News


మీ మొబైల్‌ బిల్లు మోత ఖాయం

Thursday 28th November 2019
Markets_main1574919688.png-29921

టెలికాం కంపెనీలు ఫ్లోర్‌ ప్రైస్‌(కంపెనీలన్ని కలిసి నిర్ణయించిన ధర)ను ఏర్పరిచేందుకు టెలికాం నియంత్రణ సంస్థ(ట్రాయ్‌), టెలికాం డిపార్ట్‌మెంట్‌ అంగీకరించలేదు. అయినప్పటికి టెలికాం కంపెనీలయిన భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌-ఐడియా, రిలయన్స్‌ జియో, భారత్‌ సంచార్‌ నిగమ్‌ వచ్చే నెల నుంచి టారిఫ్‌లను పెంచేందుకు సిద్ధపడుతున్నాయని, ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోదలుచుకోలేదని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ‘ఫ్లోర్‌ ప్రైస్‌ను ఏర్పరచడంపై ఇంకా ఎటువంటి చర్చ అవసరం లేదు’ అని టెలికాం డిపార్ట్‌మెంట్‌ అధికారి ఒకరు అన్నారు. ‘టారిఫ్‌లను పెంచేందుకు టెల్కోలు ఇప్పటికే నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఇవి టారిఫ్‌లను మరింత పెంచొచ్చు. ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోదు’ అని వివరించారు. కాగా  ప్లోర్‌ ప్రై‍స్‌ను ఏర్పరచడంపై టెలికాం కంపెనీలు విముఖంగా ఉన్నాయి. ఈ కంపెనీలు టారిఫ్‌లను పెంచడంపై అధికంగా ఆసక్తి చూపిస్తున్నాయి. ‘టారిఫ్‌లు పెరిగిన తర్వాత  దీని ప్రభావం ఏఆర్‌పీయూ(వినియోగదారుడి నుంచి సగటు రెవెన్యూ)పై ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఒక వేళ ఏఆర్‌పీయూ నిలకడైన స్థాయిలో కొనసాగితే, ప్లోర్‌ ప్రైస్‌ను ఏర్పాటు చేయవలసిన అవసరం లేదు’ అని ప్రైవేట్‌ టెల్కోలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సెల్యులర్‌ ఆపరేషన్‌ ఆసోసియేషన్‌ డైరక్టర్‌ జనరల్‌ రాజన్‌ మాథ్యుస్‌ అన్నారు. ‘ప్లోర్‌ ప్రైస్‌ ఒక క్లిష్టమైన సమస్య. ప్రస్తుతం ఏఆర్‌పీయూను నిలకడైన స్థాయిలో ఉంచడంపై దృష్ఠి సారిస్తున్నాం. ఇది టెలికాం పరిశ్రమ తిరిగి పుంజుకోడానికి సహాయపడుతుంది’ అని తెలిపారు.  కాగా టెలికాం నియంత్రణ సంస్థతో బుధవారం జరిగిన సమావేశంలో ఫ్లోర్‌ ప్రైస్‌ సంబంధించిన విషయాన్ని వొడాఫోన్‌-ఐడియా లేవనెత్తగా, బీఎస్‌ఎన్‌ఎల్‌ వ్యతిరేకించిందని పరిశీలకులు తెలిపారు. 
   టెలికాం కంపెనీల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్లోర్‌ ప్రైస్‌ను పరిశీలించమంటూ  సెక్రటేరిస్‌ ప్యానెల్‌.... నియంత్రణ సంస్థను అడుగుతున్నప్పటికి, ట్రాయ్‌(టెలికాం నియంత్రణ సంస్థ) ఈ అంశాన్ని 2017 నుంచి తోసిపుచ్చుతోందని పరిశీలకులు తెలిపారు. ఈ అంశాన్ని ట్రాయ్‌ సుమోటాగా తీసుకోదని, ఇది వినియోగదారులకు వ్యతిరేకమే కాకుండా, భవిష్యత్‌లో కొత్త సాంకేతికత ఈ రంగంలోకి రావడానికి అడ్డంకిగా ఉంటుందని వివరించారు. టెలికాం కంపెనీల వ్రాతపూర్వక విజ్ఞప్తితో పాటు, టెలికాం డిపార్ట్‌మెంట్‌ సిఫార్సును ట్రాయ్‌ కోరగా ఇప్పటి వరకు ఇది జరగక పోవడం గమనార్హం. కాగా ధరలకు సంబంధించిన అంశం ట్రాయ్‌ చేతిలో ఉంటుంది. దీనిపై మేము ఏ విధంగా సిఫార్సు చేయగలం?’ అని టెలికాం డిపార్టుమెంట్‌కు చెందిన అధికారి ఒకరు తెలిపారు. ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వం ధరలను పెంచుకోవచ్చని టెలికాం కంపెనీలకు అవకాశం ఇచ్చింది. మొదట్లో దీనిపై వొడాఫోన్‌-ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌ సానుకూలంగా ఉన్నప్పటికి, జియో తమను అనుసరించకపోతే చందాదారులను కోల్పోతామని ఈ కంపెనీలు ఆందోళన చెందాయి. ‘జియో టారిఫ్‌లను పెంచడానికి వెనుకాడుతున్నప్పటికి, ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌పై చార్జీలను వసూల్‌ చేయడంతో ధరలను పెంచింది. ఇది 14-15 శాతం ధరల పెరుగుదలకు కారణమవుతుంది’ అని పరిశ్రమకు చెందిన అధికారి ఒకరు అన్నారు. ‘చివరికి జియో ప్రభుత్వ అభ్యర్ధనను అంగీకరించింది.  అయినప్పటకి వొడా-ఐడియా, ఎయిర్‌టెల్‌ కంపెనీలు పెంచేంతగా జియో టారిఫ్‌ను పెంచకపోవచ్చు. ఈ కంపెనీలు వచ్చే డిసెంబర్‌ నుంచి టారిఫ్‌లను పెంచుతామని ప్రత్యక్షంగా ప్రకటించాయి. జియో టారిఫ్‌లను పెంచడంపై అంగీకరించినప్పటికి, ఇది నియంత్రణ సంస్థ నిబంధనలకు అనుగుణంగా వచ్చే రెండుమూడు వారాల్లో ఉంటుందని ప్రకటించింది’ అని వివరించారు. 
     టారిఫ్‌లను పెంచడంతో పాటు, రూ. 42,000 కోట్ల స్పెక్ట్రమ్‌ చెల్లింపులను చేయడానికి ప్రభుత్వం టెలికాం కంపెనీలకు రెండేళ్ల సమయాన్నిచ్చింది. ఈ చర్యల వలన తగినంత నిధుల ప్రవాహాం పెరిగి, టెలికాం సెక్టార్‌ రికవరి బాట పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికి రూ. 1.47 లక్షల కోట్ల ఏజీఆర్‌ బకాయిలకు చెందిన విషయంలో ఉపశమనం కోసం, సుప్రీం కోర్టులో వేసిన రివ్యూ పిటీషన్‌పై కోర్టు ఇచ్చే తీర్పు కోసం వేచి ఉండాల్సిందే. టెలికాం డిపార్ట్‌మెంట్‌ సుప్రీం తీర్పుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటుందని అధికారులు తెలిపారు. కాగా స్పెక్ట్రమ్‌ చెల్లింపులు చేయడానికి రెండేళ్ల సమయం కావాలని, లైసెన్స్‌ ఫీజులు, స్పెక్ట్రమ్‌ ఉపయోగించే చార్జీలను తగ్గించడం, ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్స్‌లో భాగంగా రూ. 35,000 కోట్లను రిఫండ్‌ చేయడం వంటి చర్యలను తీసుకోవాలిన వొడా-ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌ ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అంతేకాకుండా ప్లోర్‌ ప్రైస్‌ను ఏర్పాటు చేయడం వలన తక్షణ ఉపశమనం కలుగుతుందని అభిప్రాయపడుతున్నాయి. 



