News


స్థిరంగా పసిడి

Wednesday 15th May 2019
Markets_main1557898878.png-25742

ప్రపంచమార్కెట్లో పసిడి ధర స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియాలో ఉదయం ట్రేడింగ్‌ సెషన్స్‌లో ఔన్స్‌ పసిడి ధర 1 డాలరు నష్టపోయి 1,295.55 వద్ద ట్రేడ్‌ అవుతోంది. వాషింగ్టన్‌ - బీజింగ్‌ల మధ్య వాణిజ్య చర్చలపై మళ్లీ ఆశలు చిగురించడంతో ఇన్వెస్టర్లు ఆందోళనలు కొంత తగ్గుముఖం పట్టాయి. అలాగే డాలరుతో పాటు పలు ప్రపంచ ఈ‍క్విటీ మార్కెట్లు రికవరి బాట పట్టాయి. ఈ సోమవారం ఒక్కరోజులోనే పసిడి 20డాలర్ల లాభపడటంతో పాటు 1300డాలర్ల కీలక స్థాయికి చేరడంతో పసిడి ఫ్యూచర్లలో కొంత లాభాల స్వీకరణ జరిగినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికీ ఇన్వెస్టర్లు సంక్షోభ సమయాల్లో డాలర్‌ కొనుగోళ్లకే మొగ్గు చూపుతుండం పసిడి ర్యాలీకి అంతరాయం కలుగుతుంది. 1300డాలర్ల స్థాయి వద్ద పసిడి కీలక నిరోధస్థాయి కలిగి ఉందని హాంగ్‌కాంగ్‌కు చెందిన మార్కెట్‌ విశ్లేషకుడు పీటర్‌ ఫంగ్‌ తెలిపారు.
దేశీయంగా స్థిరంగా పసిడి ధర:- 
ప్రపంచమార్కెట్‌కు ట్రెండ్‌కు అనుగుణంగా పసిడి ధర స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఎంసీఎక్స్‌లో జూన్‌ కాంట్రాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.17ల స్వల్ప నష్టంతో రూ.32224.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌ మారకంలో రూపాయి బలపడం పసిడి ర్యాలీకి అడ్డుకట్టవేస్తుంది.You may be interested

‘జెట్‌’ను కూల్చేశారా...? లేక కూలిపోయిందా?

Wednesday 15th May 2019

జెట్‌ ఎయిర్‌వేస్‌ సంక్షోభంపై ఎన్నో అనుమానాలు ప్రమోటర్లు నిధులు మళ్లించినట్టు ఆరోపణలు దీనిపై ఇప్పటికే ఆర్‌వోసీ దర్యాప్తు ఎస్‌ఎఫ్‌ఐవో దర్యాప్తుతో వెలుగుచూడనున్న వాస్తవాలు రుణాలిచ్చిన బ్యాంకుల చేతుల్లోకి నియంత్రణ అయినా నిధులు సాయం చేయకపోవడంపై సందేహాలు కొనుగోలు దారుల కోసం అన్వేషణ దీన్నో స్కామ్‌గా అభివర్ణిస్తున్న ప్రతిపక్ష కాంగ్రెస్‌  ఇన్ని జరిగినా జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు పట్ల ఆసక్తి న్యూఢిల్లీ: విమానయాన రంగంలో 25 ఏళ్లకు పైగా దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ అగ్రగామి సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందిన జెట్‌

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 15th May 2019

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  గుజరాత్‌ ఇండస్ట్రీస్‌ పవర్‌ కంపెనీ:- గుజరాత్‌ ఉర్జా వికాస్‌ నిగమ్‌ టెండర్‌ దక్కించుకునేందుకు విజయవంతంగా బిడ్‌ పక్రియను పూర్తి చేసింది.  జెట్‌ ఎయిర్‌వేస్‌:- కంపెనీ సీఈవో పదవికి వినయ్‌ దుబే రాజీనామా చేశారు. టోరెంటో పవర్‌:- ప్రైవేట్‌ పద్ధతితో రూ.270 కోట్ల విలువైన ఎన్‌సీడీల ఇష్యూను జారీ చేసింది.  ఆర్చిడ్‌ ఫార్మా:- రైస్‌డ్రోనేట్‌ సోడియం ఔషధాల విక్రయాలకు యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి అనుమతులు దక్కించుకుంది. ఫ్యూచర్‌ సప్లై చైన్‌:-

Most from this category