News


టెలికం ఎస్‌పీవీ ఏర్పాటు యోచనలో ప్రభుత్వం?!

Thursday 23rd January 2020
Markets_main1579773454.png-31139

టెలికం రంగానికి సాయం చేసేందుకు ఒక స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌(ఎస్‌పీవీ) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు బిజినెస్‌స్టాండర్డ్‌ నివేదిక వెల్లడించింది. ఈ మేరకు సీఓఏఐ తన సభ్యులకు పంపినట్లు చెబుతున్న వివరాలను నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం టెలికం కంపెనీలు తమ ఏజీఆర్‌ బకాయిలను వార్షిక వాయిదాల రూపంలో ఎస్‌పీవీకి జమ చేయమని ప్రభుత్వం కోరనుంది. ఈ మొత్తాలను ఈక్విటీకింద పరిగణిస్తారు. దీంతో పాటు టెలికం కంపెనీలకు అవసరమైన 5జీ నెట్‌వర్క్‌కు కావల్సిన ఆర్థిక సాయాన్ని కూడా ఎస్‌పీవీ అందించవచ్చని నివేదిక తెలిపింది. ఈ ఎస్‌పీవీ ఏర్పాటైతే టెల్కోలను వార్షిక లైసెన్స్‌ ఫీజు, స్పెక్ర్టం యూసేజ్‌ చార్జీలను కోరకూడదని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపింది. టెల్కోలు ఈ రెండిటినీ ఈక్విటీకి బదులుగా ఎస్‌పీవీకే చెల్లిస్తాయి. వచ్చే 15ఏళ్లకు ఈ చార్జీల మొత్తం రూ. 4.83 లక్షల కోట్లవుతుంది. దీనికితోడు ప్రభుత్వం  రూ. 2.5 లక్షల కోట్ల సాయాన్ని రెండు రూపాల్లో ఎస్‌పీవీకి ఈక్విటీ పొందేందుకు అందించనుందని నివేదిక వివరించింది. ఇందులో భాగంగా రూ. 1.5 లక్షల కోట్ల విలువైన 5జి స్పెక్ట్రాన్ని ఎలాంటి వేలం లేకుండా ఎస్‌పీవీకి అందిస్తారు. మరో రూ. లక్ష కోట్ల విలువైన కేబులింగ్‌ అనుమతులు కేటాయిస్తారు. వీటిని ఎస్‌పీవీ ఆయా టెల్కోలకు తగు నిష్పత్తిలో అందిస్తుంది. ఈ నివేదికపై అభిప్రాయాలిమ్మని టెల్కోలను సీఓఏఐ కోరినట్లు నివేదిక తెలిపింది. ఎస్‌పీవీ వార్తలతో వొడాఐడియా, ఎయిర్‌టెల్‌ షేర్లు గురువారం లాభాల్లో ముగిశాయి. 



You may be interested

హాస్పిటల్స్‌, ఫార్మాపై దృష్టి పెట్టవచ్చు

Thursday 23rd January 2020

దేశీ మార్కెట్లపై దృష్టిపెట్టిన హెల్త్‌కేర్‌ కంపెనీలపట్ల ఆసక్తిగా ఉన్నట్లు దీపన్‌ మెహతా చెబుతున్నారు. ఆరోగ్యపరిరక్షణ రంగంలో హాస్పిటల్స్‌ కౌంటర్లను ఎంపిక చేసుకోనున్నట్లు తెలియజేశారు. ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎలిగ్జిర్‌ ఈక్విటీస్‌ వ్యవస్థాపకులు, డైరెక్టర్‌ అయిన మెహతా మార్కెట్ల నడకసహా పలు అంశాలపై అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం.. పెయింట్స్‌ ఖరీదెక్కువ పెయింట్స్‌ రంగ కౌంటర్లు ప్రస్తుతం అత్యంత ఖరీదుగా ఉన్నాయి. ఉదాహరణకు ఏషియన్‌ పెయింట్స్‌ నిర్వహణ లాభం 8

చమురు తగ్గుదల ఎఫెక్ట్‌...పెట్రో షేర్లకు జోష్‌

Thursday 23rd January 2020

భారీగా తగ్గిన చమురు ధరలు 6 శాతం జంప్‌చేసిన ఐవోసీ చైనాలో తలెత్తిన కరోనా వైరస్‌ దెబ్బకు ముడిచమురు ధరలు దిగివస్తున్నాయి. గత రాత్రి అమెరికా ట్రేడింగ్‌లో మొదలైన చమురు ధరల పతనం గురువారం ఆసియా ట్రేడింగ్‌లో సైతం కొనసాగింది. నాలుగు శాతంపైగా క్షీణించడంతో విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరలు 7 వారాల కనిష్టానికి చేరాయి. దీంతో దేశీయంగా ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల కౌంటర్లకు డిమాండ్‌ పెరిగింది. లాభాల బాటలో చమురు ధరలు నీరసించిన నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో

Most from this category