News


2వారాల గరిష్టానికి పసిడి

Tuesday 24th September 2019
Markets_main1569303018.png-28515

ఆర్థిక మందగమన భయాలు, మధ్య పశ్చిమాసియా ఉద్రికత్తలతో క్రితం సెషన్‌లో 2వారాల గరిష్టాన్ని అందుకున్న పసిడి ధర మంగళవారం ట్రేడింగ్‌లో స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియాలో ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర 1డాలరు స్వల్ప నష్టంతో 1,530 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అయితే అమెరికా చైనాల మధ్య సానుకూల చర్చలు పసిడి ధరపై ఒత్తిడిని పెంచుతున్నాయి.‘‘ఒక ఒప్పందం కుదుర్చుకోవచ్చని ఇరు దేశాలు (చైనా, యునైటెడ్ స్టేట్స్) మళ్లీ సంకేతాలనిచ్చాయి. ఇది పసిడి ధరపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుంది. చర్చలు మళ్లీ విఫలమైతే.., అపుడు పసిడికి మళ్లీ మద్దతు పెరుగుతుంది’’ అని సీఎంసీ ఛీప్‌ మార్కెట్‌ స్ట్రాటజిస్ట్‌ మైకెల్‌ అభిప్రాయపడ్డారు. ఏడాది కాలంగా అగ్రరాజ్యాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం, ప్రపంచ వృద్ధి భయాలతో పసిడి ధర ఈఏడాదిలో 18శాతం క్షీణించింది. యూరోజోన్‌ ఆర్థిక గణాంకాలు మార్కెట్‌ నిరాశపరడంతో మరోసారి ఆర్థిక వృద్ధి భయాలు, అమెరికా, చైనాల మధ్య వాణిజ్య చర్చల సందిగ్ధత, ఇరాన్‌ ఉద్రికత్తలతో పసిడి ధర నిన్నరాత్రి అమెరికా మార్కెట్లో 2వారాల గరిష్ట ధర 1,531.50డాలర్ల వద్ద ముగిసింది.
దేశీయంగా రెండు రోజుల ర్యాలీకి బ్రేక్‌ ..!
దేశీయ మార్కెట్లో పసిడి ధర రెండురోజుల వరుస ర్యాలీకి మంగళవారం బ్రేక్‌ పడింది. ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో అక్టోబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.126లు నష్టపోయి రూ.37798.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఫారెక్స్‌మార్కెట్లో డాలర్‌ మారక విలువలో రూపాయి బలపడటం పసిడి నష్టానికి కారణమైంది. నిన్నరాత్రి రూపాయి ఫ్లాట్‌గా ముగిసిన నేపథ్యంలో ఎంసీక్స్‌ మార్కెట్లో రూ.227లు లాభంతో రూ.37,924 వద్ద స్థిరపడింది. 

 



You may be interested

గరిష్టస్థాయి నుంచి బ్యాంక్‌ నిఫ్టీ 2.5 శాతం పతనం

Tuesday 24th September 2019

ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ మంగళవారం ట్రేడింగ్‌ సెషన్‌లో 1.50శాతం మేర క్షీణించింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ నేడు 30,432.00 వద్ద ప్రారంభమైంది. మార్కెట్‌ ఆరంభంలో కొంత కొనుగోళ్ల మద్దతు లభించడంతో 102 పాయింట్లు పెరిగి 30,668.10 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. అనంతర జరిగిన లాభాల స్వీకరణతో ఇంట్రాడే గరిష్టం(30,668) నుంచి 2.50శాతం క్షీణించి 29,889.55 వద్ద ఇంట్రాడే

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 4శాతం అప్‌

Tuesday 24th September 2019

రెండురోజుల భారీ ర్యాలీ తర్వాత మంగళవారం మార్కెట్‌లో లాభాల స్వీకరణ చోటుచేసుకుంటుంది. ఫలితంగా ఉదయం 10.50 సమయానికి నిఫ్టీ 22.20 పాయింట్లు నష్టపోయి 11,578.00 పాయింట్ల వద్ద, సెన్సెక్స్‌ 43.15 పాయింట్లు కోల్పోయి 39,046.88 పాయిం‍ట్ల వద్ద ట్రేడవుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు పాజిటివ్‌గా ట్రేడయ్యి మార్కెట్‌ నష్టాలను తగ్గింస్తోంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు ఉదయం 10.50 సమయానికి 4.59 శాతం లాభపడి రూ. 1,296.15 వద్ద

Most from this category