News


యస్‌ బ్యాంక్‌ కొనుగోలుకు ఎస్‌బీఐ సిద్ధం.!?

Thursday 5th March 2020
Markets_main1583387995.png-32298

  • 16శాతం పెరిగిన యస్‌బ్యాంక్‌ షేరు
  • 5శాతం నష్టపోయి రికవరి ఐన ఎస్‌బీఐ షేరు

ఎస్‌బీఐ కొనుగోలు చేస్తుందనే వార్తలతో గురువారం ఉదయం ట్రేడింగ్‌లో యస్‌బ్యాంక్‌ షేరు 16 శాతం లాభపడింది. నేడు బీఎస్‌లో యస్‌బ్యాంక్‌ షేరు రూ.29.30 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. యస్‌బ్యాంక్‌లో వాటాను కొనుగోలు చేసేందుకు ఎస్‌బీఐకు ‘‘బ్యాంకు కన్సార్టియం’’ను ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్లు బ్లూంబర్గ్‌ వార్త కథనాలు వెల్లడించాయి. దీంతో ఒక్కసారి యస్‌బ్యాంక్‌ షేర్లకు డిమాండ్‌ పెరిగి కొనుగోళ్లు ఊపందుకున్నాయి. షేరు ఒకదశలో 16.04శాతం వరకు పెరిగి రూ.34.00 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఉదయం గం.11:00లకు షేరు మునుపటి ముగింపు(రూ.29.30)తో పోలిస్తే 13శాతం లాభపడి రూ.33.05 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.28.05, రూ.285.90గా నమోదయ్యాయి. 

పీకల్లోతు అప్పులతో నిండా మునిగిన యస్‌బ్యాంక్‌ గురించి ఈ ఏడాది జవవరిలో బ్యాంక్‌ ఛైర్మన్‌ మాట్లాడుతూ ‘‘అతికొద్ది రోజుల్లో యస్‌బ్యాంక్‌ సమస్యకు పరిషార్కం దొరుకుతుంది’’ అని వ్యాఖ్యానించారు. కంపెనీలో వాటా కొనుగోలుకు వ్యూహాత్మక ఇన్వెస్టర్‌ను తీసుకురావడంలో యస్‌బ్యాంక్‌ యాజమాన్యం విఫలమైంది. సుమారు 300-500 మిలియన్‌ డాలర్ల విలువైన తాజా ఈక్విటీ మూలధనాన్ని మ్యూచువల్‌ ఫండ్ల నుంచి సమీకరించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. నాలుగు ప్రధాన ఇన్వెస్టర్లు ధాఖలు చేసిన నాన్‌ బిడ్డింగ్‌ ఆసక్తి దరఖాస్తులను సమీక్షిస్తున్నందున ఈ ఆర్థిక సంవత్సరపు మూడో త్రైమాసిక ఫలితాల ప్రకటను వాయిదా వేస్తున్నట్లు యస్‌బ్యాంక్‌ గతంలో ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఎస్‌బీఐలో షార్ప్‌ సెల్లింగ్‌: ఆపై కనిష్టం నుంచి 10.50శాతం రికవరి
యస్‌బ్యాంక్‌లో వాటా కొనుగోలు వార్తలతో ఎస్‌బీఐ షేరు గురువారం ట్రేడింగ్‌లో 5.32శాతం నష్టాన్ని చవిచూసి వెంటనే రికవరి అయ్యింది. నేడు బీఎస్‌ఈలో ఎస్‌బీఏ షేరు రూ.292.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. వాటా కొనుగోలు వార్తలతో షేరులో షార్ప్‌ సెల్లింగ్‌ వచ్చింది. ఒకదశలో 5.32శాతం నష్టపోయి రూ.270.10వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఆపై అంతే వేగంగా రికవరీ అయ్యింది. కనిష్ట స్థాయి(రూ.270.10) నుంచి ఏకంగా 10.50శాతం రికవరి అ‍య్యింది. మధ్యాహ్నం గం.12:00ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(రూ.285.30)తో పోలిస్తే 4శాతం నష్టంతో రూ.296.30 వద్ద ట్రేడ్‌ అవుతోంది. షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.244.35 రూ.373.70గా నమోదయ్యాయి. You may be interested

ఏడాది కనిష్టానికి 239 షేర్లు

Thursday 5th March 2020

గురువారం ఎన్‌ఎస్‌ఈలో 239 షేర్లు 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. వీటిలో 21ఫస్ట్‌ సెంచురీ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌, 3పీ ల్యాండ్‌ హోల్డింగ్స్‌, అబాన్‌ ఆఫ్‌షోర్‌, ఆధునిక్‌ ఇండస్ట్రీస్‌, అగ్రీటెక్‌ఇండియా, అజ్మీర్‌ రియాల్టీ అండ్‌ ఇన్‌ఫ్రా ఇండియా, అశోక్‌ ఇండస్ట్రీస్‌, ఆంధ్రా పేపర్‌, అలోక్‌ ఇండస్ట్రీస్‌, అపోలో సింధూరి హోటల్స్‌, ఆర్కోటెక్‌, ఆరో గ్రానైట్‌ ఇండస్ట్రీస్‌, అసోసియేటెడ్‌ ఆల్కాహాల్స్‌ అండ్‌ బ్రూవరీస్‌, అట్లాంటా, ఆటోలైన్‌ ఇండస్ట్రీస్‌, ఆటోలైట్‌ ఇండియా, బజాజ్‌ కన్జూమర్‌ కేర్‌,

రూ.43,000 పైన స్థిరంగా బంగారం!

Thursday 5th March 2020

చైనాలోనేకాగా ఇతర దేశాల్లో సైతం కోవిడ్‌-19 వైరస్‌ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు అనిశ్చితిలో కొనసాగుతుండడంతో బంగారం ధరలు పెరుగుతూ పోతున్నాయి. తాజాగా బంగారం ధర రూ.43,000 పైకి చేరింది. గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో దేశీయ మల్టీకమోడిటీ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే రూ.50 తగ్గి 10 గ్రాముల బంగారం 43,422.00 వద్ద ట్రేడ్‌అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే 2 డాలర్లు తగ్గి ఔన్స్‌

Most from this category