News


పసిడి: ఏడేళ్ల గరిష్టం నుంచి వెనక్కి..!

Tuesday 7th January 2020
Markets_main1578372173.png-30725

ప్రపంచమార్కెట్లో పసిడి ఫ్యూచర్స్‌ ధర మంగళవారం ఏడేళ్ల గరిష్టం నుంచి వెనక్కి వచ్చాయి. ఆసియాలో ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర దాదాపు 8డాలర్లు(అరశాతం) నష్టపోయి 1,560.95డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. గరిష్ట స్థాయి వద్ద ఇన్వెస్టర్లు, ట్రేడర్లు లాభాల స్వీకరణకు పూనుకోవడం, పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం పరిస్థితులు కొంత చల్లబటం తదితర కారణాలు పసిడి ఫ్యూచర్ల డిమాండ్‌ను తగ్గించాయి. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణంతో నిన్నటి ట్రేడింగ్‌లో పసిడి ఫ్యూచర్లు​1,582.35 డాలర్ల వద్ద ఏడేళ్ల గరిష్టాన్ని అందుకుంది. మార్కెట్‌ ముగిసే సరికి 1,568.80 డాలర్ల వద్ద స్థిరపడింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణాత్మక సాధనాల్లో పెట్టుబడిగా డాలర్‌, క్రూడాయిల్‌ కంటే పసిడి ఉత్తమని గోల్డ్‌మెన్‌ శాష్యూ ఒక నివేదికలో తెలిపింది.
దేశీయంగానూ వెనకడుగే..!
అంతర్జాతీయ ట్రెండ్‌కు తగ్గట్టుగానే దేశీయ పసిడి ఫ్యూచర్లు మంగళవారం వెనకడుగేశాయి. ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.232ల నష్టంతో రూ.40240.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయంగా పసిడి ఫ్యూచర్లు అరశాతం నష్టపోవడం, డాలర్‌ మారకంలో రూపాయితో దేశీయ ఈక్విటీ మార్కెట్లు తిరిగిపుంజుకోవడం పసిడి ఫ్యూచర్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య చర్చలు, యూరోజోన్‌లో బ్రెగ్జిట్‌, పశ్చిమాసియా, హాంగ్‌కాంగ్‌లో భౌగోళిక ఉద్రిక్తతలు తదితర అంశాలు పసిడి ఇన్వెస్టర్లు పరిశీలిస్తున్నారని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్‌ పేర్కోంది. ఇక నిన్నరాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్‌ ముగింపు సమయానికి 10గ్రాముల పసిడి ధర రూ.360లు లాభపడి రూ.40472 వద్ద స్థిరపడింది. 



You may be interested

ఐటీఐ, మిధానీ, యాస్టర్‌ డీఎం- లాభాల్లో

Tuesday 7th January 2020

అంతర్జాతీయంగా స్టాక్‌ మార్కెట్లలో సెంటిమెంటు బలపడటంతో దేశీయంగానూ ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. దీంతో మంగళవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 500 పాయింట్లు జంప్‌చేయగా.. నిఫ్టీ 150 పాయింట్లు ఎగసింది. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల ఆధారంగా కొన్ని మిడ్‌ క్యాప్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ జాబితాలో టెలికం పీఎస్‌యూ ఐటీఐ లిమిటెడ్‌, ఆరోగ్య పరిరక్షణ కంపెనీ యాస్టర్‌ డీఎం హెల్త్‌కేర్‌, ఇంజినీరింగ్‌ పీఎస్‌యూ మిశ్రధాతు నిగమ్‌(మిధానీ) చోటు సాధించాయి. వివరాలు చూద్దాం.. ఐటీఐ

కొద్ది రోజుల్లో 11800 పాయింట్ల వరకు పతనం !?

Tuesday 7th January 2020

నిపుణుల అంచనా పశ్చిమాసియా ఉద్రిక్తతలతో సోమవారం దేశీయ సూచీలు భారీగా పతనమయ్యాయి. అయితే మంగళవారం సూచీలు వేగంగా రీబౌన్స్‌ అవుతున్నాయి. నిఫ్టీ కీలక 12100 పాయింట్ల పైన ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో నిఫ్టీ కీలక మద్దతులు కోల్పోయినందున రాబోయే రోజుల్లో 11800- 11850 పాయింట్ల వరకు పతనం కావచ్చని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. పరిస్థితులు మరీ అధ్వాన్నంగా మారితే పతనం 11600 పాయింట్ల వరకు ఉండొచ్చంటున్నారు. 1. ఎడెల్‌వీజ్‌ అనలిస్టు సాగర్‌:

Most from this category