You may be interested

ముకేశ్‌ అంబానీ@రూ.5లక్షల కోట్ల అధిపతి.

Thursday 28th November 2019

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధితి ముకేశ్‌ అంబానీ మరో ఘనత సాధించారు. దేశంలోనే రూ.5లక్షల కోట్లను ఆర్జించిన తొలి వ్యక్తిగా రికార్డుకెక్కారు. తనసొంత కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గురువారం ట్రేడింగ్‌లో రూ.10లక్షల కోట్లను అందుకున్న నేపథ్యంలో ముకేశ్‌ సంపాదన రూ.5లక్షల కోట్లకు చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంల రెండో త్రైమాసిక ఫలితాల అనంతరం కంపెనీలో అదనంగా 2.76శాతం ప్రమోటర్ల వాటాను దక్కించుకోవడంతో కంపెనీలో ముకేశ్‌ మొత్తం వాటా 50.50శాతానికి చేరుకుంది. గత

రూ. 10 లక్షల కోట్ల కంపెనీగా రిలయన్స్‌!

Thursday 28th November 2019

దేశంలో రూ. 10 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాపిటల్‌ కలిగివున్న కంపెనీగా, ముఖేష్‌ అంబానీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గురువారం సెషన్‌లో అవతరించింది. గత కొన్ని సెషన్‌లలో రూ. 10 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాప్‌ మార్కుకు దగ్గరగా వచ్చి వెనుతిరిగిన ఈ కంపెనీ, తన టెలికాం విభాగం రిలయన్స్‌ జియోపై ఇన్వెస్టర్లు సానుకూలంగా ఉండడంతో గురువారం ఈ మైలు రాయిని అందుకుంది. టెలికాం కంపెనీల టారిఫ్‌ల పెంపుపై ప్రభుత్వం జోక్యం

Most from this category