News


కొత్త సంవత్సరంలో శుభారంభం

Tuesday 1st January 2019
Markets_main1546314712.png-23338

సెన్సెక్స్‌ 93 పాయింట్లు, నిఫ్టీ 19 పాయింట్లు అప్‌

కొత్త సంవత్సరం తొలి ట్రేడింగ్‌ రోజైన మంగళవారం మార్కెట్‌ శుభారంభాన్నిచ్చింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 93 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 36,162 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, నిఫ్టీ 19 పాయింట్ల పెరుగుదలతో 10,882 పాయింట్ల వద్ద మొదలయ్యింది. గత రాత్రి అమెరికా స్టాక్‌ సూచీలు 0.5 శాతం పైగా పెరగడంతో పాటు ఆటోమొబైల్‌ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో భారత్‌ మార్కెట్లు పాజిటివ్‌గా మొదలయ్యాయి. భారతి ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఆటో, యాక్సిస్‌ బ్యాంక్‌, సిప్లా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌లు 1 శాతం వరకూ లాభంతో ప్రారంభమయ్యాయి. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌, పవర్‌గ్రిడ్‌, టెక్‌ మహింద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌లు 1 శాతం వరకూ నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. న్యూఇయర్‌ డే సందర్భంగా ప్రధాన ఆసియా మార్కెట్లన్నింటికీ మంగళవారం సెలవు. 



You may be interested

మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 1st January 2019

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు హెచ్‌డీఎఫ్‌సీ:- గృహ రుణాలకు వర్తించే రిటైల్‌ ప్రైమ్‌ లెండింగ్‌ రేటును బ్యాంక్‌ 10 బేసిస్‌ పాయింట్లు పెంచింది. ఐఎల్‌&ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ నెట్‌వర్క్స్‌:- ద్రవ్య కొరతతో డిసెంబర్‌ 31న డిబెంచర్‌ హోల్డర్లకు ఎన్‌సీడీలపై వడ్డీని చెల్లించడంలో విఫలమైంది. జిందాల్‌ స్టీల్‌ & పవర్‌:- ప్రస్తుతం కంపెనీ సీఈవో పదవీబాధ్యతలు నిర్వర్తిసున్న నౌషాద్ అక్తర్ అన్సారీ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు. అవాస్‌ ఫైనాన్షియర్:- ఐదేళ్లపాటు కంపెనీ సీఈవోగా

2019లో ఏ రంగాలు ర్యాలీ చేయవచ్చు..?

Monday 31st December 2018

దేశీయ స్టాక్‌ మార్కెట్లు 2018లో ఆటుపోట్లతో కొనసాగాయి. చివరి సెషన్‌ కూడా ఒడిదుడుకుల మయంగానే సాగింది. మొత్తం మీద 2018లో నిఫ్టీ కేవలం 3.15 శాతం రాబడులను ఇచ్చింది. మరి 2019 ఎలా ఉండబోతుంది...? ఏ రంగాలు ర్యాలీ చేయనున్నాయనే అంశాలను జెమ్‌స్టోన్‌ ఈక్విటీ రీసెర్చ్‌, అడ్వైజరీ సర్వీసెస్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ మిలాన్‌ వైష్ణవ్‌ తెలియజేశారు.   18 రంగాల్లో 13 రంగాలు నష్టాలనే మిగిల్చాయి. రియాలిటీ, మీడియా, ఆటో సూచీలు వరుసగా

Most from this category