News


డిజిన్వెస్ట్‌మెంట్‌ను వేగవంతం చేసిన ప్రభుత్వం

Saturday 5th October 2019
Markets_main1570272789.png-28739

ప్రభుత్వరం‍గ సంస్థలలోని తమ వాటాను వేగంగా విక్రయించేందుకు ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసింది. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినేట్‌, డిజిన్వెస్ట్‌మెంట్‌ పక్రియను వేగతరం చేసేందుకు ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం ఆర్థిక శాఖ కింద పనిచేస్తున్నా ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌(డీఐపీఏఎం) శాఖను డిజిన్వెస్ట్‌మెంట్‌ పక్రియలో కీలక డిపార్ట్‌మెంట్‌గా మార్చింది. డిజిన్వెస్ట్‌మెంట్‌ పక్రియలో ఎదురవుతున్న సమస్యలను అధిగమనించేందుకు, వేగంగా ఈ పక్రియను పూర్తిచేసేందుకు, మంత్రుల జోక్యాన్ని తగ్గించేందుకు ఈ కొత్త విధానం సహాయపడుతుందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ‘వ్యూహాత్మక వాటా  విక్రయం’లో భాగంగా ప్రభుత్వ రంగ సం‍స్థలను నీతీ ఆయోగ్‌ గుర్తించేది. కొత్త విధానం వలన డీఐపీఏఎం కూడా నీతీ ఆయోగ్‌తో కలిసి ప్రభుత్వ రంగ సం‍స్థలను గుర్తించనుం‍ది. ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన సెక్రటరీలతో పాటే డీఐపీఏఎం సెక్రటరీ కూడా డిజిన్వెస్ట్‌మెంట్‌పై అంతర్గాత మంత్రిత్వ శాఖ సమావేశంలో పాల్గోంటారు. కాగా డిజిన్వెస్ట్‌మెంట్‌పై గత వారం జరిగిన సెక్రెటరీ సమావేశంలో  బీపీసీఎల్‌(భారత పెట్రోలియం)లో 53.29 శాతం, షిప్పింగ్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌సీఐ)లో 63.75 శాతం వాటాను, కాన్‌కోర్‌లో 30 శాతం వాటాను, నిప్కో(ఎన్‌ఈఈపీసీఓ)లో 100 శాతం వాటాను, టీహెచ్‌డీసీలో 75 శాతం ప్రభుత్వ వాటాను విక్రయించేం‍దుకు అంగీకారం కుదిరింది. ఈ సమావేశమయిన వారంలోనే ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొని రావడం గమనార్హం.
 



You may be interested

కొన్ని షేర్లే పెరగడమనే ప్రక్రియ కొనసాగదు

Saturday 5th October 2019

స్టాక్‌ పోలరైజేషన్‌పై సమీర్‌ అరోరా మార్కెట్లో కొన్ని స్టాకులపైనే మదుపరులు ఎక్కువ మక్కువ చూపడం, మిగతావి పేలవ ప్రదర్శన జరపడమనే ప్రక్రియ(పెట్టుబడులు కేంద్రీకృతం కావడం)ఎక్కువ కాలం ఉండదని ప్రముఖ ఫండ్‌ మేనేజర్‌ సమీర్‌ అరోరా అభిప్రాయపడ్డారు. మార్కెట్‌ గమనం కొనసాగాలంటే పోలరైజేషన్‌(కేంద్రీకరణ) దీర్ఘకాలం ఉండకూడదని, క్రమంగా పరిధి విస్తృతం కావాల్సిఉంటుందన్నారు. ప్రస్తుతం ఎక్కువ మంది ఇన్వెస్టర్లు కొన్ని లార్జ్‌క్యాప్స్‌పైనే మక్కువ చూపుతున్నారు. ప్రభుత్వం కార్పొరేట్‌ టాక్స్‌ కోతలు ప్రకటించిన అనంతరం సూచీలు

భారత్‌-22 ఈటీఎఫ్‌కు 12రెట్లు అధిక స్పందన

Saturday 5th October 2019

ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్‌ నిర్వహించిన భారత్‌ 22 ఈటీఎఫ్‌ నాలుగో విడుత ఆఫర్‌కు ఇన్వెస్టర్ల నుంచి స్పందన లభిస్తుంది. రూ.2000 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఈ ఆఫర్‌ తీసుకురాగా. 12రెట్ల అధికంగా రూ.23, 500 కోట్ల విలువైన బిడ్లు ధాఖలయ్యాయి. ఆఫర్‌ నుంచి అదనంగా మరో రూ.4368 కోట్ల బిడ్లను అట్టిపెట్టికోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్, పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సెక్రటరీ తెలిపారు. తక్కువ వాల్యూవేషన్లు, పెట్టుబడుల ఉపసంహరణలపై

Most from this category