News


రిస్కీ పెట్టుబడులకు ఇదే సరైన సమయం!

Tuesday 15th October 2019
Markets_main1571119861.png-28892

కొంత ఆలస్యమైనా బుల్‌రన్‌ తప్పదు
ప్రముఖ ఇన్వెస్టర్‌ మధు కేలా
దలాల్‌ స్ట్రీట్‌లో బుల్‌మార్కెట్‌ మరలా ఆరంభమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయని ప్రముఖ అనలిస్టు మధు కేలా చెబుతున్నారు. అయితే పూర్తిస్థాయి బుల్‌దశకు కొంత సమయం పడుతుందని, కానీ రాబోయే బుల్‌మార్కెట్లో లాభార్జన చేయాలంటే పెట్టుబడులకు ఇప్పుడే మంచి తరుణమని సూచిస్తున్నారు. గత తొమ్మిది నెలలుగా తాను కూడా రక్షణాత్మకంగానే వ్యవహరిస్తున్నానన్నారు. ప్రస్తుతం ఎంపిక చేసిన స్టాకుల్లో ఎంటర్‌ కావచ్చని, ధైర్యే సాహసే లక్ష్మి సూత్రం ఇప్పుడు గుర్తు చేసుకోవాలని సలహా ఇచ్చారు. ఇటీవల కాలంలో రుణాల వ్యవహారాలు బయటపడడంతో పలు చిన్న కంపెనీల సంపద సర్వనాశనం అయిందని, ఇలాంటి సంపద విధ్వంసం చాలా అనూహ్యమైనదని అభిప్రాయపడ్డారు. చాలా నాణ్యమైన చిన్న కంపెనీలు సైతం సంపద కోతకు గురయ్యాయన్నారు. అలాంటి నాణ్యమైన స్మాల్‌క్యాప్స్‌ను ఎంచుకొని ఇప్పుడు పెట్టుబడులు పెట్టాలని సూచించారు. రాబోయే ఐదేళ్లలో ఇలాంటి చిన్న స్టాకులు అత్యుత్తమ ప్రదర్శన చూపుతాయన్నారు. అందువల్ల వచ్చే 3-4 నెలల సమయాన్ని పెట్టుబడులకోసం ఉపయోగించాలన్నారు. 
ప్రధాన సూచీల్లో స్టాకుల కన్నా చిన్నస్టాకుల్లో మంచి పెట్టుబడి అవకాశాలున్నాయని మధు చెప్పారు. గత రెండేళ్లలో తాను కూడా కొన్ని తప్పులు చేసానని, అవన్నీ ఇప్పుడు పునర్విమర్శించుకొన్నానని తెలిపారు. సరైన పెట్టుబడి ఎంపికలు చేసుకోకపోవడంతో గత రెండేళ్లలో సంపద నష్టం వాటిల్లిందని విశ్లేషించారు. అయితే కొన్ని స్టాకులు మాత్రం ఈ సమయంలోనే తనకు మంచి లాభాలనిచ్చాయని గుర్తు చేశారు. ఇలాంటి వాటిలో సిటీ యూనియన్‌ బ్యాంక్‌, వీఎస్‌టీ, మహీంద్రా లైఫ్‌ సైన్సెస్‌, కెన్‌ఫిన్‌ హోమ్స్‌ తదితరాలున్నాయి. గత రెండేళ్లలో ప్రధాన సూచీల కన్నా చిన్న, మిడ్‌క్యాప్‌ సూచీలు ఎక్కువ నష్టపోయాయి. రెండేళ్లలో స్మాల్‌క్యాప్‌ సూచీ 25 శాతం, మిడ్‌క్యాప్‌ సూచీ 14 శాతం నష్టాలన చూశాయి. 

 



You may be interested

లాభాల్లో ఆటో షేర్లు..ఐషర్‌మోటర్స్‌ 4% అప్‌

Tuesday 15th October 2019

దేశీయ ఈక్విటీ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్‌లో పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ ఉదయం 11.52 సమయానికి 1.98 శాతం లాభపడి 7,669.35 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హెవివెయిట్‌ షేర్లయిన  మారుతి సుజుకీ 2.60 శాతం లాభపడి రూ. 6,998.25 వద్ద, హీరో మోటర్‌ కార్ప్‌ 3.14 శాతం లాభపడి రూ. 2,691.00 వద్ద,  ఐషర్‌ మోటర్స్‌ 4.40     శాతం లాభపడి రూ. 19,135.10 వద్ద

ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ 7% క్రాష్‌

Tuesday 15th October 2019

 ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, షేర్ల బై బ్యాక్‌ చేయాలని ఆలోచిస్తున్నప్పటికి ఈ కంపెనీ షేరు మాత్రం గత కొన్ని సెషన్‌ల నుంచి నష్టాల్లో ట్రేడవుతోంది. అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ సంస్థ మూడీస్‌ ఈ కంపెనీ రేటింగ్‌ను బీఏ2 నుంచి బీ2 తగ్గించి, ఈ కంపెనీపై ప్రతికూల దృక్ఫథాన్ని కలిగి ఉండడంతో ఈ కంపెనీ షేరు గత సెషన్‌లో(అక్టోబర్‌ 14) 6 శాతానికి పైగా నష్టపోయింది. కాగా మంగళవారం సెషన్‌

Most from this category