News


జవనరి 30 నుంచి సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌ ఏడో ఇష్యూ..!

Friday 24th January 2020
Markets_main1579854348.png-31169

  • రూ.10వేల కోట్ల సమీకరణ యోచనలో కేంద్రం

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల(సీపీఎస్‌ఈ) ఈటీఎఫ్‌ ఏడో విడుత ఇష్యూ ఈ నెలాఖరున ప్రారంభం కాబోతుంది. తద్వారా కేంద్రం రూ.10వేల కోట్లను సమీకరించాలని భావిస్తున్నట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆరుసార్లు సీపీఎస్‌ఈ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్(ఈటీఎఫ్) ఇష్యూకు జారీ చేసింది. ఇన్వెస్టర్ల నుంచి విశేష స్పందన లభించడంతో కేంద్రం మరో విడత సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌ను జారీచేసేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తున్నట్లు మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. ఈ ఇష్యూ జనవరి 30న యాంకర్‌ ఇన్వెస్టర్లకు, 31న రిటైల్‌, సంస్థాగత ఇన్వెస్టర్లు బిడ్లు ధాఖలు చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ్ల అధిక స్పందన లభిస్తే ఈ మొత్తాన్ని మరింత పెంచేందుకు (గ్రీన్‌ షూ ఆప్షన్‌) కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌లో 11 ప్రభుత్వ రంగ సంస్థలు - ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, కోల్‌ ఇండియా, ఐఓసీ, రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, ఆయిల్‌ ఇండియా, ఎన్‌బీసీసీ, ఎన్‌ఎల్‌సీ ఇండియా, ఎస్‌జేవీఎన్‌లు ఉన్నాయి. రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ ప్రభుత్వం తరపున సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌ను నిర్వహిస్తోంది. 



You may be interested

సమ్మెతో బ్యాంకు కార్యకలాపాలకు ఆటకం:ఎస్‌బీఐ

Friday 24th January 2020

న్యూఢిల్లీ: జనవరి 31 నుంచి రెండు రోజుల పాటు జరిగే బ్యాంకుల సమ్మెతో బ్యాంకు కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది. వేతన సవరణ చర్చలు సఫలం కాని పక్షంలో  యూనైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌(యూఎఫ్‌బీయూ) జనవరి 31 నుంచి ఫిబ్రవరి 1వరకు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. రెండు రోజులపాటు దేశవాప్తంగా బ్యాంక్‌ యూనియన్‌లు చేపడుతున్న ఈ సమ్మెతో

ఎస్‌పీ అపారెల్స్‌, కేఈఐ.. జూమ్‌

Friday 24th January 2020

వరుసగా రెండో రోజు సానుకూలంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా కదులుతున్నాయి. మధ్యాహ్నం 1 ప్రాంతం‍లో సెన్సెక్స్‌ 141 పాయింట్లు పెరిగి 41,528ను తాకగా.. నిఫ్టీ 51 పాయింట్ల లాభంతో 12,231 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో రిటైల్‌ విభాగాన్ని విక్రయించే ప్రణాళికలు ప్రకటించడంతో ఎస్‌పీ అపారెల్స్‌ కౌంటర్‌ జోరందుకోగా.. నిధుల సమీకరణ వివరాలు వెల్లడించడంతో కేఈఐ ఇండస్ట్రీస్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ

Most from this category