News


అమెరికా మార్కెట్లకు జాబ్స్‌ డేటా జోష్‌..!

Saturday 5th October 2019
Markets_main1570257021.png-28734

ఆశాజనకంగా వెలువడిన సెప్టెంబర్‌ కార్మిక శాఖ​ గణాంకాలు ఆర్థిక మాంద్య భయాలను కొంత తగ్గించిన నేపథ్యంలో శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్లు లాభంతో ముగిశాయి. డో జోన్స్‌ ఇండస్ట్రీయల్‌ ఏవరేజ్‌ ఇండెక్స్‌ 1.50శాతం(372.68 పాయింట్లు) పెరిగి 26,573.72 వద్ద, ఎస్‌అండ్‌పీ ఇండెక్స్ 1.42శాతం(42 పాయింట్లు) లాభపడి 2,952.01 వద్ద, నాస్‌డాక్‌ కాంపోజిట్‌ 1.4శాతం(110 పాయింట్లు) పెరిగి 7,982.47 వద్ద స్థిరపడ్డాయి. ఈ వారం మొత్తంలో ఎస్‌అండ్‌పీ ఇండెక్స్‌ 0.3శాతం, డోజోన్స్‌ 0.10శాతం నష్టపోగా, నాస్‌డాక్‌ మాత్రం 0.5శాతం పెరిగింది. టెక్నాలజీ షేర్లలో ఆపిల్‌ షేర్లు నెలన్నర రోజుల్లో ఎన్నడూలేనంత పెద్ద ర్యాలీ చేసింది. ఇంట్రాడేలో 3.50శాతం ర్యాలీ చేసి చివరికి 3శాతం లాభంతో ముగిసింది.
అమెరికా లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ నిన్న రాత్రి సెప్టెంబర్‌ కార్మిక ఉద్యోగ గణాంకాలను విడుదల చేసింది. మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగా ఆ నెలలో 1.35లక్షల కొత్త ఉద్యోగాల సృష్టి జరిగింది. నాలుగు నెలల్లో ఉద్యోగ వృద్ధి వేగం తగ్గినప్పటికీ.., యు.ఎస్. నిరుద్యోగిత రేటు 3.5% కి పడిపోయింది. ఇది డిసెంబర్ 1969 నుండి కనిష్ట రేటు. ‘‘ఉద్యోగ వృద్ధి శాతం నెమ్మదించింది. ఉద్యోగాల కల్పన మాత్రం అంచనాలకు అందుకోగలిగింది. ఇది ఆర్థిక మాంద్య భయాలను కొంత తగ్గించింది. గణాంకాలు అక్టోబర్‌లో ఫెడ్‌రిజర్వ్‌ వడ్డీరేట్లను ప్రభావితం చేసేంత బలంగా లేవు.’’ అని  స్ట్రీట్‌ గ్లోబల్‌ అడ్వైజర్‌ మైఖైల్‌ అరోన్‌ తెలిపారు. 
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌ 4.50శాతం:- 
అమెరికా మార్కెట్లు నిన్నరాత్రి లాభాల్లో ముగిసినప్పటీకీ.., అక్కడి మార్కెట్లో ట్రేడయ్యే మనదేశపు ఏడీఆర్‌లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌ రంగానికి చెందిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌ 4.20శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏడీఆర్‌ 2.18శాతం పతమయ్యాయి. అలాగే టాటామోటర్స్‌ ఏడీఆర్‌ 1.50శాతం, డాక్టర్‌ రెడ్డీస్‌ ఏడీఆర్‌ 1.15శాతం క్షీణించాయి. మరోవైపు టెక్నాలజీ రంగానికి చెందిన విప్రో ఏడీఆర్‌ 1.50శాతం, ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ షేర్లు అరశాతం లాభపడ్డాయి. You may be interested

బేర్స్‌ను భయపెట్టలేకపోయిన రేట్‌కట్‌!

Saturday 5th October 2019

ఆర్‌బీఐ తాజాగా ప్రకటించిన రేట్ల తగ్గింపు మార్కెట్లో ఇన్వెస్టర్లకు పెద్దగా సరిపోయినట్లు కనిపించలేదు. మార్కెట్‌ అంచనాలకు తగ్గట్లు ఆర్‌బీఐ రేట్లు తగ్గించకపోవడంతో మరోమారు బేర్స్‌ చెలరేగారు. ముఖ్యంగా విదేశీ ఫండ్స్‌ అమ్మకాల వెల్లువతో గత నెల చివర్లో వచ్చిన జోష్‌ మొత్తం ఆవిరయ్యేలా కనిపిస్తోందని నిపుణులు భయపడుతున్నారు. దేశ ఎకానమీ ఆరోగ్యంపై ఆందోళనలకు మార్కెట్‌ అమ్మకాలు తోడవడం మరింత భయాలను రేకెత్తిస్తోందంటున్నారు. వారం మొత్తానికి సూచీలు దాదాపు 3 శాతం

జీడీపీ వృద్ధి అంచనాలు వాస్తవికంగా ఉన్నాయి!

Saturday 5th October 2019

-నిలేష్‌ షా, కోటక్‌ ఏఎంసీ ‘ఆర్‌బీఐ తన ఎంపీసీ సమావేశంలో దేశ జీడీపీ వృద్ధి అంచనాలను సవరించింది. ఆర్థిక సంవత్సరం 2020 మొత్తానికి సంబంధించి జీడీపీ వృద్ధిని 6.9 శాతం నుంచి 6.1 శాతానికి తగ్గించింది. ఆర్‌బీఐ ప్రస్తుతం చేసిన జీడీపీ వృద్ధి అంచనాల సవరణ, గతంలో చేసిన సవరణ కంటే చాలా వాస్తవికంగా ఉంది’ అని కోటక్‌ ఏఎంసీ(అసెట్‌ మేనేజ్‌మెంట్‌), ఎండీ నిలేష్‌ షా అన్నారు.  అంతేకాకుండా రేట్ల కోత మంచి చర్య అని,

Most from this category