News


బడ్జెట్‌లో పెద్ద సంస్కరణలు లేకపోవచ్చు

Thursday 27th June 2019
Markets_main1561627247.png-26626

  • సంస్కరణల కొనసాగింపుల వైపు మొగ్గు చూపే అవకాశం

పార్లమెంటులో ప్రధాని చేసిన ప్రసంగాన్ని గమనిస్తే బీజేపీ1 చేపట్టిన చర్చల్ని కొనసాగించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలుస్తోందని, నీతీ ఆయోగ్‌ కూడా దీనినే ప్రతిబింబించిందని మార్కెట్‌ నిపుణులు సమీర్‌ నారయణ్‌ ఒక ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యమైన అంశాలు ఆయన మాటల్లోనే....

చిన్న సమస్యల దిద్దుబటుకే మొగ్గు?
బడ్జెట్‌ ఇంకో వారంలో రానుంది. కానీ బడ్జెట్‌పై ఎటువంటి అంచనాలు కానీ హైప్‌ కానీ లేకపోవడానికి ప్రధాన కారణం బిగ్‌బాంగ్‌ సంస్కరణలు ఉండవని నమ్మడమే. ఎందుకంటే ఇప్పటికే మార్కెట్‌ 11,800-11,900 స్థాయిలో ఉంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నెలలో మార్కెట్‌ ప్లాట్‌గానే కొనసాగింది. 11,600 స్థాయిలో దిద్దుబాటుకు గురైనా అది తక్కువ కాలమే. మార్కెట్‌లో పెద్ద మార్పు కోసం మేం ఎదురుచూస్తున్నాము. ఒక పెద్ద​ మార్పు తీసుకొచ్చేలా ప్రభుత్వం పాలసీలను తీసుకురావాలి. ప్రజలు కోరుకునేది కూడా అదే. ఎందుకంటే వృద్ధి బలంగా ప్రారంభమయ్యే సమయం ఇదే. వచ్చే వారంలో జూన్‌ త్రైమాసికం ముగింపును, ఆటో రంగం విడుదల చేయనున్న సంఖ్యలను, రుతుపవనాల పెరుగుదలను చూడనున్నాం. అందువలనే మార్కెట్లు  ఇటువంటి మార్పులను  కోరుకుంటాయి. సంపాదనలు పెరుగుతాయా లేదా అనేది మార్కెట్లు వీటిని ఆధారంగానే నిర్ణయిస్తాయి. ఇవి ముందుకు వెళ్లడానికి కావలసిన కారకాలు. 
       కానీ ఆర్థిక ఒత్తిళ్లను తగ్గించుకోడానికి ప్రభుత్వం పెద్ద పెద్ద సంస్కరణల వైపు కాకుండా చిన్న విషయాలను పరిగణలోకి తీసుకోవచ్చు. కొన్ని చిన్న విషయాలను గుర్తిస్తే ఇది మనకి అర్ధమవుతుంది. ఒక పెద్ద మార్గంలో వెళ్లడానికి ఇవి ఉపయోగపడతాయి. పన్నుల సేకరణలో కొంత​సమస్య ఉందనేది వాస్తవం.  కానీ డిమాండ్‌లో వృద్ధి లేదనుకుంటే సమ్మతి స్థాయిలపై దృష్ఠి పెట్టడం అవసరం. ఆ సమయానికి ఏదైనా మార్చగలిగేట్టు ఉంటే వాటిని వేంటనే మార్చగలిగితే అది ఆర్థిక వ్యవస్థకు మంచిది. ఇవి వచ్చే ఐదేళ్లకు ఒక మార్గ సూచీగా పనిచేయగలవు.

బీజేపీ1 సంస్కరణల కొనసాగింపు ఖాయం..
పార్లమెంట్‌లో ప్రధాని ఉపన్యాసంలో గమనిస్తే మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అదేంటంటే గత ప్రభుత్వంలో మొదలుపెట్టిన  అభివృద్ధి చర్యల్ని కొనసాగించాలని. నీతి అయోగ్‌ సమావేశం కూడా దీనినే ప్రతిబింబించింది.  ఈ బడ్జెట్‌లో పెద్ద పెద్ద  సంస్కరణలు లేకపోయినప్పటికి చిన్న దిద్దుబాటు చర్యలుండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇవే కాకుండా రుతుపవనాలు మార్కెట్‌ సెంటిమెంట్‌పై ప్రభావం చూపునున్నాయి. ఎందుకంటే  ఇప్పటికి భారతదేశంలో వ్యవసాయ రంగంలో పనిచేసే వారు చాలా ఎక్కువ. అందువలనే ఇది అధికంగా మార్కెట్‌ సెంటిమెంట్‌ను ప్రభావితం చేయగలదు.

