News


4రోజుల పసిడి లాభాలకు బ్రేక్‌..!

Saturday 5th October 2019
Markets_main1570262607.png-28736

ఆర్థిక మాంద్య భయాలతో వరుసగా నాలుగు రోజుల ర్యాలీ చేస్తున్న పసిడి ధరకు శుక్రవారం బ్రేక్‌ పడింది. అమెరికాలో నిన్నరాత్రి ఔన్స్‌ పసిడి ధర అంతకు ముందు ముగింపు(1,514డాలర్లు)తో పోలిస్తే 1డాలరు స్వల్ప నష్టంతో 1513డాలర్ల వద్ద స్థిరపడింది. అమెరికాలో సెప్టెంబర్‌ కార్మిక ఉపాధి కల్పన గణాంకాలు మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగా నమోదయ్యాయి. ఈ సెప్టెంబర్‌లో  1.35లక్షల కొత్త ఉద్యోగాల సృష్టి జరిగింది. గణాంకాలు అక్టోబర్‌లో ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల ప్రకటనను ప్రభావితం చేసేంత లేకపోయినప్పటికీ.., ఆర్థిక మాంద్య భయాలను కొంతమేర తగ్గించడంతో పసిడి ధరకు డిమాండ్‌ తగ్గింది. నిన్న పసిడి నష్టాల్లో ముగిసినప్పటికీ.., ఈ వారం మొత్తం మీద 7డాలర్లు స్వల్పంగా లాభపడింది. ఈ ఏడాది ఆరంభం నుంచి ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి ప్రభావంతో పసిడి ధర తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. 
దేశీ మార్కెట్లో పసిడి స్వల్ప తగ్గింపే..!
అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగానే దేశీయంగా పసిడి ధర స్వల్ప నష్టంతో ముగిసింది. శుక్రవారం ఎంసీఎక్స్‌ మార్కెట్‌ ముగిసే సరికి అక్టోబర్‌ కాంట్రాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.70.00ల నష్టంతో రూ.38333.00వద్ద స్థిరపడింది. రూపాయి ఫ్లాట్‌గా ముగియడంతో పసిడి ధర స్తబ్ధుగా ట్రేడైంది. దేశీయంగా ఈ వారంలో పసిడి ధర రూ.783లు పెరిగింది. 



You may be interested

అంత ర్యాలీ అనంతరం ఇంత పతనం.. మాములే!

Saturday 5th October 2019

నిపుణుల అభిప్రాయం గతనెల ప్రభుత్వ ప్రకటన అనంతరం వచ్చిన ఉత్సాహాన్ని కొనసాగించాలని బుల్స్‌ ఎంత ప్రయత్నించినా చివరకు మార్కెట్‌ మాత్రం బేర్స్‌ పట్టులోకే జారింది. ఆర్‌బీఐ వృద్ధి రేటు అంచనాలను తగ్గించడంతో మార్కెట్‌ ఈ వారాన్ని నష్టాలతో ముగించింది. అయితే గత నెల చివర్లో భారీగా పెరిగిన సూచీలు ఈమాత్రం పతనం కావడం కామనేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిఫ్టీ 11000- 11100 పాయింట్ల వరకు దిగజారడాన్ని సాధారణ పతనంగానే భావించాలంటున్నారు. ఈవారం

బేర్స్‌ను భయపెట్టలేకపోయిన రేట్‌కట్‌!

Saturday 5th October 2019

ఆర్‌బీఐ తాజాగా ప్రకటించిన రేట్ల తగ్గింపు మార్కెట్లో ఇన్వెస్టర్లకు పెద్దగా సరిపోయినట్లు కనిపించలేదు. మార్కెట్‌ అంచనాలకు తగ్గట్లు ఆర్‌బీఐ రేట్లు తగ్గించకపోవడంతో మరోమారు బేర్స్‌ చెలరేగారు. ముఖ్యంగా విదేశీ ఫండ్స్‌ అమ్మకాల వెల్లువతో గత నెల చివర్లో వచ్చిన జోష్‌ మొత్తం ఆవిరయ్యేలా కనిపిస్తోందని నిపుణులు భయపడుతున్నారు. దేశ ఎకానమీ ఆరోగ్యంపై ఆందోళనలకు మార్కెట్‌ అమ్మకాలు తోడవడం మరింత భయాలను రేకెత్తిస్తోందంటున్నారు. వారం మొత్తానికి సూచీలు దాదాపు 3 శాతం

Most from this category