News


9 శాతం డౌన్‌...2 నెలల కనిష్టానికి గ్రాసిమ్‌

Monday 29th July 2019
Markets_main1564393473.png-27384

ఆదిత్యా బిర్లా గ్రూప్‌నకు చెందిన గ్రాసీం ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ షేర్లు సోమవారం ట్రేడింగ్‌లో 2నెలల కనిష్టానికి పతనమయ్యాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.875.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. నేటి మార్కెట్‌ పతనంలో భాగంగా ఇంట్రాడేలో సిమెంట్‌ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోన్నాయి. ఆదిత్యాబిర్లా గ్రూప్‌ ఫ్లాగ్‌షిప్‌ కంపెనీ అయిన గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌...ఇదే గ్రూప్‌నకు చెందిన అల్ట్రాటెక్‌ సిమెంట్‌, వోడాఫోన్‌ ఐడియాల్లో గణనీయమైన వాటా కలిగి వుంది. దీంతో వోడాఫోన్‌ ఐడియా షేర్లు నేటి ట్రేడింగ్‌లో దాదాపు 27శాతం క్షీణించడం కూడా షేరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఫలితంగా నేడు గ్రాసీమ్‌ షేర్లు సైతం 9.50శాతం క్షీణించి రూ.789.20ల వద్ద ఇంట్రాడే కనిష్టానికి పతనమయ్యాయి. మధ్యాహ్నం గం.2:45ని.లకు షేర్లు గతముగింపు(రూ.874.90)తో పోలిస్తే 9శాతం నష్టంతో రూ.796.60ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.688.65లు, రూ.1,091.65లుగా నమోదయ్యాయి. సిమెంట్‌ తయారీలో వినియోగించే మెర్క్యూరీ నిల్వలు మోతాదుకు మించి ఉండటంతో ఎన్‌సీఎల్‌టీ.... గ్రాసీం కంపెనీకి గతవారంలో రూ.కోటి జరిమానా విధించిన సంగతి తెలిసిందే.



You may be interested

ఐసిఐసిఐ బ్యాంక్‌కు బ్రోకరేజ్‌ల థమ్స్‌అప్‌

Monday 29th July 2019

ఐసిఐసిఐ బ్యాంక్ జూన్ త్రైమాసిక ఫలితాలు మార్కెట్ల అంచనాలకు మించి నమోదు కావడంతో ఈ షేరు ఇన్వెస్టర్లను ఆకర్షించింది. సోమవారం ట్రేడింగ్‌లో బెంచ్‌మార్క్‌ సూచీలు నష్టాల్లో ఉండగా ఐసిఐసిఐ షేరు మాత్రం పాజిటివ్‌గా కదలాడింది. మధ్యాహ్నాం 2.51 సమయానికి ఈ షేరు 3.24 శాతం లాభపడి రూ.429.20 వద్ద ట్రేడవుతోంది. ఈ స్టాక్‌ వచ్చే ఏడాది కాలానికి 25-50 శాతం ర్యాలీ చేసే అవకాశం ఉందని బ్రోకరేజీలు అభిప్రాయపడుతున్నాయి.    

టాటామోటర్స్‌ డౌన్‌ 5.5 శాతం

Monday 29th July 2019

దేశీయ వాహన దిగ్గజ కంపెనీ టాటామోటర్స్‌ షేర్లు 5.50శాతం వరకు నష్టపోయాయి. తొలి త్రైమాసికంలో కంపెనీ ఆశించిన స్థాయిలో ఫలితాలను ప్రకటించకపోవడంతో పాటు నేడు అటో రంగ షేర్లలో నెలకొన్న అమ్మకాలు టాటా షేర్ల పతనానికి కారణమయ్యాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.148.50ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.  శనివారం జరిగిన 36వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో కొత్త వాహనాలపై రిజిస్ట్రేషన్‌ ధరలను పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. కొత్త కార్లపై

Most from this category