్పుడు కొనుగోలు చేయడం అస్థిరతలను అధిగమించే మార్గాలు. 

- అరుణ్‌ తుక్రాల్‌, యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ ఎండీYou may be interested

ఇండెక్స్‌ ఫండ్స్‌ కూడా పోర్ట్‌ఫోలియోలో ఉండాలి

Sunday 17th November 2019

మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే వారు కొంత మొత్తం పెట్టుబడులను ఇండెక్స్‌ ఫండ్స్‌కు కూడా కేటాయించుకోవాలని ఆర్థిక సలహాదారుల సూచన. ముఖ్యంగా ఇటీవలి కాలంలో మార్కెట్లను పరిశీలిస్తే.. ప్రధాన సూచీలు లాభాలను ఇచ్చాయి. కానీ, సూచీల్లోనే సగం స్టాక్స్‌ ఏ మాత్రం రాబడులను ఇవ్వలేదు. అయినా నిఫ్టీ నికరంగా లాభాలను ఇవ్వడం చూశాం. దీంతో ఇండెక్స్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసిన వారు సూచీల ర్యాలీతో కచ్చితంగా లాభపడ్డారు. నిజానికి ఇన్వెస్టర్లలోనూ

ఆర్‌కామ్‌ డైరెక్టర్‌గా అనిల్‌ అంబానీ రాజీనామా

Saturday 16th November 2019

రిలయన్స్‌ కమ్యూనికేషన్‌ డైరెక్టర్‌ పదవికి అనిల్‌ అంబానీ రాజీనామా చేశారు. తనతో పాటు మరో నలుగురు డైరెక్టర్లు చయ్యా విరాని, రైనా కరానీ, మంజరి కక్కర్‌, సురేశ్‌ రంగాచార్‌లు కూడా వైదొలిగారని కంపెనీ స్టాక్‌ ఎక్చేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. దివాలా ప్రకటించిన కంపెనీ ఆస్తుల విక్రయానికి రెడీ అవుతోంది. ఈ సమయంలో అనిల్‌ బోర్డు నుంచి వైదొలగడం గమనార్హం. వీరితో పాటు సీఎఫ్‌ఓ మనికంఠన్‌ కూడా తన రాజీనామాను సమర్పించారు.

Most from this category