News


3నెలల గరిష్టానికి పసిడి

Tuesday 31st December 2019
Markets_main1577775268.png-30557

ప్రపంచమార్కెట్లో పసిడి ఫ్యూచర్ల ధర ఈ ఏడాది చివరి రోజైన డిసెంబర్‌ 31న 3నెలల గరిష్టాన్ని అం‍దుకుంది. సంవత్సరాంతపు కొనుగోళ్ల పాటు డాలర్‌ బలహీనత పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్ల మద్దతునిచ్చాయి. ఆసియాలో మంగళవారం ఔన్స్‌ పసిడి ధర 9డాలర్లు బలపడి 1,527డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అప్‌ట్రెండ్‌లో 1,535డాలర్ల వద్ద కీలక నిరోధ స్థాయి ఉంది. మొదటి దశ వాణిజ్య ఒప్పంద పత్రాలపై ట్రంప్‌, జింగ్‌ పింగ్‌లు వచ్చే నెల మొదటి వారంలో సంతకాలు పెట్టే అవకాశం ఉందని వైట్‌ హౌస్‌ ట్రేడ్‌ అడ్వైజర్‌ పీట్‌ నవర్రీ సోమవారం తెలిపారు. ఫలితంగా రాత్రి అమెరికా మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర అరడాలరు స్వల్పలాభంతో 1,518 డాలర్ల వద్ద స్థిరపడింది. అమెరికా చైనాల మధ్య ఏడాదిన్నర కాలం పాటు సాగిన వాణిజ్య ఉద్రిక్తతలు, పలు ప్రధాన దేశాల కేంద్ర రిజర్వ్‌ బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గించడటం తదితర కారణాలతో ఈ ఏడాది పసిడి ప్యూచర్లు 16.23శాతం లాభాల్ని ఇన్వెస్టర్లకు పంచాయి. 2010 ఏడాది తరువాత ఒక ఏడాదిలో ఇంత స్థాయిలో లాభపడటం ఇదే తొలిసారి కావడం విశేషం. పసిడి బలపడేందుకు తోడ్పాటునందించిన అనేక కారణాల్లో డాలర్‌ బలహీనత ప్రధానమైనదని సీఎంసీ మార్కెట్స్‌ విశ్లేషకుడు యాంగ్‌ యెన్‌ అభిప్రాయపడ్డారు. నఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ క్షీణత పసిడికి డిమాండ్‌ను పెంచుతుందని యెన్‌ తెలిపారు. అయితే రానున్న రోజుల్లో పసిడి ర్యాలీ పరిమితం కావచ్చు. ఎందుకంటే రిజర్వ్‌ బ్యాంకుల రేటు తగ్గింపు సైకిల్‌ తుది దశను చేరుకుంది. వచ్చే ఏడాది(2020)లో సెంట్రల్‌ బ్యాంక్‌లు వడ్డీరేట్లను తగ్గించకపోవచ్చని యెన్‌ అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాదిలో ఫెడ్‌ మూడు సార్లు వడ్డీరేట్లను తగ్గించి ఈ డిసెంబర్‌లో వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. వడ్డీరేట్ల తగ్గింపు పసిడి ర్యాలీకి తోడ్పాటునిస్తా‍యి.

దేశీయ మార్కెట్లో అదే ట్రెండ్‌:-
అంతర్జాతీయ ట్రెండ్‌కు తగ్గట్లుగానే దేశీయంగా పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ నెలకొంది. ఫలితంగా ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.205లు పెరిగి రూ.39176.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ప్రపంచమార్కెట్లో పసిడి ఫ్యూచర్లకు కొనుగోళ్లకు మద్దతు లభించడం, దేశీయ ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి ఫ్లాట్‌ ట్రేడింగ్‌, స్టాక్‌ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి తదితర కారణాలు పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ పెంచుతున్నాయి. నిన్నరాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్లో పసిడి ధర రూ.109లు నష్టపోయి రూ.38,971 వద్ద స్థిరపడింది. You may be interested

నిర్మలా ఏం చెబుతారో...

Tuesday 31st December 2019

సంవత్సరం చివరి రోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం జరుగుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత స్థితిలో ఆర్థిక మంత్రి ఏవిషయమై ఈ సమావేశం నిర్వహిస్తున్నారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తంమీద ఆర్థిక వ్యవస్థలో పునరుజ్జీవానికి సంబంధించిన చర్యలనే మంత్రి ప్రకటించే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా రూ. 100 లక్షల కోట్ల జాతీయ

ఆటో, ఆటో విడిభాగాల షేర్లు భేష్‌

Tuesday 31st December 2019

ఆర్థిక మందమనంలోనూ ఆశలు రేపుతున్న ఆటో రంగం క్వాంటమ్‌ సెక్యూరిటీస్‌ డైరెక్టర్‌ నీరజ్‌ దివాన్‌ ఇప్పటికే ఆర్థిక మందగమన ప్రభావం పలు రంగాలపై కనిపిస్తోంది. అయితే ఇటీవల ఆటో, ఆటో విడిభాగల పరిశ్రమలో కొంతమేర ఆశావహ పరిస్థితులకు బీజం పడిందని చెబుతున్నారు క్వాంటమ్‌ సెక్యూరిటీస్‌ డైరెక్టర్‌ నీరజ్‌ దివాన్‌. ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్థిక మందగమనం, బడ్జెట్‌ తదితర అంశాలపై నీరజ్‌ పలు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం.. ఈ

Most from this category