News


జీటీపీఎల్‌, డెల్టా కార్ప్‌, అలుఫ్లోరైడ్‌ అప్‌

Friday 10th January 2020
Markets_main1578631783.png-30825

వరుసగా మూడో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు జోరందుకున్నాయి. ఇటీవల పశ్చిమాసియాలో తలెత్తిన ఉద్రిక్త వాతావరణం చల్లబడటంతో ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. దీంతో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ లాభాల సెంచరీ చేసింది. ఉదయం 10 ప్రాంతం‍లో 148 పాయింట్లు ఎగసి 41,600ను తాకగా.. నిఫ్టీ 40 పాయింట్లు పుంజుకుని 12,256 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల ఆధారంగా మిడ్‌ క్యాప్‌ కంపెనీలు జీటీపీఎల్‌ హాథవే, డెల్టా కార్ప్‌, అలు ఫ్లోరైడ్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వివరాలు చూద్దాం..

జీటీపీఎల్‌ హాథవే
కేబుల్‌, బ్రాడ్‌బ్యాండ్‌ సేవల కంపెనీ జీటీపీఎల్‌ హాథవే ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో క్వార్టర్‌లో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన నికర లాభం 78 శాతం పెరిగి రూ. 33 కోట్లకు చేరగా.. అమ్మకాలు 114 శాతం ఎగసి రూ. 674 కోట్లను తాకాయి. నిర్వహణ లాభం(ఇబిటా) 62 శాతం బలపడి రూ. 135 కోట్లను అధిగమించింది. కేబుల్‌ సేవల విభాగంలో 2.4 లక్షలు, బ్రాడ్‌బ్యాండ్‌ బిజినెస్‌లో 20,000 కొత్త సబ్‌స్క్రయిబర్లను సంపాదించినట్లు కంపెనీ పేర్కొంది. దీంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో జీటీపీఎల్‌ షేరు 4.2 శాతం జంప్‌చేసి రూ. 85 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 90 వరకూ ఎగసింది.

డెల్టా కార్ప్‌ లిమిటెడ్‌
అనుబంధ సంస్థ ద్వారా నేపాల్‌లో కాసినోను ప్రారంభించేందుకు లైసెన్స్‌ను పొందినట్లు డెల్టా కార్ప్‌ లిమిటెడ్‌ తాజాగా వెల్లడించింది. ఇందుకు వీలుగా ఇప్పటికే ఖాట్మండులోని మారియట్‌ హోటల్‌తో అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. దీంతో త్వరలోనే ఇక్కడ కాసినోను ప్రారంభించనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో డెల్టా కార్ప్‌ షేరు 3 శాతం లాభపడి రూ. 203 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 207 వరకూ ఎగసింది. కంపెనీలో ప్రమోటర్లకు 32.77% వాటా ఉంది. 

అలుఫ్లోరైడ్‌ లిమిటెడ్‌
జోర్డాన్‌లో అల్యూమినియం ఫ్లోరైడ్‌ తయారీకి సరికొత్త ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు అలు ఫ్లోరైడ్‌ లిమిటెడ్‌ పేర్కొంది. ఇందుకు వీలుగా జోర్డాన్‌ ఫాస్ఫేట్‌ మైన్స్‌ కంపెనీతో భాగస్వామ్య ఒప్పందాన్ని(జేవీ) కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. ఇందుకు ఇప్పటికే బోర్డు అనుమతించిన విషయాన్ని కంపెనీ ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బీఎస్‌ఈలో అలుఫ్లోరైడ్‌ షేరు 7.3 శాతం జంప్‌చేసి రూ. 106 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 111 వరకూ ఎగసింది. కంపెనీలో ప్రమోటర్లకు 59.29% వాటా ఉంది.You may be interested

రూ.40 వేలకు దిగువకు బంగారం ధర

Friday 10th January 2020

బంగారం ధర గురువారం మరింత తగ్గింది. దేశీయ బులియన్‌ మార్కెట్లో రూ.40వేల దిగువకు చేరుకుంది. డాలర్‌ మారకంలో రూపాయి విలువ 70స్థాయికి బలపడటం, అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గముఖం పట్టడం, ఈక్విటీ మార్కెట్లు ర్యాలీ తదితర అంశాలు బంగారానికి డిమాండ్‌ను తగ్గించాయి. సోమవారం ఎంసీఎక్స్‌లో 10గ్రాముల బంగారం ధర మునుపటి ముగింపు రూ.39830తో పోలిస్తే రూ.153లు లాభపడి రూ.39677.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. బంగారానికి ఇది వరుసగా మూడో రోజూ

బైజూస్‌కు భారీగా నిధులు

Friday 10th January 2020

ఇన్వెస్ట్‌ చేసిన టైగర్‌ గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌ న్యూఢిల్లీ: విద్యా సంబంధిత అత్యాధునిక టెక్నాలజీల్లో ప్రముఖ కంపెనీ అయిన బైజూస్‌.. టైగర్‌ గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌ నుంచి పెద్ద మొత్తంలో నిధులను అందుకుంది. కంపెనీ ఎంత మొత్తం అన్నది వెల్లడించనప్పటికీ.. టైగర్‌ గ్లోబల్‌ 200 మిలియన్‌ డాలర్లు (రూ.1,400 కోట్లు) ఇన్వెస్ట్‌ చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘‘విద్యార్థుల అభ్యాసన విధానాన్ని మార్చి వేయాలన్న మా దీర్ఘకాల దృక్పథాన్ని టైగర్‌ గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌తో భాగస్వామ్యం

Most from this category