News


తగ్గిన జీవీకే నష్టాలు

Friday 14th February 2020
Markets_main1581676438.png-31801

జీవీకే పవర్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ శుక్రవారం క్యూ3 ఫలితాలను వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో  ఈ కంపెనీ కన్సాలిడేటెడ్‌ నికర నష్టం నామమాత్రంగా తగ్గి రూ.120.06 కోట్లకు చేరింది. కాగా క్రితం ఆర్థికసంవత్సరం ఇదే త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ నికర నష్టం రూ.122.61 కోట్లుగా ఉందని బీఎస్‌కీ ఇచ్చిన సమాచారంలో కంపెనీ పేర్కొంది. కంపెనీ కన్సాలిడేటెడ్‌ నికర ఆదాయం గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో నమోదైన రూ.1,109.28 కోట్ల నుంచి పెరిగి రూ1,156.15 కోట్లకు చేరింది. కాగా శుక్రవారం మార్కెట్‌ ముగిసే సమయానికి బీఎస్‌ఈలో జీవీకే షేరు 1.5 శాతం పెరిగి రూ.4.09 వద్ద ముగిసింది.


 



You may be interested

సుప్రీం ఎఫెక్ట్‌: పీఎస్‌యూలకు దెబ్బ..!

Friday 14th February 2020

ఏజీఆర్‌ అంశంలో టెలికాం కంపెనీల తీరుపై సుప్రీం కోర్టు మండిపడటంతో ఇతర పీఎస్‌యూ కంపెనీలు తన ఏజీఆర్‌ మోడిఫికేషన్‌ పిటీషన్లను ఉపసంహరించుకున్నాయి. గెయిల్‌ ఇండియా, ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌, పవర్‌గ్రిడ్‌లతో పాటు ఇతర ప్రభుత్వ రంగ కంపెనీలు రూ.1.72లక్షల కోట్ల ఏజీఆర్‌ బకాయిలను చెల్లించాల్సి ఉంది. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌, పవర్‌గ్రిడ్‌లు కంపెనీలు పిటిషన్లు ఉపసంహరించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇంట్రాడేలో ఈ కంపెనీ షేర్లు

పేజ్‌ ఇండస్ట్రీస్‌.. క్యూ3 దెబ్బ

Friday 14th February 2020

నిరుత్సాహకర ఫలితాలు 5 శాతం పతనమైన షేరు జాకీ బ్రాండ్‌ దుస్తుల కంపెనీ పేజ్‌ ఇండస్ట్రీస్‌ ప్రస్తుత ఆర్థిక సం‍వత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు సాధించింది. ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో పేజ్‌ ఇండస్ట్రీస్‌ నికర లాభం 15 శాతం క్షీణించి రూ. 87 కోట్లకు పరిమితమైంది. నిర్వహణ లాభ మార్జిన్లు 22 శాతం నుంచి 17 శాతానికి బలహీనపడ్డాయి. అయితే మొత్తం ఆదాయం మాత్రం 8 శాతం పెరిగి రూ. 794

Most from this category