News


1300 డాలర్ల పైన పసిడి పటిష్టమే

Monday 11th February 2019
Markets_main1549866590.png-24123

పసిడిపై నిపుణుల అంచనా..
అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌- న్యూయార్క్‌ మర్కంటైల్‌ ఎక్స్చేంజ్‌- నైమెక్స్‌లో పసిడి ధర పటిష్టంగానే ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఔన్స్‌ ధర 1,300 డాలర్లపైన కొనసాగినంతకాలం పసిడిది బులిష్‌ ధోరణిగానే పరిగణించాల్సి ఉంటుందన్నది వారి విశ్లేషణ. శుక్రవారంతో ముగిసిన వారంలో ధర ఒక దశలో 1,307 డాలర్లకు పడినా, అటుపై తిరిగి 1,318 డాలర్లకు చేరడం గమనార్హం. అయితే వారంవారీగా చూస్తే ఇది 4 డాలర్లు తక్కువ. 1,325 డాలర్ల వద్ద నిరోధమనీ, ఈ అడ్డంకిని అధిగమిస్తే, 1,340 డాలర్ల వరకూ పసిడి ధర పయనించే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. 2019, 2020ల్లో యూరోపియన్‌ యూనియన్‌ వృద్ధి మందగిస్తుందన్న వార్తలు గతవారం డాలర్‌ బలోపేతానికి ఊతం ఇచ్చాయి. అయితే వాణిజ్య యుద్ధం, అమెరికా వృద్ధికి సంబంధించి కీలక గణాంకాలు, ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపు స్పీడ్‌పై అనిశ్చితి తొలగనంతవరకూ డాలర్‌ బలోపేత ధోరణి కొనసాగదని, ఇది పసిడి పెరుగుదలకు సానుకూల అంశమని విశ్లేషణ. శుక్రవారం డాలర్‌ ఇండెక్స్‌ ముగింపు 96.41.
భారత్‌లోనూ అదే ధోరణి...
ఇక భారత్‌లో చూస్తే, పసిడి ధర సమీపకాలంలో భారీగా తగ్గే అవకాశాలు లేవని భావిస్తున్నారు.  అంతర్జాతీయంగా బంగారం ధర పెరుగుదలతోపాటు డాలర్‌ మారకంలో రూపాయి బలహీనధోరణి ఇందుకు ప్రధాన కారణం. దేశీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌- మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో పసిడి 10 గ్రాముల ధర రూ.33,242 వద్ద ముగిసింది. ఇక ముంబై స్పాట్‌ మార్కెట్‌లో​ శుక్రవారం 24, 22 క్యారెట్ల పసిడి ధరలు వరుసగా రూ.33,980, రూ.32,360 వద్ద ముగిశాయి.You may be interested

లార్జ్‌ క్యాప్‌ పథకాల్లో మేటి..!

Monday 11th February 2019

సూచీలు ముందుకే పయనిస్తున్నాయి. కానీ, అన్ని లార్జ్‌క్యాప్‌ పథకాలు సూచీలతో పోలిస్తే రాబడుల పరంగా షార్ప్‌గా ఉన్నాయంటే... అవునని చెప్పలేం. అన్ని పథకాలు సూచీలకు దీటుగా, సూచీలను మించి రాబడులను అన్ని సమయాల్లోనూ ఇస్తాయని ఆశించలేం. కొన్నింటికే అది సాధ్యపడుతుంది. ఈ విభాగంలోని యాక్సిస్‌ బ్లూచిప్‌ పథకం మాత్రం లార్జ్‌క్యాప్‌ పథకాల విభాగం సగటు రాబడులతో పోల్చినా, సూచీలతో పోల్చి చూసినా రాబడుల పరంగా మెరుగ్గా కనిపిస్తోంది. పరిమిత రిస్క్‌,

అప్‌మూవ్‌ కొనసాగాలంటే 10985 దాటాల్సిందే!

Monday 11th February 2019

గతవారం నిఫ్టీ ఆరంభంలో అదరగొట్టి చివరకు స్వల్ప లాభంతో సరిపెట్టుకుంది. గతంలో జరిగిన పతనానికి 61.8 శాతం రిట్రేస్‌మెంట్‌ స్ధాయి వద్ద నిఫ్టీ ‍ప్రస్తుతం బలమైన నిరోధం ఎదుర్కొంటోంది. స్వల్పకాలిక ట్రెండ్‌, టెక్నికల్‌ అంశాలు మాత్రం బుల్లిష్‌నెస్‌నే సూచిస్తున్నాయి. అందువల్ల మరోమారు నిరోధాన్ని దాటే ప్రయత్నాలు జరగవచ్చని నిపుణుల అంచనా. తాజాగా చార్టుల్లో జీఎంఎంఏ ఇండికేటర్‌ ‘కొనొచ్చు’ సంకేతాలు ఇచ్చింది. బుల్స్‌కు ఇంకా బలం తగ్గలేదనేందుకు ఇదే సంకేతమని నిపుణులు

Most from this category