News


మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌లో మంచి అవకాశాలు

Monday 1st July 2019
Markets_main1561959607.png-26708

ఎన్‌డీఏకు స్పష్టమైన విజయాన్ని ఇవ్వడంతో ఈక్విటీ మార్కెట్లలో సానుకూల సెంటిమెంట్‌ నెలకొంది. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ విబాగంలో పెట్టుబడులకు ఇది మంచి అనుకూల సమయం. వృద్ధిని పునరుద్ధరించేందుకు నూతన ప్రభుత్వం బలమైన విధానపర చర్యల్ని చేపట్టే అవకాశం ఉంది. మిడ్‌, స్మాల్‌క్యాప్‌ రెండు రకాల పరిస్థితుల్లో మంచి పనితీరు చూపిస్తాయి. మార్కెట్లు రిస్కీగా ఉన్నా,  ఒక్కో సందర్భంలో ఇవి మంచి ప్రదర్శన చూపుతాయి. సెన్సెక్స్‌తో పోలిస్తే వ్యాల్యూషన్లు సౌకర్యంగా ఉన్నప్పుడు కూడా ఇది జరుగుతుంది. సెన్సెక్స్‌తో పోలిస్తే మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 12 శాతం ప్రీమియంతోనూ గతంలో ట్రేడయింది. ఇప్పుడు మిడ్‌క్యాప్‌ సూచీ తక్కువలో ఉందంటే, భవిష్యత్తులో వేగవంతమైన పనితీరు చూపించే అవకాశం ఉంటుందని అర్థం. రిస్కీ స్థాయికి వెళ్లిన తర్వాత మిడ్‌క్యాప్స్‌, స్మాల్‌క్యాప్స్‌లో దిద్దుబాటు జరగడం వల్లే ప్రస్తుతం తక్కువ వ్యాల్యూషన్లకు వచ్చాయి. ప్రస్తుతం మిడ్‌క్యాప్‌ సూచీ సెన్సెక్స్‌ కంటే 10 శాతం డిస్కౌంట్‌లో ఉంది. ఎన్నికల ఫలితాలు మార్కెట్లలో రిస్క్‌ను పెంచాయి. మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ తక్కువ విలువల వద్ద ట్రేడవుతున్నాయి. ఈ తరహా పరిస్థితులు... దిద్దుబాటుకు గురైన మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ ర్యాలీ చేస్తాయని సూచిస్తున్నాయి. వచ్చే 12 నెలల్లో మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ మంచి పనితీరు చూపిస్తాయని మేం భావిస్తున్నాం. 

మిడ్‌క్యాప్‌ ఈక్విటీ ఫండ్స్‌ పథకాలు ప్రధానంగా మిడ్‌క్యాప్‌ కంపెనీల షేర్లలో ఇన్వెస్ట్‌ చేస్తాయి. సెబీ నిర్వచనం ప్రకారం... మార్కెట్‌ విలువ పరంగా 101 నుంచి 250 వరకు స్థానాల్లో ఉన్నవి మిడ్‌క్యాప్‌. మిడ్‌క్యాప్‌ పథకాలు వాటి పోర్ట్‌ఫోలియోలో కనీసం 65 శాతాన్ని మిడ్‌క్యాప్‌ కంపెనీల్లోనే ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. రూ.8,500 కోట్లకుపైగా మార్కెట్‌ క్యాప్‌ కలిగిన కంపెనీలు 150 వరకు ఉన్నాయి. మరో 35 శాతాన్ని మిడ్‌క్యాప్‌, లార్జ్‌క్యాప్‌ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసే సౌకర్యాన్ని ఈ పథకాలు కలిగి ఉంటాయి. హెచ్‌డీఎఫ్‌సీ మిడ్‌క్యాప్‌ ఫండ్‌ మిడ్‌క్యాప్‌ విభాగంలో మంచి పనితీరు కలిగిన పథకం. 12 ఏళ్ల బలమైన ట్రాక్‌ రికార్డు కలిగి ఉంది. దీర్ఘకాలంలో సంపద సృష్టించాలన్న లక్ష్యాన్ని ఈ పథకం రుజువు చేసి చూపించింది. ఈ పథకం ప్రారంభమైన నాటి నుంచి వార్షికంగా 15 శాతం రాబడులను ఇచ్చింది. కానీ, ఇదే కాలంలో నిఫ్టీ మిడ్‌క్యాప్‌- 100 సూచి రాబడులు 11 శాతంగానే ఉన్నాయి. మధ్య కాలం నుంచి దీర్ఘకాలంలో ఈ పథకం గొప్ప పనితీరుతో ముందున్నది. ఈ పథకం ఆరంభమైన నాటి నుంచి ప్రతీ నెలా రూ.10,000 సిప్‌ చేస్తూ వస్తే ఇప్పటికి రూ.14.40 లక్షల పెట్టుబడి రూ.45.42 లక్షలుగా వృద్ది చెందేది. తగినంత వృద్ధి అవకాశాలు, బలమైన ఆర్థిక సామర్థ్యం (రిటర్న్‌ రేషియో, క్యాష్‌ఫ్లో), స్థిరమైన, అర్థం చేసుకోతగిన వ్యాపార నమూనాలు, ఆమోదనీయమైన వ్యాల్యూషన్‌ అంశాల ఆధారంగా స్టాక్స్‌ ఎంపిక  చేసుకుంటుంది. 

