News


గ్రీన్‌లామ్‌, స్ట్రైడ్స్‌ ఫార్మా దూకుడు

Thursday 30th January 2020
Markets_main1580361510.png-31328

5 శాతంపైగా ఎగసిన షేర్లు
మార్కెట్లు నష్టాల బాటలో

నేడు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) కరోనా వైరస్‌పై అంతర్జాతీయ స్థాయిలో అత్యయిక పరిస్థితి(ఎమర్జెన్సీ)ని ప్రకటించనున్నట్లు వెలువడిన వార్తలు దేశీయంగా తిరిగి ఆందోళనలు పెంచాయి. దీంతో ఇన్వెస్టర్లు తొలి నుంచీ అమ్మకాలకు తెరతీశారు. ఫలితంగా నేలచూపులతో ప్రారంభమైన మార్కెట్లు తదుపరి మరింత నీరసించాయి. ఉదయం 10.20 ప్రాంతంలో సెన్సెక్స్‌ 202 పాయింట్లు క్షీణించి 40,997ను తాకింది. తద్వారా 41,000 పాయింట్ల దిగువకు చేరింది. ఇక నిఫ్టీ సైతం 62 పాయింట్లు తక్కువగా 12,067 వద్ద కదులుతోంది. ఈ నేపథ్యంలోనూ విభిన్న వార్తల కారణంగా లామినేట్స్‌ తయారీ కంపెనీ గ్రీన్‌లామ్‌ ఇండస్ట్రీస్‌, హెల్త్‌కేర్‌ రంగ కంపెనీ స్ట్రైడ్స్‌ ఫార్మా సైన్స్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి నష్టాల మార్కెట్లోనూ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..

గ్రీన్‌లామ్‌ ఇండస్ట్రీస్‌
సొంత అనుబంధ సంస్థ గ్రీన్‌లామ్‌ సౌత్‌ ద్వారా నెల్లూరులోని నాయిడుపేటలో తయారీ ప్లాంటును ఏర్పాటు చేసేందుకు బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు గ్రీన్‌లామ్‌ ఇండస్ట్రీస్‌ తాజాగా పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంటు ద్వారా లామినేట్స్‌, తదితర అనుబంధ ఉత్పత్తులను రూపొందించనున్నట్లు కంపెనీ తెలియజేసింది. దీంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో గ్రీన్‌లామ్‌ ఇండస్ట్రీస్‌ షేరు 6 శాతం జంప్‌చేసి రూ. 1008 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1038 వరకూ ఎగసింది.
రూ. 175 కోట్లు
ప్లాంటు ఏర్పాటుకు వీలుగా ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(ఏపీఐఐసీ) 65 ఎకరాల భూమిని ప్రొవిజనల్‌గా కేటాయించినట్లు గ్రీన్‌లామ్‌ ఇండస్ట్రీస్‌ వెల్లడించింది. తద్వారా 1.5 మిలియన్‌ లామినేట్‌ షీట్లు, బోర్డుల తయారీ సామర్ధ్యాన్ని అదనంగా జత చేసుకోనున్నట్లు వివరించింది. ఇందుకు రూ. 175 కోట్లవరకూ వెచ్చించనున్నట్లు తెలియజేసింది. లామినేట్స్‌ తయారీ గ్రీన్‌లామ్‌ కంపెనీలో ప్రమోటర్లకు 54.90%, వాటా ఉంది. 

స్ట్రైడ్స్‌ ఫార్మా సైన్స్‌
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో స్ట్రైడ్స్‌ ఫార్మా సైన్స్‌ నిరుత్సాహకర ఫలితాలు సాధించింది. అయినప్పటికీ ఈ కౌంటర్‌ జోరందుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో షేరు 4.5 శాతం జంప్‌చేసి రూ. 466 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 477 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరింది. కాగా.. క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో స్ట్రైడ్స్‌ ఫార్మా నికర లాభం 11 శాతం క్షీణించి రూ. 14 కోట్లకు పరిమితమైంది. స్టాండెలోన్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 13 శాతం నీరసించి రూ. 382 కోట్లను తాకింది. కంపెనీలో ప్రమోటర్లకు 31.28%, వాటా ఉంది. కాగా.. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన నికర లాభం 68 శాతం పడిపోయి రూ. 94 కోట్లకు చేరగా.. మొత్తం ఆదాయం మాత్రం 28 శాతంపైగా ఎగసి రూ. 745 కోట్లకు చేరింది.



You may be interested

యాపిల్‌ ... భారత్‌ జీడీపీలో సగం!

Thursday 30th January 2020

1.42 లక్షల కోట్ల డాలర్లకు చేరిన యాపిల్‌ విలువ భారత్‌ స్టాక్‌ మార్కెట్‌ మొత్తం విలువలో ఇది సగానికికంటే ఎక్కువ అదరగొట్టే త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన యాపిల్‌ సంస్థ నూతన రికార్డులు సృష్టిస్తోంది. బుధవారం ట్రేడింగ్‌లో షేరు ఆల్‌టైమ్‌ హై 327.25 డాలర్లను చేరింది. దీంతో కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ 1.42 లక్షల కోట్ల డాలర్లను దాటింది. ఇది భారత ఎకానమీ విలువలో దాదాపు సగానికి సమానం. 2020 అంచనాల ప్రకారం భారత

రూ. 40,700 స్థాయికి పసిడి

Thursday 30th January 2020

మళ్లీ పెరిగిన బంగారం ధర గత కొద్దిరోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న బంగారం ధర బుధవారం ఒక్కసారిగా రూ.400 తగ్గగా, గురువారం మళ్లీ రూ.700 మేర  పెరిగింది. గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో క్రితం రోజుతో పోలిస్తే ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి రూ.680 వరకూ పెరిగి 40,680.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కరోనా భయాలతో ప్రపంచ మార్కెట్లో పుత్తడి పెరగడంతో పాటు ఇక్కడ రూపాయి విలువ భారీగా 30 పైసల వరకూ పతనంకావడంతో

Most from this category