వినియోగం ఆధారంగా ఉత్పత్తి..
కేప్‌ కాఫీ డే లేదా టాటా గ్లోబల్‌ ఏదైనా కావచ్చు సంపాదన ఎక్కడ ఉంటుందో అక్కడ వినియోగం పెరుగుతుంది. దీనికి ఒక మంచి ఉదహారణగా టాటాల ట్రెంట్‌  కంపెనీని తీసుకోవచ్చు. దీనిపై ప్రమోటర్ల విశ్వాసం పెరిగింది. పెట్టుబడులు పెరిగాయి. ఇప్పుడది బాగా నడుస్తున్నా వ్యాపారం. సమస్య ఎక్కడుందంటే ఈరోజు  మనం దీనిని వివిధ రకాల పరిస్థితులకు అనుగుణంగా చూడాలేక పోవడమే. వాళ్లు జరాతో కలిసి ఇండియాలో వ్యాపారం చేస్తున్నారు. వెస్ట్‌సైడ్‌ శాఖలో ట్రెంట్‌ స్టోర్‌కు 9 శాతం వృద్ధి కూడా ఉంది. వాళ్లు బాగానే నడుపుతున్నారు. ఇండియా మార్కెట్‌ వలన రాణించే అవకాశం ఉంది. కానీ అది ధరను అనుసరించి ఉంటుంది. కాఫీని రూ.250 పెట్టి కొనేవాళ్లు ఎక్కువ మంది ఉంటారా? ఏమో నాకు తెలియదు. కానీ చిన్న పట్టణాలలో రూ.1000 కే సినిమా స్టార్‌లలా దుస్తులను కొరుకునే వారు ఎక్కువగా ఉంటారు. నువ్వు ఎ‍క్కడ అమ్మాలనుకుంటున్నావో దానికి తగ్గట్టు ఉత్పత్తిని తయారు చేసుకోవాలి.

ప్రమోటర్ల జాగ్రత్త.. 
అడాగ్‌ గ్రూప్‌, జీ షేరుహోల్డర్లు ఇప్పుడు మార్కెట్‌ సమతూల్యత చట్ట తీవ్రతను ఎదుర్కొంటున్నారు. వాళ్ల  ఎంటర్‌ప్రెన్యూర్‌షీప్‌కి విలువ ఇస్తాను. కానీ వాళ్ల దగ్గర కొంత మూలధనం ఉన్నప్పుడు విస్తరణలో జాగ్రత్తగా అడుగులు వేయవలసింది. అలా చేసుంటే కొంత కాలానికి ఖర్చులను మించి లాభాలను సాధించేవారు. ఈ థీసిస్‌ అన్ని సార్లు బాగా పనిచేయకపోవచ్చు. నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ​బయటికి వచ్చి ఇది తప్పు అని చెప్పగలిగే సామర్ధ్యం ప్రమోటర్లు కలిగి ఉండాలి. దురదృష్ఠవ శాత్తు ఈ కంపెనీలలో ఎవరు అలా చెప్పలేకపోవడంతో మార్కెట్‌ దిద్దుబాటు జరిగి ఇన్వెస్టర్ల సంపద అవిరయ్యింది.

ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌..ఎస్‌బీఐ
ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ బాగానే ప్రదర్శన చేస్తుంది. ఎస్‌బీఐ కూడా ఇండస్‌ బ్యాంక్‌ కన్నా గొప్పగా  పెరగలేదు. కానీ ఇండస్‌ ఇండ్‌ కన్నా ఎస్‌బీఐ వైపు మదుపర్లు ఆసక్తి చూపడానికి ఒక కారణం ఉంది. మార్కెట్‌లు బాగా ప్రదర్శన చేసిన షేర్ల కంటే బాగా మెరుగు పడుతున్న కంపెనీలకే ఎక్కువ ప్రాదాన్యతనిస్తాయి. ఇండ్‌స్‌ ఇండ్‌ బ్యాంక్‌ బాగా ప్రదర్శననిస్తుంది. కానీ గత రెండెళ్లు చూసుకుంటే ఎస్‌బీఐ రుణ పుస్తకపు వృద్ధి యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ల కంటే  మెరుగ్గా ఉంది. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ రుణ సామర్ధ్యం గత రెండు ఏళ్ల నుంచి పెరుగుతోంది. కానీ అప్పటికన్నా ఇప్పుడు ప్రమాదం అధికంగా ఉందనేది కూడా గమనించాలి. ఈ రెండు బ్యాంకులలో..ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌కు ఒక రకమైన నాణ్యత కలిగి ఉంది. కానీ ఎస్‌బీఐ పరిమాణంలో పెద్దది కావడం వలన లాభపడుతున్నప్పటికి  అతిపెద్ద రుణ బ్యాంకుగా ఒత్తిళ్లను కూడా ఎదుర్కొంటుంది. అయితే గత రెండేళ్ల నుంచి తన పరిస్థితులను మార్చుకొని ప్రయాణిస్తోంది. మార్కెట్‌ పరంగా అయితే మెరుగుదల చూపించిన కంపెనీలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. 

