News


డిసెంబర్‌లో డెట్‌ ఈటీఎఫ్‌!

Thursday 21st November 2019
Markets_main1574330874.png-29763

కేంద్ర ప్రభుత్వం స్థిరంగా ఆదాయాన్నిచ్చే ఈటీఎఫ్‌(ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌)ను ఈ డిసెంబర్‌లో ప్రారంభించనుందని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ ఈటీఎఫ్‌ పరిమాణం రూ. 15,000-20,000 కోట్లుగా ఉంటుందని, ఇందులో డెట్‌ సెక్యురిటీలు, ప్రభుత్వ రంగ కంపెనీలు ఉంటాయని వివరించారు. ‘పీఎస్‌యూ(ప్రభుత్వం రంగ సం‍స్థలు)లకు చెందిన ఏఏఏ రేటింగ్‌ పత్రాలను మాత్రమే ఈ ఫండ్‌ కలిగివుంటుంది. అంతేకాకుండా ఈ ఫండ్‌ ఏడు శాతం రిటర్న్‌ను ఆఫర్‌ చేస్తుంది. ఇది పన్ను రేటు తగ్గిన తర్వాత ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై చాలా బ్యాంకులు ఆఫర్‌ చేస్తున్న 5.5 శాతం కంటే ఎక్కువ కావడం గమనార్హం’ అని వివరించారు. ‘మేమిప్పటికే కొన్ని రోడ్‌ షోలు చేశాం. ఈ డెట్‌ ఈటీఎఫ్‌ డిసెంబర్‌ నాటికి ప్రారంభమవుతుందని ఆశిస్తున్నాం’ అని ప్రభుత్వ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. కాగా ఈ ఈటీఎఫ్‌లో అతి పెద్ద కేంద్ర ప్రభుత్వ సంస్థలు పాల్గొంటాయని పరిశీలకులు తెలిపారు. ఇప్పటి వరకు ఇండియాలో గోల్డ్‌, ఈక్విటీకి సంబంధించిన ఈటీఎఫ్‌లు ఉన్నాయి కానీ డెట్‌ ఈటీఎఫ్‌లు లేకపోవడం గమనార్హం. సెక్యురిటీ ఆధారిత ఈటీఎఫ్‌లు రెండున్నప్పటికి అవి ఇన్వెస్టర్లను అంతగా ఆకర్షించలేకపోయాయి. డెట్‌ మ్యుచువల్‌ ఫండ్స్‌కు వర్తించే పన్ను నిబంధనలే డెట్‌ ఈటీఎఫ్‌కు వర్తిస్తాయని పరిశీలకులు తెలిపారు. ఆర్థిక సంవత్సరం 2019లో ప్రభుత్వం రూ. 45,730 కోట్ల విలువైన ఈటీఎఫ్‌లను విక్రయించింది. 



You may be interested

స్వల్ప నష్టంతో ముగింపు

Thursday 21st November 2019

సూచీల రెండురోజుల వరుస లాభాల ముగింపునకు గురువారం బ్రేక్‌ పడింది. ఇంట్రాడే ఆద్యంతం పరిమితి శ్రేణిలో ట్రేడైన సూచీలు చివరి అరగంటలో అమ్మకాలు పెరగడంతో సెన్సెక్స్‌ 76 పాయింట్ల నష్టంతో 40,575 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 30 పాయింట్లను కోల్పోయి 11,968 వద్ద ముగిసింది. అమెరికా చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం అంశంపై సరైన స్పష్టత కోసం ట్రేడర్లు ఎదురుచూస్తున్నారు. బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 3 పాయింట్ల నష్టంతో 31,350

బీపీసీఎల్‌ వాటా విక్రయంతో ఓఎంసీల రీరేటింగ్!

Thursday 21st November 2019

నిపుణుల అంచనా బీపీసీఎల్‌ ప్రైవేటేజేషన్‌తో మొత్తం ఓఎంసీ రంగం రీరేటింగ్‌ పొందే ఛాన్సుందని షేర్‌ఖాన్‌ వైస్‌ప్రెసిడెంట్‌ హేమాంగ్‌ జాని అభిప్రాయపడ్డారు. కంపెనీలో వాటాల విక్రయానికి ప్రభుత్వం అధికారిక అనుమతినిచ్చింది. దీంతో ఈ రంగంలోని కంపెనీల నిజవిలువ మరింతగా బయటకు రానుందని జాని తెలిపారు. ప్రభుత్వ అనుమతితో మార్కెట్‌కు వాటాల విక్రయంపై నమ్మకం కుదిరిందన్నారు. బీపీసీఎల్‌లో వాటాలతో పాటు యాజమాన్య నిర్వహణను సైతం ప్రభుత్వం విక్రయించనుంది. దీంతో కంపెనీ కోసం హేమాహేమీలు పోటీ

Most from this category