News


మిడ్‌క్యాప్‌ వైపు చూడ్డానికి మంచి టైమ్‌

Friday 12th July 2019
Markets_main1562870010.png-26994

మార్కెట్‌ బ్రెడ్త్‌ (పెరిగిన, నష్టపోయిన స్టాకుల మధ్య నిష్పత్తి) చాలా తగ్గిపోయిందని, ఈ స్థాయి నుంచి మార్కెట్లో బ్రోడ్‌ బేస్డ్‌ (అన్ని విభాగాల షేర్ల ర్యాలీ) రికవరీ జరగాలంటే తాజా ట్రిగ్గర్లు అవసరమన్నారు చార్ట్‌ అడ్వైజ్‌ సంస్థ శిక్షణ విభాగం హెడ్‌ రాజా వెంకట్రామన్‌. నిఫ్టీ-50లో 15 స్టాక్స్‌ ఈ ఏడాది 30 శాతం రాబడులను ఇవ్వగా, అదే సమయంలో మిగిలిన 35 స్టాక్స్‌ 11 శాతం నష్టపోయినట్టు చెప్పారు. టాప్‌ 15 స్టాక్స్‌ వాటి చారిత్రక వ్యాల్యూషన్ల కంటే అధిక స్థాయిల్లో ట్రేడవుతుండగా, మిగిలిన 35 ‍స్టాక్స్‌ చారిత్రక సగటు వ్యాల్యూషన్లకు ఎంతో తక్కువకు ట్రేడవుతున్నట్టు ఆయన వివరించారు. 

 

మిడ్‌క్యాప్‌ మంచి పనితీరు
మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నా కానీ, ఎన్నికల అనిశ్చితి తొలగిపోవడంతో కొంత ఉపశమనం లభించినట్టు వెంకట్రామన్‌ చెప్పారు. నిఫ్టీ-50తో పోలిస్తే నిఫ్టీ మిడ్‌క్యాప్‌ సూచీ డిస్కౌంట్‌లో ట్రేడవుతున్నట్టు తెలిపారు. గరిష్ట స్థాయిల నుంచి చూసుకుంటే నిఫ్టీ మిడ్‌క్యాప్‌ సూచీ 25 శాతానికి పైగా దిద్దుబాటుకు గురైనట్టు చెప్పారు. ఫిబోనాసి కన్‌ఫ్లూయెన్స్‌ జోన్‌ అయిన 4484-4534 వద్ద సూచీ పతనం ఆగిపోయినట్టు తెలిపారు. గతేడాది అక్టోబర్‌లో ఈ స్థాయికి వెళ్లిన తర్వాత నుంచి మరోసారి ఇది కోల్పోవడం జరగలేదన్నారు. సాంకేతిక అంశాల ప్రకారం చూస్తే మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ బలమైన అప్‌ట్రెండ్‌లో ఉన్నట్టు తెలుస్తోందన్నారు. నెలవారీ చార్ట్‌ల్లో ఆర్‌ఎస్‌ఐ ఇప్పటికీ బుల్‌జోన్‌లోనే ఉందని తెలిపారు. అయితే, వీక్లీ చార్ట్‌లో ఆర్‌ఐఎస్‌ బేర్‌ జోన్‌లోకి వెళ్లిందన్నారు. వీక్లీ చార్ట్‌లో బుల్‌జోన్‌ 40పైన ఆర్‌ఎస్‌ఐ సపోర్ట్‌ తీసుకుందని, ఇది బలాన్ని సూచిస్తోందన్నారు. ‘‘65పైకి వెళితే ఇది ధ్రువీకరణ అవుతుంది. కనుక 50 శాతం వరకు పడిపోయి, రివర్సల్‌ సంకేతాలు ఇచ్చే మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ కొనుగోలుకు ఇది మంచి అవకాశం. మిడ్‌క్యాప్‌ సూచీ ఇంకా రికవరీ అవ్వాల్సి ఉంది. అయితే, ప్రతికూల పనితీరులో ఉండడం, వ్యాల్యూషన్‌ పరంగా చౌకగా ఉండడంతో ఇన్వెస్టర్లు బోటమ్‌ అప్‌ విధానాన్ని అనుసరించొచ్చు. ఎర్నింగ్స్‌ అవకాశాలు మంచిగా ఉండి, పెరిగేందుకు అవకాశాలు ఉన్న వాటిని ఎంచుకోవచ్చు’’అని వెంకట్రామన్‌ సూచించారు. You may be interested

ఆస్తులు అమ్ము... అప్పులు తీర్చు..!

Friday 12th July 2019

పారిశ్రామిక వేత్త అనిల్‌ అంబానీ చేస్తున్నది ఇదే ప్రస్తుతం. రుణాలు తీసుకుని వ్యాపారాలు మొదలు పెట్టారు. ఆ రుణాలను తీర్చలేక అవే వ్యాపారాలను ఒక దాని తర్వాత ఒకటి వరుసపెట్టి అమ్ముతున్నారు. పరిస్థితులు తల్లక్రిందులు అయితే ఇంతే ఉంటుంది. రోడ్డు ప్రాజెక్టుల నుంచి ఎఫ్‌ఎం రేడియో​ వ్యాపారం వరకు పలు ఆ‍స్తులు అమ్మి రూ.21,700 కోట్లు (3.2 బిలియన్‌ డాలర్లు) సమీకరించి, అప్పులు తీర్చాలన్నది అనిల్‌ అంబానీ ప్రయత్నం.    అనిల్‌ అంబానీకి

నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్‌

Thursday 11th July 2019

226 పాయింట్లు పెరిగి సెన్సెక్స్‌  రాణించిన అటో, మెటల్‌, ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు  వరుస 4రోజుల మార్కెట్‌ నష్టాలకు గురువారం బ్రేక్‌ పడింది. సెన్సెక్స్‌ 266 పాయింట్లు లాభంతో 38,823.11 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 84.00 పాయింట్లు ర్యాలీ చేసి 11,582.90 వద్ద ముగిసింది. మార్కెట్‌ 4రోజుల భారీ పతనం నేపథ్యంలో నేడు ట్రేడర్లు షార్ట్‌ కవరింగ్‌కు పూనుకోవడంతో పాటు ఫెడ్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ కీలక వడ్డీరేట్ల తగ్గింపు సంకేతాలనివ్వడం, ఫారెక్స్‌ మార్కెట్లో

Most from this category