News


స్థిరంగా పసిడి

Wednesday 11th December 2019
Markets_main1576048268.png-30173

అంతర్జాతీయ మార్కెట్లో బుధవారం పసిడి ధర స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. నేటి ఉదయం ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ఒకడాలరు స్వల్పలాభంతో 1,469 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.  చైనా దిగుమతులపై అమెరికా రెండో దఫా సుంకాల విధింపు ఈ వారం చివరి రోజు(డిసెంబర్‌ 15న) అమల్లోకి రానున్న నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని ట్రేడర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే నేటి రాత్రి అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీరేట్లపై తన వైఖరి ప్రకటించనుంది. ఈ అంశం కూడా పసిడి తదుపరి కదలికలకు కీలకంగా మారునుంది. ఇక నిన్నరాత్రి  అమెరికా వైట్ హౌస్ ఆర్థిక సలహాదారు లారీ కుడ్లో మాట్లాడుతూ ‘‘ ఆదివారం నుంచి చైనాపై విధించే కొత్త టారీఫ్‌ల పట్ల అధ్యక్షుడు ట్రంప్‌ సుముఖంగా ఉన్నాడు’’ అని ప్రకటించారు. దీంతో రాత్రి అమెరికాలో పసిడి ధర రెండురోజుల నష్టాలకు ముగింపు పలుకుతూ 3.20డాలర్ల లాభంతో 1,468 డాలర్ల వద్ద స్థిరపడింది.
దేశీయంగా స్వల్పలాభాల్లో:-
దేశీయ మార్కెట్లో పసిడి ఫ్యూచర్లు స్వల్ప లాభంతో ట్రేడ్‌ అవుతున్నాయి. ఇటీవల ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి బలపడుతుండటం, అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర 1460 డాలర్ల స్థాయి వద్ద ట్రేడ్‌ అవుతుండటం తదితర కారణాలు దేశీయంగా పసిడి ఫ్యూచర్లు పరిమితి శ్రేణిలో కదలాడేందుకు కారణమవుతున్నాయి. నేడు ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.24.00లు లాభంతో రూ. 37595.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ‘‘డాలర్‌ మారకంలో రూపాయి విలువ బలపడటం దేశీయంగా పసిడికి ప్రతికూలవుతోంది. గత రెండువారాల్లో రూపాయి విలువ 1.3శాతం రికవరి అయ్యింది. ఇది పసిడిపై మరింత ఒత్తిడిని పెంచుతుంది.’’ అని మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 



You may be interested

10 శాతం ప్రీమియంతో లిస్టయిన అరామ్‌కో

Wednesday 11th December 2019

సౌదీకి చెందిన చమురు దిగ్గజ సంస్థ సౌదీ అరామ్‌కో రియాద్‌ స్టాక్‌ఎక్చేంజ్‌లో బంపర్‌ లిస్టింగయింది. ఇష్యూ ధర 32 రియాల్స్‌తో పోలిస్తే 10 శాతం ప్రీమియంతో 35.20 వద్ద సంస్థ షేరు లిస్టయింది. ప్రపంచంలో అతిపెద్ద ఐపీఓగా పేరొందిన ఈ పబ్లిక్‌ ఆఫర్‌తో కంపెనీ 2560 కోట్ల డాలర్లు సమీకరించింది. లిస్టింగ్‌తో సంస్థ విలువ 1.88 లక్షల కోట్ల డాలర‍్లకు చేరింది. దీంతో ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా సౌదీఅరామ్‌కో

యస్‌బ్యాంక్‌ షేరులో అమ్మకాలే కొనసాగుతాయి!

Wednesday 11th December 2019

రాహుల్‌ షా అంచనా స్వల్పకాలానికి యస్‌బ్యాంక్‌ షేరులో సెల్లింగే కొనసాగవచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌ ప్రతినిధి రాహుల్‌ షా అంచనా వేశారు. కొన్ని నెలలుగా ఈ షేరు తీవ్ర ఒడిదుడుకులు నమోదు చేస్తుందన్నారు. మార్కెట్లు బ్యాంకు ఫండ్‌రైజింగ్‌ ప్లాన్స్‌ను డిస్కౌంట్‌ చేశాయన్నారు. అందువల్ల ఒకవేళ మంచి డీల్‌ కుదిరినా షేరులో భారీ అప్‌మూవ్‌ ఉండకపోవచ్చన్నారు. గతంలో కూడా క్యూఐపీ అనంతరం షేరు నెగిటివ్‌గా రియాక్టైన విషయాన్ని గుర్తు చేశారు. అందువల్ల షార్ట్‌టర్మ్‌లో అనేక

Most from this category