News


కనిష్టస్థాయి వద్దే బంగారం ధర..!

Friday 27th April 2018
Markets_main1524808678.png-15932

  • ఈ వారంలో 1శాతం నష్టపోయిన పసిడి

ముంబై:- బంగారం ధరలు 5-వారాల కనిష్టధర వద్దే  ట్రేడ్‌ అవుతున్నాయి. డాలర్‌ ఇండెక్స్‌ మూడున్నర నెలల గరిష్టస్థాయి(91.63)కి చేరుకోవడం, అమెరికా ట్రెజరీ ఈల్డ్‌‍్స 3శాతం స్థాయిని తాకడం, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా నేతలు కిమ్‌ జోంగ్‌ ఉన్‌, మూన్‌ జే- ఇన్‌ శుక్రవారం శిఖరాగ్ర సమావేశానికి హాజరుకావడంతో భౌగోళిక ఉద్రికత్తలు తగ్గడం, గతరాత్రి అమెరికా మార్కెట్‌ లాభాల ముగింపు తదితర కారణాలు బంగారం ధరల కనిష్టస్థాయికి కారణమవుతున్నాయి. ఆసియా ట్రేడింగ్‌లో శుక్రవారం ఔన్స్‌(31గ్రాములు) బంగారం ధరలు గత రాత్రి అమెరికా ముగింపు ధర( 1,317.90డాలర్ల)తో పోలిస్తే 0.30డాలర్లు నష్టపోయి 1,317.70 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. బంగారం ధరలు ఈ స్థాయికి పతనం కావడంతో ఈ వారంలో 1 శాతం నష్టపోయినట్లైంది.
దేశీయంగానూ అదే ధోరణిలో:-
అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగానే దేశీయ మార్కెట్లో బంగారం ధరలు పతనవుతున్నాయి. మల్టీ కమోడిటీ మార్కెట్‌ - ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ధర రాత్రి ముగింపు ధర (రూ.31,252)తో పోలిస్తే రూ.108లు నష్టపోయి రూ.31144.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ తిరిగికోలుకోవడం, దేశీయ స్టాక్‌ సూచీలు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండం బంగారం ధరలపై ప్రభావాన్ని చూపుతున్నాయి.



You may be interested

మే సీరిస్‌లో బుల్‌ దూకుడు!?

Friday 27th April 2018

పెరిగిన ఎఫ్‌ అండ్‌ ఓ లాంగ్స్‌ రోలోవర్లు కొత్త సీరిస్‌లో ఈక్విటీలు ఎక్కువ శాతం పాజిటివ్‌గానే ఉండే ఛాన్సులున్నాయని ఎఫ్‌ అండ్‌ ఓ రోలోవర్లు సూచిస్తున్నాయి. ఏప్రిల్‌ సీరిస్‌ ముగింపు సందర్భంగా మే సీరిస్‌లోకి బుల్లిష్‌ కాంట్రాక్టుల రోలోవర్‌ ఊపందుకుంది. కర్నాటక ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందన్న నమ్మకాలు ట్రేడర్లలో బుల్‌మూడ్‌ పెంచుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా టెక్నాలజీ స్టాకుల్లో భారీగా లాంగ్‌ రోలోవర్లు పెరిగాయి. రూపాయి క్షీణత ఇన్వెస్టర్లకు ఐటీ స్టాకులపై

రూపాయి బలహీనత...ఈ కంపెనీలకు బలం

Friday 27th April 2018

డాలర్‌తో రూపాయి మారకం విలువ ఈ సంవత్సరంలో భారీగా క్షీణిస్తోంది. 2018లో ఇంతవరకు రూపాయి దాదాపు 5 శాతం పతనమైంది. ఈ పతనం ఇంతటితో ఆగదని, 68 స్థాయిలకు కొనసాగుతుందని కరెన్సీ నిపుణులు అంచనా వేస్తున్నారు. రూపీ క్షీణత ఎకానమీకి ఇబ్బంది కలిగించేదే అయినా, కొన్ని కంపెనీలకు మాత్రం లాభం చేకూరుస్తుందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా ఎగుమతులపై ఆధారపడే కంపెనీలకు ఈ క్షీణత మేలు చేస్తుందంటున్నాయి. నిపుణుల అభిప్రాయాలు.. 1. బీఎన్‌పీ

Most from this category