News


పసిడి అక్కడక్కడే ..

Tuesday 3rd December 2019
Markets_main1575350645.png-30022

అమెరికా చైనాల మధ్య వాణిజ్య చర్చల్లో భాగంగా తొలి దశ దాదాపు ఖరారయ్యే దశలో ఉన్నాయనే అంచనాలతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర మంగళవారం ఉదయం సెషన్‌లో 3డాలర్ల మేర నష్టపోయింది. ఆసియాలో ఔన్స్‌ పసిడి 3డాలర్ల నష్టంతో 1,466డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ ఏడాది చివరికల్లా చైనాతో ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశం ఉందని యూఎస్‌ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీనియర్ సలహాదారు కెల్లియాన్ కాన్వే తెలిపారు.మరోవైపు అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ఒప్పందం ‘‘కుదరవచ్చు లేదా కుదరకపోవచ్చు’’ అని అమెరికా దేశాధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. తాజాగా బ్రెజిల్‌, అర్జెంటీనా నుంచి దిగుమతయ్యే స్టీల్‌పై సుంకాలు విధిస్తామని ట్రంప్‌ ప్రకటించారు. ఈ అంశాలపై మరింత స్పష్టత కోసం పసిడి ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. చైనా పారిశ్రామిక గణాంకాలు అంచనాలకు మించి నమోదుకావడంతో సోమవారం రాత్రి అమెరికా మార్కెట్లో పసిడి ధర 3.50డాలర్లు నష్టపోయి 1,469 వద్ద స్థిరపడింది. 
దేశీయ స్వల్ప నష్టాల్లో:- 
దేశీయ మార్కెట్లో పసిడి ధర స్వల్ప నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. నేటి ఎంసీఎక్స్‌ మార్కెట్లో డిసెంబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.72.00లు నష్టపోయి రూ.37880.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. సోమవారం రాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్‌ ముగింపు సమయానికి పసిడి ధర రూ.79 నష్టపోయి రూ.37952.00 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. రానున్న రోజుల్లో పసిడి ధర పరిమితి శ్రేణిలో కదలాడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పతనం ప్రతిసారి కొనుగోలు చేయడం అనే వ్యూహాన్ని అమలు చేయడం మంచింది. స్వల్పకాలికి పసిడి ధర రూ.37,700-రూ.38,050 రేంజ్‌లో ట్రేడయ్యే అవకాశం ఉందని ఇండియా నివీష్‌ కమోడిటీ డైరెక్టర్‌ మనోజ్‌ కుమార్‌ జైన్‌ అభిప్రాపడ్డారు. 



You may be interested

ప్రభుత్వ పరిశీలనలో ఆదాయపన్ను తగ్గింపు?!

Tuesday 3rd December 2019

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సంకేతాలు కార్పొరేట్‌ టాక్స్‌ తగ్గింపు తరహాలోనే వ్యక్తిగత ఆదాయ పన్ను తగ్గించాలన్న డిమాండ్‌ను పరిశీలిస్తున్నామని, ఈ విషయమై ప్రభుత్వం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. కార్పొరేట్‌ టాక్స్‌ తగ్గింపుతో కొత్త పెట్టుబడులు ఆరంభమయ్యాయని, వ్యవస్థలో రికవరీ చిగురులు వేస్తోందని చెప్పారు. వైయుక్తిక ఆదాయపన్ను ప్రయోజనాలను ప్రభుత్వం క్రమానుగతంగా సమీక్షిస్తుంటుందన్నారు. మందగమనంపై మాట్లాడుతూ, తమది చైతన్యవంతమైన ప్రభుత్వమని, ఎకానమీలో

టారిఫ్‌ దెబ్బ పెద్దదేం కాదు-ప్రభుత్వ వర్గాలు

Tuesday 3rd December 2019

ఇతర దేశాలతో పోలిస్తే మనవద్ద చార్జీలు తక్కువే... ప్రభుత్వ వాదన చార్జీలు పెంచిన తర్వాత కూడా ప్రపంచంలో అత్యంత చౌకగా డేటా, వాయిస్‌ కాల్స్‌ ఇండియాలోనే లభిస్తున్నాయని, నాలుగేళ్ల క్రితం చార్జీలతో పోలిస్తే తాజా చార్జీలు చాలా తక్కువని ప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానించాయి. తాజాగా మూడు టెలికం ఆపరేటర్లు దాదాపు 40 శాతం మేర టారిఫ్‌లు పెంచిన సంగతి తెలిసిందే. దేశ టెలికం చరిత్రలో ఇది అత్యంత భారీ పెరుగుదల. ఇంతగా చార్జీలు

Most from this category