News


స్థిరంగా పసిడి ధర

Tuesday 16th October 2018
Markets_main1539667298.png-21195

ప్రపంచమార్కెట్లో మం‍గళవారం పసిడి ధర రెండున్నర నెలల గరిష్టం వద్ద స్థిరంగా ట్రేడ్‌ అవుతున్నాయి. భారత వర్తమాన కాల ప్రకారం ఉదయం గం.10:15ని.కు ఆసియా మార్కెట్లో ఔన్స్‌ పసిడి అరడాలర్‌ పెరిగి లాభపడి 1,229 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటుపై ఆందోళనలతో పాటు, సౌదీ అరేబియా, పశ్చిమ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో రాత్రి అమెరికా మార్కెట్లో ఔన్స్‌ పసిడి 1,236.90 స్థాయిని అందుకుంది. ఇది పసిడి ధరకు రెండున్నర నెలల గరిష్టస్థాయి. నేడు ఆసియా ట్రేడింగ్‌లో ప్రధాన మార్కెట్లన్నీ లాభాల్లో ట్రేడ్‌ అవుతుండంతో పసిడి ధర స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. పసిడి 1230 డాలర్ల స్థాయిని బ్రేక్‌ చేసినట్లైతే, 1250 డాలర్ల స్థాయిని తర్వగా చేరుకోంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
రూ.32వేల ఎగువకు పసిడి:-
దేశీయ మార్కెట్లో పసిడి ధర రూ.32000ల పైకి చేరుకుంది. అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగానే దేశీయంగా పసిడి ధర స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఎంసీఎక్స్‌ మార్కెట్లో నేడు 10గ్రాముల పసిడి ధర రూ.38.00లు లాభపడి రూ.32104.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. గతరాత్రి ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి మళ్లీ బలహీన పడటంతో ఎంసీఎక్స్‌లో 10గ్రాముల పసిడి ధర రూ.225లు లాభపడి రూ.32ల ఎగువన రూ.32066 వద్ద ముగిసింది.



You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ 1.50శాతం అప్‌

Tuesday 16th October 2018

మార్కెట్‌ ర్యాలీలో భాగంగా మంగవారం బ్యాంక్‌ షేర్లు భారీగా లాభపడుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఉదయం ట్రేడింగ్‌ సెషన్స్‌లో బ్యాంక్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1.50శాతం లాభపడింది. ఉదయం గం.10:45ని.లకు ఇండెక్స్‌ 1.15శాతం లాభపడి 25,672.20 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఈ సూచీలో షేర్లన్నీ లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అ‍త్యధికంగా ఐసీఐసీఐ బ్యాంకు 2.60శాతం లాభపడింది. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంక్‌,

10,600 పైకి నిఫ్టీ

Tuesday 16th October 2018

ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్లు జోరుమీదున్నాయి. వరుసగా మూడో సెషన్‌లోనూ లాభాలతో దూసుకెళ్తున్నాయి. నిఫ్టీ మళ్లీ 10,600 మార్క్‌ పైకి వెళ్లింది. ఇక సెన్సెక్స్‌ 35,200 మార్క్‌కు పైకి వచ్చింది. ఉదయం 10:42 సమయంలో నిఫ్టీ 84 పాయింట్ల లాభంతో 10,595 వద్ద, సెన్సెక్స్‌ 318 పాయింట్ల లాభంతో 35,183 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 34,913 కనిష్ట, 35,215 గరిష్ట స్థాయిల మధ్య కదలాడింది. నిఫ్టీ ఇంట్రాడేలో 10,525

Most from this category