మిడ్‌క్యాప్ ర్యాలీ మొదలైతే ఎక్స్‌ప్రెస్సే: గౌతంషా
By Sakshi

మిడ్‌క్యాప్ ఇప్పటికే బోటమ్ అవుట్ అయ్యాయని, లార్జ్‌క్యాప్‌లోనే దిద్దుబాటు జరగాల్సి ఉందన్నారు జేఎం ఫైనాన్షియల్ టెక్నికల్ అనలిస్ట్ గౌతంషా. మార్కెట్ గమనంపై మాట్లాడుతూ... మే 23 ఎన్నికల ఫలితాల నుంచి మార్కెట్ గమనం అంత ప్రోత్సాహకరంగా లేదన్నారు. మార్కె్ట్ ర్యాలీ చేసిన ప్రతీ సారీ దిద్దుబాటుకు గురవుతోందని, అలాగే, స్వల్పంగా పడిపోయిన ప్రతీసారి ఎంతో మూమెంటమ్ ఉంటున్నట్టు చెప్పారు. మార్కెట్ పడిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నారు. మధ్య కాలానికి మాత్రం తాము సానుకూలంగానే ఉన్నట్టు చెప్పారు. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌లో మంచి అవకాశాలు
‘‘గత 12 నెలల్లో మిడ్‌క్యాప్ స్టాక్స్ గణనీయంగా దిద్దుబాటుకు గరయ్యాయి. 2008 తరహా పరిస్థితిని చూస్తున్నాం. సగటున స్టాక్స్ 40-50 శాతం మధ్యలో పడిపోయాయి. మిడ్‌క్యాప్ 100 సూచీ ఇటీవలి గరిష్టాల నుంచి 30 శాతం పడిపోయింది. మిడ్‌క్యాప్, స్మాల్క్యాప్స్కు, నిఫ్టీకి మధ్య రేషియో చార్ట్‌ను పరిశీలిస్తే... ఐదేళ్ల కనిష్ట స్థాయిలో ఉంది. చారిత్రకంగా ఎక్కడి నుంచి రివర్సల్స్ అయితే చూశామో, ఆ స్థాయికి చేరాయి. అయితే, ఇప్పటికి ఇప్పుడు మళ్లీ ఈ స్టాక్స్ రివర్సల్ అవుతాయా? అంటే కాకపోవచ్చు. రానున్న రెండు, మూడు నెలల్లో మిడ్‌క్యాప్ టాపప్‌కు మంచి అనుకూలం. రికవరీ ఆరంభమైతే అది తొక్కిసలాట మాదిరిగానే ఉంటుంది. చాలా స్టాక్స్ ఈ స్థాయి నుంచి సులభంగానే రెట్టింపు అయ్యేంత కనిష్టాల్లో ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మిడ్‌క్యాప్ ఫండ్స్‌లో ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వీలైతే నేరుగా లేదా సిప్ మార్గంలో ఇన్వెస్ట్ చేసుకోవాలని మా క్లయింట్లకు సూచిస్తున్నాం. వచ్చే మూడేళ్లలో మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఈ స్థాయి నుంచి సులభంగానే 40-50 శాతం ర్యాలీ చేయగలదు. స్టాక్స్ సులభంగానే ఎన్నో రెట్లు పెరగగలవు. కనుక ఈ అవకాశాన్ని కోల్పోవద్దు. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ రికవరీ మొదలైతే అది చాలా వేగంగా ఉంటుంది. ఇది గొప్ప అవకాశం’’ అని గౌతంషా తెలిపారు.
You may be interested
యస్ బ్యాంకు విషయంలో ఏం చేయొచ్చు?
Tuesday 2nd July 2019ప్రైవేటు రంగంలో ఐదో అతిపెద్ద బ్యాంకు, యస్ బ్యాంకు. ఏడాది క్రితం వరకు యస్ బ్యాంకు పరిస్థితి బాగానే ఉంది. బ్యాంకు సారథిగా వ్యవస్థాపకుడు రాణా కపూర్ కొనసాగడానికి వీల్లేదంటూ ఆర్బీఐ పెట్టిన ఆంక్షలతో బ్యాంకుకు సమస్యలు మొదలయ్యాయి. ఖాతాల్లో ఎన్పీఏలను తగ్గించి చూపించిందన్న ఆరోపణలు రావడం, రాణా కపూర్ పదవీ కాలం పొడిగింపునకు ఆర్బీఐ నో చెప్పడంతో ఈ స్టాక్ రూ.404 గరిష్ట ధర నుంచి పడిపోవడం మొదలైంది.
11,900పైన నిఫ్టీ ముగింపు
Tuesday 2nd July 2019130 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ట్రేడింగ్ ఆద్యంతం లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు చివరికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 130 పాయింట్లు లాభపడి 39,816.48 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 44పాయింట్లు పెరిగి 11900 పైన 11,910.35 వద్ద ముగిసింది. సూచీలకు ఇది వరుసగా రెండో రోజు లాభాల ముగింపు. డాలర్ మారకంలో రూపాయి (9 పైసలు) బలహీనపడటంతో ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. మెటల్, ఎఫ్ఎంజీసీ, ఫైనాన్స్ సర్వీసెస్, అటో రంగ