News


పెరిగిన జీఎస్‌కే ఫార్మా లాభం

Wednesday 23rd October 2019
Markets_main1571804030.png-29069

రూ.882 కోట్లకు పెరిగిన ఆదాయం 

న్యూఢిల్లీ: గ్లాక్సోస్మిత్‌లైన్‌ ఫార్మాస్యూటికల్స్‌(జీఎస్‌కే ఫార్మా) ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.503 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్‌) ఆర్జించింది. గత క్యూ2లో రూ.101 కోట్ల నికర లాభం ఆర్జించామని జీఎస్‌కే ఫార్మా తెలిపింది. ఇక ఆదాయం రూ.816 కోట్ల నుంచి రూ.882 కోట్లకు పెరిగిందని పేర్కొంది. రూ.401 కోట్ల మినహాయింపు అంశాల కారణంగా నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని పేర్కొంది. భూ విక్రయం కారణంగా రూ.545 కోట్ల లాభం వచ్చిందని, ఆస్తుల నష్టం రూ.26 కోట్లని, ఉత్పత్తుల రీకాల్‌ వ్యయాలు రూ.111 కోట్లుగా ఉన్నాయని వివరించింది.ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో జీఎస్‌కే ఫార్మా షేర్‌ 2 శాతం లాభంతో రూ.1,469 వద్ద  ముగిసింది. 



You may be interested

నిబంధనలు స్థిరంగా ఉండేలా చూడండి: వాల్‌మార్ట్ సీఈవో

Wednesday 23rd October 2019

- ప్రధాని మోదీకి వాల్‌మార్ట్ సీఈవో డగ్ మెక్‌మిలన్ లేఖ న్యూఢిల్లీ: ఈ-కామర్స్‌ రంగానికి సంబంధించి డేటా గోప్యతపరమైన సమస్యలు పరిష్కరించాలని, నియంత్రణ సంస్థలపరంగా నిబంధనల్లో స్థిరత్వం ఉండేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోదీను రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ సీఈవో డగ్‌ మెక్‌మిలన్‌ కోరారు. అలాగే, కొత్త స్టోర్స్‌ ఏర్పాటుకు పొందాల్సిన లైసెన్సులు, పర్మిట్ల సంఖ్యను కూడా తగ్గించాలన్నారు. మెక్‌మిలన్ ఈ మేరకు మోదీకి లేఖ రాశారు. విదేశాల్లో తమ కార్యకలాపాల

మార్కెట్లోకి ‘బెనెల్లి ఇంపీరియల్ 400

Wednesday 23rd October 2019

- ధర రూ. 1.69 లక్షలు న్యూఢిల్లీ: ఇటలీకి చెందిన సూపర్‌ బైక్స్‌ తయారీ సంస్థ ‘బెనెల్లి’.. భారత మార్కెట్లోకి తాజాగా తన క్లాసిక్‌ మోడల్‌ ‘ఇంపీరియల్ 400’ బైక్‌ను ప్రవేశపెట్టింది. దీని ప్రారంభ ధర రూ. 1.69 లక్షలు (ఎక్స్‌-షోరూం)గా ప్రకటించింది. ఈ బైక్‌ 374సీసీ ఎయిర్‌-కూల్డ్‌ బీఎస్‌ సిక్స్‌ ఇంజిన్‌తో అందుబాటులోకి వచ్చింది. రూ. 4,000 డౌన్‌ పేమెంట్‌తో బుకింగ్స్‌ను స్వీకరిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. మూడేళ్ల అపరిమిత కిలోమీటర్ల

Most from this category