బలమైన పనితీరు చరిత్ర, తగినంత వైవిధ్యం, అనుభవంతో కూడిన నిర్వహణ బృందంతో కూడిన హెచ్‌డీఎఫ్‌సీ మిడ్‌క్యాప్‌ అపార్చునిటీస్‌ ఫండ్‌, మిడ్‌క్యాప్‌ విభాగంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి మంచి ఆప్షన్‌ అవుతుంది. ఇన్వెస్టర్లు తమ ఆర్థిక లక్ష్యాల సాధన కోసం ఈ పథకంలో ఇన్వెస్ట్‌మెంట్‌కు సిప్‌ మార్గాన్ని ఎంచుకోవచ్చు. అధిక రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్లకు మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌ సూచించడం జరుగుతుంది. కనుక అధిక రిస్క్‌ తీసుకుని, అధిక రాబడులు కోరుకునే వారు ఈ తరహా పథకాల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు.

  • డి.జయంత్‌కుమార్‌
  • నేషనల్‌ హెడ్‌ కార్వీ థర్డ్‌ పార్టీ ప్రొడక్ట్స్‌



You may be interested

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ బ్యాలన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌

Monday 1st July 2019

రిస్క్‌ తగ్గిస్తూ.. డైనమిక్‌ రాబడులు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ బ్యాలన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ బ్యాలన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ విభాగంలోని మ్యూచువల్‌ ఫండ్స్‌ (వీటినే డైనమిక్‌ అసెట్‌ అలోకేషన్‌ ఫండ్స్‌ అని కూడా అంటారు) ఈక్విటీలో, మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా డైనమిక్‌గా ఇన్వెస్ట్‌ చేస్తూ రాబడులను ఇచ్చే విధానంలో పనిచేస్తుంటాయి. ఈక్విటీ మార్కెట్లు తక్కువ వ్యాల్యూషన్లకు చేరినప్పుడు అందులో పెట్టుబడులు పెంచుకోవడం, మార్కెట్లు అధిక వ్యాల్యూషన్లకు చేరినప్పుడు ఎక్స్‌పోజర్‌ తగ్గించుకోవడం అనే రిస్క్‌ బ్యాలన్స్‌డ్‌ విధానాన్ని అనుసరిస్తుంటాయి. ప్రస్తుతం

క్రెడిట్‌ కార్డు రద్దు చేస్తున్నారా?

Monday 1st July 2019

రద్దు పక్కాగా జరగాలి బకాయిలన్నీ తీర్చిన తర్వాత రద్దుకు దరఖాస్తు తీర్చలేకపోతే వేరే కార్డుకు బదలాయింపు వ్యక్తిగత రుణం తీసుకుని అయినా చెల్లింపు రద్దు చేసుకుంటే క్రెడిట్‌ రేషియో పెరగొచ్చు ఇది క్రెడిట్‌ స్కోరుపై ప్రభావం చూపించే అవకాశం లాభ, నష్టాలన్నీ తెలుసుకున్న తర్వాతే నిర్ణయం క్రెడిట్‌ కార్డు స్వేచ్ఛగా ఖర్చు చేసేందుకు, రివార్డులు పొందేందుకు, మంచి క్రెడిట్‌ స్కోరు సాధించేందుకు, ఇతరత్రా ఎన్నో ప్రయోజనాలకు ఉపయోగపడే సాధనం. అందుకే వేతన జీవుల్లో ఎక్కువ మంది క్రెడిట్‌ కార్డుపై మక్కువ

Most from this category