News


దీర్ఘకాల పెట్టుబడులకు సరైన సమయం: సెడానీ

Wednesday 4th March 2020
Markets_main1583262956.png-32251

దేశీయంగా, అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లలో ఎంతో ఆందోళన కనిపిస్తోందని ఆనంద్‌రాతికి చెందిన ఈక్విటీ అడ్వైజరీ సర్వీసెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సిద్ధార్థ సెడానీ తెలిపారు. అయితే, వ్యాల్యూ ఇన్వెస్టింగ్‌లో భాగంగా బాగా పడిపోయిన నాణ్యమైన కంపెనీలను పెట్టుబడుల కోసం ఎంచుకోవాలని తామ ఇన్వె‍స్టర్లకు సూచిస్తున్నట్టు చెప్పారు. మంచి కంపెనీల్లో పెట్టుబడులు ఈ సమయంలో ప్రారంభించుకోవాలన్నారు. కరోనా వైరస్‌ ప్రభావం తాత్కాలికమేనని చెప్పారు. దీర్ఘకాల పెట్టుబడులకు ఇది సరైన సమయంగా పేర్కొన్నారు. ఒక్కో స్టాక్‌ను విడిగా పరిశీలించాలని, మంచి ఎర్నింగ్స్‌ వృద్ధి అవకాశాలున్న కంపెనీలు ఎన్నో ఉన్నాయని గుర్తు చేశారు. గత ఐదేళ్లుగా కాంపౌండెండ్‌గా 15-20 శాతం మధ్య వృద్ధి చూపిస్తున్న కంపెనీలు ఎన్నో ఉన్నట్టు సెడానీ చెప్పారు. ఇటువంటి వాటిని తాము సూచిస్తు‍న్నట్టు తెలిపారు.

 

ఆటోమొబైల్‌ రంగంలో వ్యాల్యూ స్టాక్స్‌ను తాము ప్రస్తుతానికి పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు సిద్ధార్థ్‌ సెడానీ. రానున్న కాలంలో ద్విచక్ర వాహన విభాగంలో మంచి అవకాశాలుంటాయని, ఇందులో బజాజ్‌ ఆటో స్టాక్‌ ఎంతో ఆసక్తికరంగా ఉన్నట్టు పేర్కొన్నారు. అయితే, ప్రస్తుత కరోనా వైరస్‌ నేపథ్యంలో ఎగుమతులకు విఘాతం కలగొచ్చన్నారు. బజాజ్‌ ఆటో అమ్మకాల్లో సగం ఎగుమతులేనన్నది తెలిసిందే. టెలికం రంగంలో పెట్టుబడులకు ముందు నుంచి దూరంగానే ఉన్నట్టు సెడానీ తెలిపారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో పెట్టుబడుల ద్వారా టెలికం ర్యాలీలో పాల్గొనట్టు అయిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వొడాఫోన్‌ స్టాక్‌ను కొనుగోలు చేయడం సరైనది కాదన్నారు. ఆదిత్య బిర్లా గ్రూపులో మిగిలినవి చూడ్డానికి ఆకర్షణీయంగానే ఉన్నట్టు తెలిపారు. ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రి టైల్‌ మంచి బ్రాండెడ్‌ ఫ్రాంచైజీగా ఎదుగుతోందని, ఇటీవలే ఇన్నర్‌వేర్‌ విభాగంలోకి ప్రవేశించినట్టు చెప్పారు. You may be interested

అమ్మకాలకు విరామం పడినట్టేనా..?

Wednesday 4th March 2020

నిఫ్టీ మంగళవారం పుల్‌బ్యాక్‌ ర్యాలీని చూపింది. దీంతో ఏడు రోజుల నష్టాలకు తెరపడింది. సోమవారం భారీ అమ్మకాలను ఎదుర్కొన్న ఇండెక్స్‌ డైలీ చార్ట్‌లపై బుల్లిష్‌ హరామీ ప్యాటర్న్‌ను ఏర్పాటు చేసింది. బుల్లిష్‌ హరామీ క్యాండిల్‌ ఏర్పాటు కావడం కరెక్షన్‌ ఆగిపోవచ్చన్నదానికి సూచికగా పేర్కొన్నారు యస్‌ సెక్యూరిటీస్‌కు చెందిన ఆదిత్య అగర్వాల్‌. ‘‘నిఫ్టీ 11,320కు పైన నిలకడగా ట్రేడ్‌ అయితే తదుపరి 11,440-11,600 జోన్‌కు విస్తరించొచ్చు. అప్పుడు గత శుక్రవారం పతనంలో

నిఫ్టీ నష్టాలు ఆగితే... ఈ 17షేర్లలో ర్యాలీ..!

Tuesday 3rd March 2020

దేశీయ సూచీల్లో సోమవారం ముగింపు ప్రకారం 17 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌ సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా మారిన కంపెనీల్లో ఫైజర్‌, కాల్గేట్‌, ఇప్కా ల్యాబ్స్‌, అరవింద్‌ ల్యాబ్స్‌, సెలబ్రటీ ఫ్యాషన్‌ లిమిటెడ్‌, కన్సాయ్‌ నెరోలాక్‌ పెయింట్స్‌,  నవభారత్‌ వెంచర్‌, ముకుంద్‌ లిమిటెడ్‌, ఏషియన్‌ హోటల్స్‌(ఈస్ట్‌), జేఆర్‌డీఎంకేజేఎల్‌, మరెల్‌ ఓవర్సీస్‌,

Most from this category