News


రిలయన్స్‌ టార్గెట్‌ పెంచిన గోల్డ్‌మేన్‌ శాక్స్‌

Thursday 5th December 2019
Markets_main1575539817.png-30075

అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థ గోల్డ్‌మేన్‌ శాక్స్‌ దేశీయ ప్రైవేట్‌ రంగ దిగ్గజం రిలయన్స్‌ షేరు కొనుగోలు టార్గెట్‌ ధరను పెంచింది. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరపు ఆదాయాలను కూడా పెంచింది. ఇటీవల కాల్‌, డేటాలపై పెంచిన టారీఫ్‌లతో యావరేజ్‌ రెవెన్యూ ఫర్‌ యూజర్‌(ఏఆర్‌పీయూ) వృద్ది చెందే అవకాశం ఉంది. ఇతర నెట్‌వర్క్‌ల నుంచి సబ్‌స్క్రైబర్లు వలస రావడంతో పాటు జియో నెట్‌వర్క్‌కు ఉండే బలమైన సబ్‌స్ర్కిబ్షన్‌ కూడా మూమెంట్‌ను మరింత మెరుగుపరుస్తుంది. ఈ సానుకూలాంశాల కారణంగా వచ్చే మూడేళ్లలో ఆదాయాలు పెరగవచ్చనే అంచనాలతో పాటు ఏడాది కాలానికి షేరు టార్గెట్‌ ధరను రూ.1635 నుంచి రూ.1850లకు పెంచుతున్నాము అని​బ్రోకరేజ్‌ సంస్థ తన నివేదికలో తెలిపింది.

కన్జూమర్‌ వ్యాపారంలో అధిక వృద్ధి కొనసాగవచ్చనే అంచనాలతో వచ్చే మూడేళ్లతో సీఏజీఆర్‌ 50శాతం పెరగవచ్చు.  నగదు ప్రవాహంలో గణనీయమైన మెరుగుదల, ఆస్తి మోనటైజేషన్ తొలగించడానికి దారితీస్తుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2020లో 7శాతం, తదుపరి ఆర్థిక సంవత్సరంలో 2021లో 20శాతం ఈబిటా నమోదు కావచ్చనే బ్లూమ్‌బర్గ్‌ అంచనాలతో ఏకీభవిస్తున్నామని గోల్డ్‌మేన్‌శాక్స్‌ పేర్కోంది. 

టెలికాం రంగంలో తన ప్రత్యర్థి ఆపరేటర్లు ఇటీవల ప్రకటించిన సుంకం పెంపుతో రిలయన్స్ జియోకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది. ఈ మూడు టెలికం కంపెనీల్లో రిలయన్స్‌ జియో యావరేజ్‌ రెవెన్యూ ఫర్‌ యూజర్‌ ఆదాయాన్ని ఎక్కువగా రాబడుతుంది. అలాగే టెలికాం మార్కెట్లో తన వాటాను మరింత పెంచుకోవడంతో పాటు, ప్రస్తుతం 35శాతం వాటాను కలిగిన సబ్‌స్క్రిబ్షన్‌ వాటాను ఆర్థిక సంవత్సరం 2022 రెండో త్రైమాసికం కాలం నాటికి 45శాతానికి పెంచుకునే అవకాశం ఉందని బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది.


బ్రోకరేజ్‌ సంస్థ కొనుగోలు టార్గెట్‌ ధరను పెంచడంతో షేరు ఉదయం ట్రేడింగ్‌లో 1.75శాతం లాభపడి రూ.1579.85 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.3:15ని.లకు షేరు క్రితం ముగింపు(రూ.1552.55)తో పోలిస్తే పావుశాతం నష్టంతో రూ.1579.85 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

నాలుగేళ్లలో ఆర్‌ఐఎల్‌ డబుల్‌!

Thursday 5th December 2019

టీసీజీ ఏఎంసీ ఎండీ చక్రి లోక్‌ప్రియ అంచనా దేశీయ చమురు దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు వచ్చే నాలుగేళ్లలో రెట్టింపు కావచ్చని టీసీజీ ఏఎంసీ ఎండీ చక్రి లోక్‌ప్రియ్‌ అంచనా వేశారు. ప్రస్తుతం కంపెనీ అన్ని విభాగాలు జోరుమీదున్నాయన్నారు. జియో లాభాలు పెరుగుతాయని, రిటైల్‌ వ్యాపారం మరింత విస్తరిస్తుందని అందువల్ల రాబోయే మూడేళ్లలో షేరు 20-25 శాతం చక్రీయ వార్షిక వృద్ధి నమోదు చేయగలదని అభిప్రాయపడ్డారు. ఇంకా వివిధ అంశాలపై ఆయన

రేట్లు ఎందుకు తగ్గించలేదంటే...?

Thursday 5th December 2019

ఆహార ధరల పెరుగుదలపై ఆందోళనలే వడ్డీరేట్ల తగ్గింపునకు అడ్డం పడ్డాయని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ వివరించారు. ఆహార ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం పెరిగిందని, దీంతో రేట్ల తగ్గింపు యోచన విరమించామని తెలిపారు. రాబోయే త్రైమాసికంలో ఆహార ద్రవ్యోల్బణం మరింత ఎక్కువగా ఉంటుందని ఇటీవలి గణాంకాలు సూచించాయన్నారు. అయితే కోర్‌ ద్రవ్యోల్బణం మాత్రం తమ టార్గెట్‌ 4 శాతం లోపే ఉండొచ్చన్నారు. ఆహార పదార్ధాల ధరలు తగ్గడం అనేక అంశాలపై

Most from this category