ఎఫ్‌ఎంసీజీ ఖరిదైనా ఓకే.. 
ఎఫ్‌ఎంసీజీ సా​‍్టక్‌లు అందరికి అందుబాటు ధరలలో  లభించలేక పోవచ్చు కానీ ఈ రంగంలో వృద్ధి ఉంది. ఇందులో ఉన్న సమస్య ఏంటంటే ఇంకేక్కడైనా వృద్ది కనిపిస్తే ఈ రోజు నేను చెల్లించాలనుకునే నగదు కంటే  ఖరీదు పెరిగిపోతుంది. నగదు ‍ప్రవాహం అలానే జరుగుతోంది. టాటా సన్స్‌ నిర్వాహకులు వినియోగ ఆధారిత వ్యాపారాన్ని ఒక అవకాశంగా చూస్తున్నారు. టాటాగ్లోబల్‌లో పెట్టుబడులు పెట్టడం వలను ఆ కంపెనీకి మంచిదే. కానీ ముందు వరుసలో ఉన్న కంపెనీలు కొత్త రంగాల వైపు అడుగులు వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండి తమ వ్యూహాలను అమలు చేసుకోవాలి. ఈ రంగంలో పెట్టుబడులు మంచి లాభాలను  ఇస్తాయి. ఇప్పుడు మార్జిన్‌లు లేకపోయినా మంచి ధర వచ్చేంత వరకు వేచి ఉండడం మంచిది. 

 You may be interested

2022 నాటికి 50వేలకు సెన్సెక్స్‌!

Thursday 27th June 2019

కోటక్‌ సెక్యూరిటీస్‌ అంచనా మోదీ ప్రభుత్వ పాలన మూడో ఏడుకు చేరేనాటికి సెన్సెక్స్‌ 50వేల పాయింట్లను చేరవచ్చని కోటక్‌ సెక్యూరిటీస్‌ నిపుణుడు రస్మిక్‌ ఓజా అంచనా వేశారు. బడ్జెట్‌ వరకు నిఫ్టీ అటుఇటు ఊగిసలాడుతూనే ఉంటుందన్నారు. ఒకవేళ నిఫ్టీ 12వేల పాయింట్లను చేరితే వాల్యూషన్ల పరంగా మరోమారు గత గరిష్ఠాలకు చేరువైనట్లవుతుందన్నారు. జూలై సీరిస్‌కు నిఫ్టీ పుట్స్‌ కొనుగోలు చేయడం ద్వారా పోర్టుఫోలియోలో లాంగ్స్‌ను హెడ్జ్‌ చేసుకోవచ్చని, బడ్జెట్లో అనూహ్య ప్రతిపాదనల

మార్కెట్లో లాభాలు మాయం

Thursday 27th June 2019

మార్కెట్‌ ప్రారంభం నుంచి లాభాల్లో ట్రేడైన సూచీలు మిడ్‌సెషన్‌లో ఒక్కసారిగా నష్లాల్లోకి మళ్లాయి. ఐటీ, మెటల్‌, ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లలో అకస్మత్తుగా లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో సూచీలు ఇంట్రాడేలో ఆర్జించిన లాభాల్ని హరించుకుపోయాయి. సెనెక్స్‌ ఇంట్రాడే గరిష్టం(39,817) నుంచి 268 పాయింట్లను కోల్పోయి 39,549 వద్ద, నిఫ్టీ డే హై( 11,911.15) నుంచి 81 పాయింట్లు నష్టపోయి 11,830 వద్ద కనిష్టాలను నమోదు చేశాయి. నేడు జూన్‌ ఎఫ్‌అండ్‌ఓ ఫ్యూచర్‌ కాంట్రాక్టు

Most from this category