తగ్గిన పసిడి.!
By Sakshi

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర సోమవారం ఉదయం ట్రేడింగ్ సెషన్లో 6డాలర్లు నష్టపోయింది. నేటి ఆసియాలో ట్రేడింగ్‌లో ఔన్స్ పసిడి 6డాలర్లు నష్టంతో 1,464 వద్ద ట్రేడ్ అవుతోంది. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్ ఇండెక్స్ బలపడటం, చైనా ఫ్యాకర్టీ సెక్టార్ గణాంకాలు మార్కెట్ అంచనాలను మించిన నమోదుకావడం పసిడి పతనానికి కారణమయ్యాయి. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక దేశంగా పిలువబడే చైనా నవంబర్ ఫ్యాక్టరీ యాక్టివిటీ గణాంకాలు అంచనాలకు మించి నమోదయ్యాయి. ఇదేనెలలో ఇదే నెలలో పారిశ్రామిక విస్తరణ ఊపందుకున్నట్లు చైనా ప్రభుత్వాధికారులు తెలిపారు. దీంతో ఆర్థిక మందగమనంపై ఇన్వెస్టర్లకు ఆందోళనలను తగ్గించాయి. దీంతో వారు తమ పెట్టుబడులను ఈక్విటీ మార్కెట్ల వైపు మళ్లించారు. మరోవైపు పసిడి ధరపై వ్యతిరేక ప్రభావాన్ని చూపే డాలర్ ఇండెక్స్ సైతం ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో బలపడింది. ఈ పరిణామాలు పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ను తగ్గించనట్లు బులియన్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘‘ఫండమెంటల్స్ ఇప్పటికీ బలంగా ఉన్నాయి. ప్రస్తుతం పసిడిపై కొనసాగుతున్న ఒత్తిడి మరెంతో కాలం ఉండదు. ఈ సంవత్సరాంతానికి పసిడి ధర ఈ సంవత్సరం ప్రారంభంలో మనం చూసిన అప్‌ట్రెండ్‌ను అందుకుంటాయి. స్వల్పకాలానికి 1,450 - 1,500డాలర్ల స్థాయిలో ట్రేడయ్యే అవకాశం ఉంది.’’ అని బులియన్ విశ్లేషకుడు హైన్స్ అభిప్రాయపడ్డారు. నిన్నవారం ట్రేడింగ్ చివరిరోజైన శుక్రవారం పసిడి ధర 1,470.30డాలర్ల వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే.
దేశీయంగా రూ.150ల నష్టం:-
నిన్నటి వారంలో రూ.38వేల పైన ముగిసిన పసిడి ఫ్యూచర్ల ధర సోమవారం ఆ స్థాయిని కోల్పోయాయి. నేటి ఎంసీఎక్స్ మార్కెట్లో డిసెంబర్ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.150 నష్టపోయి రూ.37880.00 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర పతనం, దేశీయ పసిడి ధరలను ప్రభావితం చేసే రూపాయి ఫ్లాట్ ట్రేడింగ్, నేడు ప్రారంభంలో దేశీయ స్టాక్ సూచీల లాభాల ప్రారంభం తదితర అంశాలు దేశీయ పసిడి ఫ్యూచర్లపై అమ్మకాల ఒత్తిడికి పెంచుతున్నాయి. శుక్రవారం రాత్రి ఎంసీఎక్స్ మార్కెట్లో డిసెంబర్ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.150 నష్టపోయి రూ.37880.00 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.
You may be interested
కార్వీ ట్రేడింగ్ లైసెన్స్ సస్పెన్షన్
Monday 2nd December 2019కార్వీ స్టాక్ బ్రోరింగ్ లిమిటెడ్ తన సొంత ఖాతాదారులకు చెందిన రూ.2300 కోట్ల ధనాన్ని దుర్వినియోగంపై ఎక్చ్సేంజీలు ఘాటుగా స్పందించాయి. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు సోమవారం కార్వీ ట్రేడింగ్ లైసెన్స్‌ను రద్దు చేశాయి. సెబీ నియమాలను ఉల్లఘించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్చ్సేంజీలు తెలిపాయి. ఈక్విటీ, డెరివేటివ్స్, కమోడిటీలకు కూడా ఈ రద్దు వర్తిస్తుంది. తదుపరి ఎంసీఎక్స్ కూడా కార్వీ సభ్యత్వాన్ని రద్దు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. నవంబర్
జియో కాల్, డేటా ఛార్జీలు పెరగనున్నాయ్..!
Monday 2nd December 2019ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా సంస్థలతో పాటు ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో కూడా టారీఫ్‌లను పెంచేందుకు సిద్ధమైంది. ఇందుకు కోసం కొత్త ‘‘ఆల్ఇన్వన్ ప్లాన్’’ను డిసెంబర్ 6 నుంచి అమల్లోకి తీసుకువస్తున్నట్లు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కోంది. ఈ కొత్త ప్లాన్‌లో భాగంగా అన్ని వాయిస్, డేటా ఛార్జీలను 40శాతం వరకు పెంచుతున్నట్లు తెలిపింది. ఇతర మొబైల్ నెట్‌వర్క్‌కు కాల్స్‌పై విధించే ‘‘ఫెయిర్ యూసేజ్ పాలసీ’’ని పరిమితం చేస్తామని