News


హెచ్‌ఏఎల్‌, దీపక్‌ జూమ్‌- కాఫీ డే వీక్‌

Tuesday 14th January 2020
Markets_main1578982558.png-30918

హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ అప్‌
దీపక్‌ ఫెర్టిలైజర్స్‌ ప్లస్‌లో
కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ డీలా

కొద్ది రోజులుగా సరికొత్త గరిష్టాలను తాకుతున్న దేశీ స్టాక్‌ మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాట పట్టాయి. స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో విభిన్న సానుకూల వార్తల కారణంగా పీఎస్‌యూ రంగ ఇంజినీరింగ్‌ కంపెనీ హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌), ప్రయివేట్‌ రంగ సంస్థ దీపక్‌ ఫెర్టిలైజర్స్‌.. కౌంటర్లకు డిమాండ్‌ పుట్టింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. అయితే మరోవైపు స్టాక్‌ ఎక్స్ఛేంజీలు ట్రేడింగ్‌ నుంచి తప్పించనున్నట్లు హెచ్చరించిన నేపథ్యంలో కేఫ్‌ కాఫీ డే స్టోర్ల నిర్వహాక కంపెనీ కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో ఈ కౌంటర్‌ నష్టాలతో డీలాపడింది. వివరాలు చూద్దాం.. 

హెచ్‌ఏఎల్‌
పీఎస్‌యూ..హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌(హెచ్‌ఏఎల్‌) దీర్ఘకాలిక బ్యాంక్‌ సౌకర్యాలకు ఇక్రా.. AA రేటింగ్‌ను ప్రకటించింది. ఈ బాటలో స్వల్పకాలిక రేటింగ్‌ను సైతం A1+గా పేర్కొంది. కంపెనీకి స్థిరత్వంతో కూడిన(స్టేబుల్‌) ఔట్‌లుక్‌ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఉదయం 11 ప్రాంతంలో ఎన్‌ఎస్‌ఈలో హెచ్‌ఏఎల్‌ షేరు 5.6 శాతం జంప్‌చేసి రూ. 849 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 865 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. వరుసగా రెండు రోజుల్లో ఈ షేరు 14 శాతం ర్యాలీ చేయడం గమనార్హం!

దీపక్‌ ఫెర్టిలైజర్స్‌
గుజరాత్‌ దహేజ్‌లోని ఒక పారిశ్రామిక భూమిని విక్రయించినట్లు దీపక్‌ ఫెర్టిలైజర్స్‌ తాజాగా వెల్లడించింది. కీలకంకాని ఆస్తుల విక్రయంలో భాగంగా ఈ భూమిని రూ. 99 కోట్లకు విక్రయించినట్లు తెలియజేసింది. భవిష్యత్‌ అవసరాలకు వినియోగపడేలా దహేజ్‌లోగల నైట్రిక్‌ ఏసిడ్‌ తయారీ ప్లాంటువద్ద మిగులు భూమి ఉన్నదని ఈ సందర్భంగా వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో దీపక్‌ ఫెర్టిలైజర్స్‌ 5 శాతం జంప్‌చేసి రూ. 115 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 118 వరకూ ఎగసింది. కంపెనీలో ప్రమోటర్లకు 51.61% వాటా ఉంది.

కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌
వచ్చే నెల 3 నుంచి ట్రేడింగ్‌ను నిషేధించనున్నట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీలు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ తాజాగా హెచ్చరించిన నేపథ్యంలో కేఫ్‌ కాఫీ డే స్టోర్ల నిర్వాహక సంస్థ కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ కౌంటర్లో అమ్మకాలు పెరిగాయి. కొనుగోలుదారులు కరువుకావడంతో ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 5 శాతం లోయర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 37.70 వద్ద ఫ్రీజయ్యింది. త్రైమాసిక ఫలితాల వెల్లడికి సంబంధించి లిస్టింగ్‌ నిబంధనలు పాటించకపోవడంతో కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ షేర్ల ట్రేడింగ్‌పై నిషేధం విధించే యోచనలో ఉన్నట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీలు స్పష్టం చేశాయి. అయితే ఈ నెల 29లోగా  నిబంధనలు అమలు చేస్తే కాఫీ డే లిస్టింగ్‌ను కొనసాగించనున్నట్లు తెలియజేశాయి. కంపెనీ ఈ ఏడాది క్యూ1, క్యూ2 ఆడిటెడ్‌ ఫలితాలను ఎక్స్ఛేంజీలకు దాఖలు చేయలేదని వెల్లడించాయి.
 



You may be interested

2020లో జెఫరీస్‌ టాప్‌ మిడ్‌క్యాప్‌ సిఫార్సులు

Tuesday 14th January 2020

కొత్త ఏడాది ప్రభుత్వ వ్యయం పెరగడం, కొత్త ఉత్పత్తుల లాంచింగ్‌, ముడిపదార్ధాల వ్యయాలు తగ్గడం, బలమైన బాలెన్స్‌ షీట్‌ కారణంగా మిడ్‌క్యాప్స్‌ పురోగతి చూపుతాయని ప్రముఖ బ్రోకరేజ్‌ జెఫరీస్‌ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త ఏడాది కోసం టాప్‌ 3 మిడ్‌క్యాప్స్‌ను రికమండ్‌ చేస్తోంది. 1. సుప్రీం ఇండస్ట్రీస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1218. బలాలు: వాల్యూ యాడెడ్‌ పోర్టుఫోలియో. జీఎస్‌టీ తర్వాత సంఘటిత రంగంలోని కంపెనీలకు డిమాండ్‌ పెరగడం,

అమ్మకాల ఒత్తిడిలో పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లు

Tuesday 14th January 2020

అరశాతానికి పైగా నష్టపోయి నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు బుధవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌లోని పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ అరశాతానికి పైగా నష్టపోయింది. నేడు ఈ ఇండెక్స్‌ 2,467.75 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. బ్యాంకింగ్‌ రంగ షేర్ల అమ్మకాల్లో భాగంగా ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లకు అమ్మకాల సెగ తగిలింది. ఫలితంగా ఒకదశలో అరశాతం నష్టపోయి 2,456.05 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు

Most from this category