News


పసిడి మెరుపు- చమురు డీలా

Monday 27th January 2020
Markets_main1580097244.png-31222

కరోనా వైరస్‌ భయాలు
బలపడిన జపనీన్‌ యెన్‌
ట్రెజరీలకు డిమాండ్‌- బాండ్ల ఈల్డ్స్‌ డౌన్‌

చైనాలో తలెత్తిన కరోనా వైరస్‌ దెబ్బకు మరోసారి ముడిచమురు ధరలు డీలాపడగా.. పసిడికి డిమాండ్‌ పెరిగింది. మరోపక్క రక్షణాత్మక పెట్టుబడిగా భావించే జపనీస్‌ కరెన్సీ యెన్‌ బలపడింది. ఊపిరితిత్తుల వ్యాధులకు కారణమవుతున్న కరోనా వైరస్‌ ఇతర దేశాలకూ పాకుతున్న వార్తలతో నేడు(సోమవారం) ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు పతనంకానున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ అంశాన్ని ఫ్యూచర్స్‌ మార్కెట్‌ ప్రతిబింబిస్తున్నట్లు తెలియజేశారు. కాగా.. నేటి ట్రేడింగ్‌లో ముడిచమురు ధరలు 2.5 శాతం క్షీణించగా.. డాలరుతో మారకంలో జపనీస్‌ యెన్‌ 0.5 శాతం పుంజుకుని 108.73ను తాకింది. ట్రెజరీ బాండ్ల ధరలు బలపడగా.. పదేళ్ల బాండ్ల ఈల్డ్స్‌ 1.627 శాతానికి చేరాయి. ఇది మూడున్నర నెలల కనిష్టంకాగా.. లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ చమురు ఇంట్రాడేలో బ్యారల్‌ 59 డాలర్ల దిగువకు నీరసించింది. ఇక  న్యూయార్క్‌ మార్కెట్లో నైమెక్స్‌ బ్యారల్‌ 52 డాలర్ల స్థాయికి చేరింది. వెరసి చమురు ధరలు అక్టోబర్‌ తదుపరి కనిష్టస్థాయిలను తాకాయి. 

ప్రస్తుతం ఇలా
బ్రెంట్‌ చమురు బ్యారల్‌ ఉదయం 9.15 ప్రాంతం‍లో 2.25 శాతం పతనమై 59.34 డాలర్ల వద్ద కదులుతుంటే.. నైమెక్స్‌ 2.35 శాతం వెనకడుగుతో 52.92 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక న్యూయార్క్‌ కామెక్స్‌లో పసిడి ఔన్స్‌(31.1 గ్రాములు) 0.5 శాతం పుంజుకుని 1580 డాలర్లను తాకింది. ఈ బాటలో వెండి ఔన్స్‌ 0.6 శాతం బలపడి 18.23 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
 You may be interested

లాభాల్లో ఐసీఐసీఐ బ్యాంకు షేరు

Monday 27th January 2020

డిసెంబర్‌ త్రైమాసికంలో మంచి ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంకు షేరు సోమవారం లాభాల్లో ఆరంభమైంది. గత ముగింపు రూ.533.85తో పోలిస్తే దాదాపు ఐదు రూపాయల లాభంతో రూ. 538.50 వద్ద షేరు ఆరంభమైంది. అనంతరం రూ. 543.70 వరకు ఎగిసి 9.20 నిమిషాల వద్ద దాదాపు 1.3 శాతం లాభంతో రూ. 540 వద్ద కదలాడింది. షేరు ప్రస్తుతం తన స్వల్పకాలిక డీఎంఏ స్థాయిలకు పైన ట్రేడవుతోంది. సోమవారం

దీర్ఘకాలంలో మోస్తరు రాబడులనిచ్చే ఫండ్‌

Monday 27th January 2020

టాటా లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ మార్కెట్ల ర్యాలీలో లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ పాత్ర అన్ని సమయాల్లోనూ ఉంటుంది. పైగా లార్జ్‌క్యాప్‌ విభాగంలో రిస్క్‌ కొంచెం తక్కువగా ఉంటుంది. ఇక మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌లో రిస్క్‌ ఎక్కువగా ఉన్నా కానీ, దీర్ఘకాలానికి రాబడులు కూడా అధికంగానే ఉంటాయి. ఈ రెండు విభాగాల్లోనూ ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా దీర్ఘకాలంలో పెట్టుబడులపై సంపద సృష్టించే విధంగా టాటా లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్‌ పనిచేస్తుంటుంది. దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌

Most from this category